14, ఏప్రిల్ 2010, బుధవారం

ఈ ఫోన్ ఎవడు కనిపెట్టాడు????

అంటే ఎవరు కనిపెట్టారో తెలీక కాదు... కాని మధ్య అంత విసుగు వస్తుంది...
నిజానికి నాకు నా మొబైల్ అంటే ప్రాణం... బ్రహ్మ దేవుడు వచ్చి నిక్కీ మొబైల్ కావాలా నీ బ్లాగ్ కావాలా అంటే.. నా వోటు నా మొబైల్ కే...
ఎందుకు అంటే.. నాకు ఇష్టమయిన చాలా మంది.. ఎక్కడో.. వేరే దేశాలలో.. వేరే చోటుల్లో ఉన్నారు... అయినా కూడా వాళ్ళని మిస్ అవ్వట్లేదు అంటే... కారణం నా జానూ... అదే నా మొబైల్ ని ముద్దుగా అంటున్నా...

నాకు ఆర్య 2 లో కాజోల్ qualities ఉన్నాయి అని మా వాళ్ళ అభిప్రాయం... ఎందుకంటే.. బాగా చిరాకు , విసుగు frustration వస్తే అంతా కోపం నా జానూ మీదే....

అయినా wrong కాల్స్ వస్తుంటే.... భలే గొప్ప చిరాకు వస్తుంది.... ఫోన్ చేసి. వీళ్ళు ఉన్నారా .. వాళ్ళు ఉన్నారా అనడం ...0లేరు అంటే... అయితే మీ పేరు చెప్పండి అనడం.... అసలు అబ్బాయిలకి వేరే పని లేకుండా పోయింది...
అమ్మో.. ఇప్పుడు అందరూ నా మీద పడతారేమో... అంటే నా ఉద్దేశం కొంత మంది అబ్బాయిలు అని....

hm.. అన్ని డబ్బులు వేస్ట్ చేసి కాల్ చేసి మరీ తిట్టించుకోవడం లో అదేం ఆనందం అండి... వీళ్ళకి...

ఒక రెండు నెలల క్రితం.. మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఇలా కాల్స్ వస్తుంటే... నాకు ఇచ్చి నువ్వు మాట్లాడు.. అంది... సరే.. కదా.. అని.. గట్టిగా చెప్పా.. ఏదో.. నాకు వచ్చిన భాషలో ..... ఇది నా.. నెంబర్ ఎందుకు కాల్ చేస్తున్నావ్ అని... అప్పటి దాకా కాల్స్ ఒక్కటే చేసే వాడు కాస్త నేను మాట్లాడిన తర్వాత.. కాల్స్ తో పాటు మెసేజ్ లు కూడా.... మిస్. కోయిల అని పేరు పెట్టాడు మహానుబావుడు నాకు...

దానిలో నిజం ఎంత ఉందో.. నాకు తెలీదు కాని.. ఒళ్ళు మండి.. కొంచెం గట్టిగా... నెంబర్ ట్రాక్ చేసి కంప్లైంట్ ఇస్తా నంటే.. భయపడి మానేసాడు...


అయినా సిం కార్డు లు.. ఫ్రీ గా అమ్ముతుంటే ... మనిషి ఒక పది తీసుకుని... ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు... కొన్ని రోజులకి.. పది సిం లు కొంటే .. ఒక ఫోన్ ఫ్రీ ఏమో... చెప్పలేం లెండి....

నాకు తెలిసి కొంచెం strict restrictions ఉండాలి సిం issue చెయ్యడం లో.... వివరాలు కూడా.. సరిగ్గా తీసుకోవాలి.. అంటే కానీ.. బటాని కన్నా.. చవకగా అమ్మేస్తే ఎలా అండి.....

ఇంకా బటానిలే ఎక్కడ అయినా దొరకవేమో.... చుక్క నీరు లేని ఊరుల్లో.. కూడా వీధికి పది మొబైల్ సిం కార్డు షాప్ లు ఉంటున్నాయి ... !!!!!

బ్లాగ్గింగ్ వల్ల నాకు వచ్చిన మంచి అలవాటు "అండి" అన్న పదం ఏమో... మాములుగా అయితే.. అసలు ఎవరిని అలా అనను.. మరీ పెద్ద వాళ్ళు అయితే తప్ప.... మా తాత వాళ్ళ ఊరు పశ్చిమ గోదావరి...(ఏలూరు) అటు వైపు.. వాళ్ళు అయితే.. అందరినీ.. అండి అంటారు... వాళ్ళకన్నా చిన్న వాళ్ళని కూడా.... చాలా గౌరవం... ఇస్తారు , గొడవలు వస్తే కూడా.. విధంగానే తిడతారు లెండి...

2 కామెంట్‌లు:

  1. ఆయ్ అలాగండీ..మీ బ్లాగ్ బాగుందండీ..ఓ పాలి మా తూగోజి రండీ..ఆయ్ మరి ఉంటానండీ.

    శ్రీవాసుకి
    http://srivasuki.wordpress.com

    రిప్లయితొలగించండి