30, అక్టోబర్ 2010, శనివారం

30-10-2010

బావ సినిమా rod అంట.. చూసిన వాళ్ళు వచ్చి కథ లు కథలుగా చెపుతున్నారు .. :-( నాకు ముందు అయితే సిద్దార్థ కి పేరే సెట్ అవ్వలేదు... :-( సిద్దు.......... ఎక్కడ వీర బాబు ఎక్కడ.. అయినా తనకి క్యారెక్టర్ సెట్ అవ్వలేదు నన్ను అడిగితే.... location చూడడానికి కూడా లేదు..... :-( బాబోయ్ ఏం సినిమాలో........... !!!!!

ముందు రోజు సినిమాలు చూడకూడదు అని అర్ధం అయ్యింది ఓవర్ అల్ గా.....


Almost every man wastes part of his life in attempts to display qualities which he does not possess, and to gain applause which he cannot keep. ~Samuel Johnson,


నిజమే కదా..... !!!




ఒకటి మాత్రం చాలా నిజం....

If you don't get lost, there's a chance you may never be found.....


మన కు ఇష్టమయిన దానిలో మనని మనం కోల్పోవాలి....

మనకు ... మనవాళ్ళకు సంతోషాన్ని ఇస్తుంది అన్న దానిలో మనను మనం కోల్పోవాలి ...

అప్పుడే మనకు ఈ ప్రపంచమంతా మన చేతుల్లో ఉంటుంది...

మన
destiny ని రాసే పెన్ కూడా మన చేతుల్లోనే ఉంటుంది ... :-)



ఇంకా parker తో రాసుకుంటారో... నటరాజ్ పెన్సిల్ తో రాసుకుంటారో మీ ఇష్టం :-P







24, అక్టోబర్ 2010, ఆదివారం

*****************

రక్త చరిత్ర.... పేరుకి తగ్గట్టే ఉందంట..... :-)

ఏదో ఒక కాంట్రావేర్సి ఉండాలి ఏమో వర్మ సినిమా అంటే..... ntr గారి ఫాన్స్ hurt అయ్యారు .... :-( ఒంగోలు లో సినిమా కూడా అడనివ్వట్లేదు అన్నారు.......... ?????

నేను అయితే రెండో పార్ట్ లో సూర్య ఆక్షన్ కోసం ఎదురు చూస్తున్నా........ :-)

నాకు రామ్ గోపాల్ వర్మ మాట తీరే ఏదో కొత్తగా ఉంటుంది........... ఏమోలే ఒక్కొకళ్ళది ఒక్కో ఆలోచనా విధానం.... అనుకోండి..... :-)

రెండు రోజులుగా.. evenings భలే బావుంటు నాయి ... పౌర్ణమి.. దగ్గర వస్తుంది కదా......... !!!! రూం లో కానీ ఫ్లాట్ లో కానీ అలా లాక్ అయ్యి ఉండకుండా కొంచెం బయట తిరిగితే అది నిజంగా చాలా బాగా ఉంటుంది .. మీరు కూడా టైం చూసుకోండి.. తర్వాతా మీ మూడ్ లో change చూసుకోండి......... :-)

Each morning when I open my eyes I say to myself: I, not events, have the power to make me happy or unhappy today. I can choose which it shall be. Yesterday is dead, tomorrow hasn't arrived yet. I have just one day, today, and I'm going to be happy in it. :-) :-)



నిజమయిన సంతోషం లో తెలియని ఆనందం ఉంది.............. పెద్ద paradox statement రాసాఅనుకుంటా.... !!!!


మనం ఒకటి మర్చిపోతాం ఆనందం అనేది.. మనకు మన దగ్గర లేనిది పొందినప్పుడు.. రాదు.... కానీ మనకిఉన్నదానిని మనం గుర్తించి నప్పుడు.. దానిని మనం appreciate చెయ్యగలిగిన అప్పుడు ... అది వేరేవాళ్ళు చేసినప్పుడు మన హప్పినెస్స్ పది ఇంతలు అవ్తుంది అనుకోండి............ !!!

If you search the world for happiness, you may find it in the end, for the world is round and will lead you back to your door. ~Robert Brault, బావుంది కదా...............



22, అక్టోబర్ 2010, శుక్రవారం

ఇక సెలవు

నీవు నా దగ్గర లేవు అన్న తలపు... నా కన్నులు చమర్చినా.....
నీ జ్ఞాపకాలు.. నా కలలకు రంగులు అద్దెను....

నువ్వు నాతోనే ఉండాలి అన్న స్వార్ధం విడిచిన క్షణం.... నా పెదవులు.. నీ తలపుకి... పరవశించెను....

వింటున్నా నీ ప్రతీ మాట... కరిగిపోయిన కాలం సాక్షిగా....

జీవిస్తున్నా ఈ జీవితం నువ్వు పంచిన... నీ అధరం సాక్షిగా....

