24, ఏప్రిల్ 2010, శనివారం

ఏం పేపర్ రా.. బాబు... !!!

చాలా రోజుల తర్వాత.. నేను పేపర్ చదివాను... ఈరోజు... అప్పుడు అనిపించింది............
దేవుడా... అనవసరంగా పేపర్ తీసానేమో.. అని...

పేపర్ లో.. ఎప్పుడు మంచి న్యూస్ లు ఉండవనుకో........... అది నాకు బాగా తెలుసు...... నేను ఎక్కువ deccan chronicle చదువు తాను .. తెలుగు పేపర్ ఏమో.. ఈనాడు వస్తుంది ...ఇంటికి , ఈమధ్య సాక్షి కూడా.. తీసుకు ఉంటునారు .. మా వాళ్ళు...

పేపర్ మాత్రం భలే కలర్ ఫుల్ గా ఉందిలే.........
కానీ సంగతి ఏంటి అంటే.. టైమ్స్ ఇంగ్లీష్ పేపర్ లో... ముందు రోజు వచ్చే మూవీస్ న్యూస్ లు అన్నీ.. దిట్టో.. నెక్స్ట్ డే సాక్షి లో ఉంటాయి... :-) (ఎందుకో.. నాకు తెలీదు... )


సరే,, ఇంతకీ.. పేపర్ తీశాను... ఒక చోట ఏమో.. అమ్మాయి పుట్టింది అనీ. చిన్న పిల్లని.. బతికుండగానే సమాధి చేసేద్దాం అని... ఒక మహా తల్లి... స్మశానం లో ఇచ్చేసింది.. చనిపోయింది అని అబద్దం చెప్పి... ( ఏం చెయ్యాలి అంటారు ఇలాంటి వాళ్ళని )....

కామెడీ గా అయితే.. మన తెలుగు సినిమాలు ఏక దాటిగా.. మూడు రోజులు చూపిస్తే.. నాలుగో రోజు ఏం జరుగుతుందో.. చుట్టు పక్కల మర్చిపోయి.. మతి పోతుంది....

సీరియస్ గా అంటారా................ ఏం చేసినా పాపం లేదు.. (యమ ధర్మ రాజు కూడా lite తీసుకుంటాడు మనం ఏమ్చేసినా.....)


సరే.. మళ్లీ ఇంకో పేజి తిప్పా....... వరసగా అయిదు చిన్న పిల్లల ఫోటోలు ఉన్నాయి.. వాళ్ళ వయసు.. నాలుగు ఏళ్ళ లోపేమో... దొరికారు.. శెషు విహార్ లో ఉన్నారు.. ఎవరయినా సంప్రదించండి.. లేకపోతే దత్తత ఇచ్చేస్తాము అని..........

నాకు అయితే చాలా బాధ అనిపించింది............... సరయిన తల్లి తండ్రులు లేకపోతే ఇంతేనేమో........ !!

దెబ్బకి రెండు రోజులు పేపర్ ముట్టుకోను ఏమో.........

2 కామెంట్‌లు: