30, ఏప్రిల్ 2010, శుక్రవారం

******************

ఈరోజు... అంతా సినిమాలు చూడటం తోనే సరిపోయింది.. అనుకుంటా... ఏంటో చాలా ఖాళీ గా అనిపిస్తుంది..మొన్నటి దాక బుక్స్ తోనే.. సరిపోయేది.. వాటిని నేను.. అవి నన్ను... చూడడం.. అవేమో.. పాపం చదవవే తల్లి.. పట్టుకుని పడుకోకు.. అని చూస్తుంటే నన్ను.. నేనేమో.. ఎందుకేయ్ ఇంత బరువు ఉన్నావ్.. కొంత బరువు తగ్గు.. అనుకోవడం :-) :-)

సెలవలు ఉంటే.. పడుకోవడం... సినిమాలు చూడడం.. బయటికి వెళ్ళాలన్నా.. కూడా అమ్మో ఎండలకి రూం దాటి వెళ్ళాలని లేదు... నెట్ ఏమో తెగ విసిగించేస్తుంది.. disconnect అవ్వడం అలా... wi-fi తో ఇదే తంటా సిగ్నల్ అందకపోతే...

ఈరోజు ఏం చేసాను అంటే.. ఎందుకో.. నా లైఫ్ లో నా ఫస్ట్ థింగ్స్ రాయాలనిపించింది.. నా డయరీ లో... అలా గుర్తు తెచ్చుకుంటూ.. చాలా రాసేసా.. పెన్, choclate, ఫ్రెండ్, టీచర్ అలా అలా.. అబ్బో.. చాలా లిస్టు వచ్చిన్దిలే.. మీరు కూడా ట్రై చెయ్యండి.. రాస్తూ గుర్తు తెచ్చుకుంటుంటే.. భలే బావుంటుంది.... ఫీలింగ్ ఎలా గయినా వేరు....


charging పెట్టడం అవసరం లేని మొబైల్ ఉంటే బావుండు.... పాటలు వినడం ,, battery డౌన్ అవ్వడం.. మళ్లీ పెట్టడం.. ఒక్కోసారి సరిగ్గా.. ప్రయాణం చేస్తున్న టైం లో ఆఫ్ అయిపోతది.. అప్పుడు చూడాలి .. సోకేట్ కోసం వెతకడం గోల అబ్బో... నోకియా వి charging బాగా ఇస్తాయి కాని సోనీ piece లు చాలా లుక్ ఉంటాయి...


ఇంతకీ సంగతి ఏంటి అంటే.. చానల్స్ అలా మారుస్తుంటే... తేజ లో అనుకుంటా.. "మెంటల్ కృష్ణ " సినిమా... బాబోయ్... అయిదు నిమిషాలు చూసా.. మెంటల్ వచ్చింది.. స్క్రీన్ ప్లే కి... సినిమాలో ఎండింగ్ బావుంటుంది ఏదో ఉద్దేశం తో అలా చేస్తాడు అని ఎక్కడో చదివినట్టు గుర్తు... అమ్మో.. ఎండింగ్ దాక చూస్తే.. పిచ్చి వచ్చేదేమో.. డైలాగ్ లకి.. చూపించే torture కి.... ఏదో.. ప్రశాంతత కోసం t.v పెడితే.. ఇలా ఉంది.. పోనీ ఇంకేదయినా పెడదాం అంటే.. అన్ని ఇలానే ఏడ్చాయి... :-(

సింహా.. మూవీ రిలీజ్ కదా.. ఈరోజు.. బాలకృష్ణ కి గత అయిదు సంవత్సరాలుగా సినిమాలు లేవు మంచివి.. కొన్ని సినిమాలు మరీ ఎక్కువ చూపించి అయన ఇమేజ్ పాడు చేసాయి... అయన ఎంతయినా మెచ్చుకోవాలి ఎవరండీ అంతా తరుచుగా సినిమాలు చేస్తునారు బిగ్ హీరో ఇమేజ్ ఉన్న వాళ్ళు.. మహేష్ బాబు సినిమా.. ఎప్పుడో.. రెండు సంవత్సరాలకి ఒకటి .. నేనేమైన తక్కువా అని పవన్ కళ్యాణ్ ఇంకా.. లేట్ గా సినిమా చేస్తునాడు... ఆదేపుడో.. నా graduation మొదటి సంవత్సరం లో వచ్చినది.. నాది అయ్యిపో.. వచ్చింది కాని అయన నెక్స్ట్ సినిమా స్క్రీన్ మీద కనిపించలేదు ,,,, :-)

మీకు తెలుసా ఇది moonlight టపా.. అలా చల్ల గాలిలో.. .. ఆకాశం చూస్తూ...రాస్తున్నా నాకు అయితే.. వాటర్ ఏరియా దగరికో వెళ్ళాలి పిస్తుంది... అలా అది ఎలాగో కుదరదు కాని నా పక్కన నీళ్ళ గ్లాస్ లో నక్షత్రాలు మెరుస్తూ కనిపిస్తున్నాయి తెలుసా.. .. :-) :-)


ఆకాశం లో నక్షత్రాలు ఎక్కడ కనిపిస్తాయి సరిగ్గా ఏదో ఒకటో.. రెండో... అదే చిన్న ఊరు కి వెళ్తే.. అసలు.. చాలా బావుంటుంది.. పందెం కోడి మూవీ లో.. చూపిస్తాడు.. .. గుర్తుందా ఎవరికయినా... ulti...... !!

2 కామెంట్‌లు:

  1. బాగుంది నీ టపా, అసలు సంబంధం లేని విషయాలు అన్నీ కలిపి చాల బాగా రాసావు.. రాసేప్పుడు ఏది గుర్తు వస్తే అది రాసేసావా?

    పాపం చదవవే తల్లి.. పట్టుకుని పడుకోకు.. అని చూస్తుంటే నన్ను.. నేనేమో.. ఎందుకేయ్ ఇంత బరువు ఉన్నావ్.. కొంత బరువు తగ్గు.. అనుకోవడం

    :-)

    రిప్లయితొలగించండి
  2. @ nenu ye tapaa raasina anthe... appudu em raayali anipisthe raastaanu...

    రిప్లయితొలగించండి