మరిచి పోయే ధైర్యం లేదు.. మరవాలనే ఆశ కూడా లేదు....


కానీ మరిచిపోతున్నా నా ఈ జీవితం.... నీ మధురమయిన.. ప్రేమ సాక్షిగా.........


కలిసిపోతున్నా ఈ నిశీధి లో .. నువ్వు లేని నా జీవితం సాక్షిగా....

మరు జన్మలో నీ పొత్తిళ్ళలో పాప గా మారి జీవించాలనే కోరిక సాక్షిగా.............. ఇక సెలవు........ ప్రియా...... !!!!

@ మల్లిక్

నా దిన ఫలాలలో .. నన్ను బుక్ చదవమన్నది... :-) సర్లే ఒకసారి చూద్దాం అనుకుని రూం లో ఉన్న నొవెల్స్ అన్ని వెతకడం స్టార్ట్ చేశా.. ఎలాగో ఏమి లేవు అనుకోండి.. సో లైబ్రరీ కి వెళ్దాం అని డిసైడ్ అయ్యా..... కాలేజీ లైబ్రరీ అంటే మూడ్ రాదు కానీ... జనరల్ లైబ్రరీ అంటే ఎక్కడ లేని ఆనందం ఎందుకో.... :-)

సరే... ఇక్కడ నేను ఒక బుక్ గురించి రాస్దాము అని డిసైడ్ అయ్యాను... మీకు ఎక్కడయినా దొరికితే చదవండి.... " నవ్వితే నవ రత్నాల్ -రచయిత మల్లిక్....


సూపర్ కామెడీ స్టోరీస్ నాకు అయితే బాగా నచ్చాయి........... మీకు కూడా నచ్చుతాయి .. దాన్లో "లవ్ మ్యారేజ్ అన్న స్టొరీ అయితే కాన్సెప్ట్ భలే బావుంది.. :-)

ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తున్నా అని చెప్పడానికి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది.... విషయం చెప్పే టప్పుడు తెగ కింద పడి పోతూ ఉంటుంది.... ( సిగ్గు తో మెలికలు తిరగడం వల్ల కాళ్ళు చీరకు అడ్డు వచ్చి..... :-) )
మొత్తానికి కష్ట పడి చెపుతుంది.. అబ్బాయి డాక్టర్.... వాళ్ళ ఇంట్లో ఏమి అభ్యంతరం లేదు... అమ్మాయి నాన్నకు ఇష్టం అయితే... వచ్చి మిగతావి మాట్లాడదాం అన్నారు....

కానీ వీళ్ళ నాన్న ఒప్పుకోడు......


ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకుని వచ్చేస్తుంది... ఎవరికీ చెప్ప కుండా..........


కొన్ని రోజులకి అన్నీ సర్దుకుంటాయి.....


అప్పుడు అమ్మాయి అమ్మ అడుగుతుంది తన భర్తని.... " ఏవండి ఇదేదో ముందే ఒప్పుకుని ఉండచ్చు కదా.... "

అప్పుడు అయన చెప్పే జవాబు ఏంటో తెలుసా.....


" అప్పుడే ఒప్పుకుని ఉంటే... అబ్బాయి నాన్న పెళ్లి మాట్లలకు వచ్చే వాళ్ళు... కట్నాలు అవి మనం అప్పుడు ఇచ్చుకోలేక పోతే... అసలు కే ఎసరు వచ్చేది.... ఇప్పుడు చూడు... కానీ ఖర్చు లేకుండా పెళ్లి అయిపొయింది... :=-)

ప్రేమ పెళ్ళి లలో ఇంత ఉందా..................... :-)


తెలివయిన మామ గారు కదా........... :-)

17, అక్టోబర్ 2010, ఆదివారం

సరదాగా .............

బ్లాగ్ రాసి చాలా రోజులు అవుతుంది............. ఏమైనా చేసేది ఉంటుందా అంటే.. ఆహా... ఎంత మాత్రం కాదు.............


ఏదో ఒక రెండు సినిమాలు............. ఖలేజా........... రోబో.. ఖలేజా బానే ఉంది.. అసలు మహేష్ బాబు............ అదిరి పోయాడు.. తన క్యారెక్టర్ సూపర్బ్.. మరి ..సినిమా ధియేటర్ లో జనాలు ఉండట్లేదు.... ఎందుకో... :-( కామెడీ అయితే చాలా బావుంది .................

బృందావనం పాత స్టోరీ అంటున్నారు... హీరో చేసినా ఒకలాగే ఉంటుంది.. కానీ ntr వల్ల డాన్సు అవి plus................

అయినా టైం పాస్ అవ్వాలి కానీ పాత స్టోరీ అయితే ఏంటి కొత్తది అయితే ఏంటి చెప్పండి.............. కాకపోతే.. ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకుంటే.. tragedy మూవీ అయినా పరవాలేదు కానీ వంద పెట్టి టికెట్ కొనుక్కుని entertain కాకపోతే మనం hurt అవతాం...

అయినా ఈరోజుల్లో.. సినిమా టికెట్ కన్నా అక్కడ multiplex లో పాప్ కార్న్ ,,ఫుడ్ కోర్ట్ లో తిండికే డబల్ అవుతుంది........... :-)


మొన్న హైదరాబాద్ లో orbit మాల్ లో ఇండియన్ కేఫ్ లో price లు చూస్తే అదే అనిపించింది .. దోస రేట్ లు 145 రూపాయల నుండి మొదలు పెట్టాడు.... :-)


నన్ను అడిగితే.. గోల అంతా తట్టుకోలేక జనాలు డౌన్లోడ్ చేసుకుని చూస్తునారు పైసా ఖర్చు లేకుండా..... !!!!

మాటల వారధి

మాటలతో వారధి కట్టి నిన్ను చేరాలనే నా కోరిక... వింతగా తోచినా...
ప్రియా.... ,,,,,
నీ తలపు .. నా మది తాకిన తరుణం నా పెదవి.. మూగబోయెనెందుకో................. !!!!!!

విరహం లోని వెచ్చదనం నా కన్నులు తడి చేసినది వింతగా.................. !

నీ సిరి మువ్వుల చిరు నవ్వులో.. నాడో నేను తప్పిపోయాను.............
నీ సిరి మల్లె స్పర్శ తో నా ఉనికి ని చూపవా................. !!

8, అక్టోబర్ 2010, శుక్రవారం

secret ...............

time is an illusion అంటా,,,,,,,,,, !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! ఇది einstein చెప్పిన మాట........

చాలా సార్లు మనం సమయం లేదని బాధ పడతాం మీరు కూడా అలాంటి వాళ్ళు అయితే దీనిని మనసులో బాగా గుర్తుంచుకోండి అప్పుడు sure గా బాధ పడరు.............

నాకు కూడా ఇది చూసిన ఓ.. మర్చిపోయా చదివిన తర్వాత అనిపించింది ...........

నేను నిన్న ఒక బుక్ చదివాను "the secret" బుక్ అంత చదివితే మెయిన్ పాయింట్ ఏంటి అంటే..... మనం దేని గురించి ఆలోచన చేస్తామో అవే మన జీవితం లో జరుగుతాయి అంటా........ "law of attraction "

చాలా సార్లు మనం ఇది అవ్వకుడదు లేదా ఈ పని చెయ్యకూడదు అనుకుంటాం కానీ అదే పని మళ్లీ చేస్తాం... ఎందుకంటే మన ఆలోచన అంతా ఆ చెయ్యకూడదు అన్న పని మీదే కాబట్టి .............

ఇది చెయ్యకూడదు అని కాదు మనం ఆలోచించాల్సింది.. ఇలా అవ్వదు నేను చెయ్యను అని sure గా నమ్మండి........

  1. ఒక technique చెప్పాడు... కావలసింది ఈ universe ని అడగండి... అది మీదే అని ఫీల్ అవ్వండి.... అది మీతో న్నాట్టే భావించండి .. అప్పుడు... అది మీది అవుతుంది..........

"ask,believe,receive........"

కింద పడితే,,,, :-)

జీవితం లో ఎప్పుడూ... మనలని చాలా ఎత్తులోకి తీసుకువెళ్ళే వాళ్ళ ని opt చెయ్యకూడదు మనం ..... కానీ మనం ఎత్తులో నుండి కింద పడినా కూడా.... నేను చెప్పేది physical గా పడడం కాదు అని.. మీకు తెలుసు కదా....... :-)మనం మానసికంగా కింద పడిపోయిన క్షణం లో మనలని మళ్లీ ముందు లాగా చెయ్యగల వాళ్ళ సహవాసం ఎప్పటికీ చాలా ఆనందాన్ని ఇస్తుంది.........
A loyal one is better than royal one.............

3, అక్టోబర్ 2010, ఆదివారం

ప్రతి క్షణం.. నీ కోసం..



ప్రతి క్షణం... నిరీక్షణం... నాకు శాపం..
నీ కోసం.. నా మనసు.. పలికె మౌన రాగం...

ప్రతి క్షణం.. తీపి ఊహలా.. ప్రతి క్షణం.. గుండె లొపల..
ప్రతి క్షణం.. నా శ్వాస లా.. నిను నేను తలచా ప్రియా..

నువ్వు లేక నేను లేకపొయినా.. తెలియని ఊహ ఆగునా..
మనసులో ఏదొ మూల మూలన.. తెలియని బాధ దాగునా..

కదిలే కాలమే నువ్వై.. మెరిసే మేఘమై వస్తుంటే..
ప్రతి క్షణం.. ఊహలొ.. నువ్వే వచ్చావెమో ప్రియా..
ప్రతి క్షణం.. గుండెలొ నిన్నె నే తలిచానె ప్రియా..