18, ఏప్రిల్ 2010, ఆదివారం

ఈ సినిమా చూసారా....??

నేను అప్పుడెప్పుడో.. "అరుంధతి" సినిమా చూసాను... సినిమా చూసినప్పుడు... మీకు గుర్తు ఉండే ఉంటుంది... drums తో ఒక డాన్సు ఉంటుంది... మువ్వలు విసేరితే... దానికి అనుగూణంగా అనుష్కా డాన్సు చేస్తుంది.... నాకు అప్పట్లో కాన్సెప్ట్ చాలా నచ్చింది.. అసలు భలే అలోచించి పెట్టారు అనుకున్నా సినిమా వాళ్ళు...

తర్వాత ఒకరోజు utv మూవీస్ చూస్తుంటే.. ఒక chinese మాండరిన్ సినిమా వస్తుంది... దానిలో హీరో ఇన్ ఏమో.. గుడ్డి అమ్మాయి... సినిమా బావుంది అని.. అలా చూస్తూ ఉన్నా... ఇంతలో అమ్మాయి same మన అరుంధతి డాన్సు వెర్షన్ వేసింది... అస్సలు ఎంత బాగా చేసింది అంటే.. ఒకవేళ మన వాళ్ళు దాని నుండి కాపీ కొట్టి తీసుంటే..(అయ్యే ఉండచ్చు) అనుష్కా ఒక పదో వంతు కూడా చేసి ఉండదు...

ఇంతకీ సినిమా పేరు ఏంటి అంటే ......"house of flying daggers" వీలుంటే dvd చూడండి.. డాన్సు వెర్షన్ చాలా బావుంటుంది....

అవునండి... మొన్న" వరుడు" సినిమా లో తెలుగు ఇంటి పెళ్లి అని.. పెళ్లి కొడుకుని ఏనుగు మీద ఉరేగించాడు కదా.. మన వైపు ఏ ప్రాంతం లో ఈ విధంగా చేస్తారో మీకు తెలుసా..? తెలిస్తే కొంచెం చెప్పండి....

3 కామెంట్‌లు:

  1. అవునండి ఆ చైనా మూవీ నేను చూసా,,simply superb

    రిప్లయితొలగించండి
  2. ఒరిజినల్ ను కాచ్ చేశారు..దాని కాపీయే అయి వుంటుంది ..చాలా సీన్స్ మనకు నచ్చినవి తర్వాత ఒరిజినల్స్ దొరికిపోతుంటాయ్...

    రిప్లయితొలగించండి