జీవితం అందమయిన కల అయితే .. దానిలో నే ఉండాలి అనుకుంటాము..అలా కాకపోతే.. కలలో అయినా అందమయిన జీవితం కోరుకుంటాము..అభినందన లో ఒక పాట లో లైన్ మీకు గుర్తు ఉండి ఉంటుంది ... "స్వప్నాలు అన్ని క్షణి కాలే.. సత్యాలన్నీ నరకాలే.." సరే గాని కలల గురించి కొన్ని విషయాలు చెపుతా.. అదే అండి రాస్తా.. చదవండి ...
మీకు తెలుసా....
- మనం కనే కలలు తొంబై శాతం ... మనం లేవగానే మర్చిపోతాం...
- గుడ్డి వారు కుడా కలలు కంటారు... అంటే.. పుట్టిన కొన్ని రోజులకి అంధత్వం వచ్చిన వాళ్ళు.. మాత్రమే......
- ప్రతీ మనిషి రోజు.. కలలు కంటాడు... ఒకవేళ మీరు నాకు కలలు రావు అంటే... మీరు మరచిపోయారు అని దాని అర్ధం..
- మీకు తెలుసా... మన కలలలో.. మనం ఎక్కువ మట్టుకు.. తెల్సిన మొహాలే కనిపిస్తాయి అంట...
- మీకు ఎప్పుడయినా ఈ సందేహం వచ్చిందా....? కలలు ఎందుకు కలర్ లోనే కనిపిస్తాయి... ఏవండోయ్ ... బ్లాకు అండ్ వైట్ లో వస్తాయి అంట ప్రపంచం లో నాలుగు శాతం మందికి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి