17, ఏప్రిల్ 2010, శనివారం

ఈ దారి మనసయినది..

లైఫ్ లో ఎప్పుడు క్రాస్ రోడ్స్ ఉంటాయి... అవి వున్నా ప్రతీ సారి తిక మకె.. ఏం తీసుకోవాలో తెలీదు... ఏమౌతుందో.. తెలీదు.. ఒక వేళ ఒక దారి ఎంచుకుంటే.... అంతా అయోమయం

మనం
ఎప్పుడో.. అప్పుడు ఇలాంటి పరిస్థితి.. ఎదుర్కునే.. ఉండి ఉంటాం... మన అమ్మ నాన్న.. సలహాలు ఒక టైం లో మనన్ల్ని చాలా ప్రభావితం చేస్తాయి.. ఒక్కోసారి వాళ్లకు నచ్చినవి చెయ్యాల్సి వస్తుంది ముక్యంగా.. చదువు విషయం లో.. ఎందుకంటే చాలా మంది ఏది అయితే వాళ్ళు చెయ్యలేక పోయారో వాళ్ళ పిల్లలను అలా చూడాలి అనుకుంటారు....

మాకు తెలిసిన వాళ్ళు ఒక అబ్బాయి ఉన్నాడు.. తనకి మాథ్స్ అంటే పిచ్చి.. ఎంత అంటే.. aprjc entrance attempt చేస్తే.. స్టేట్ ఫస్ట్ వచ్చింది దానిలో .. కాని వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు డాక్టర్ లే... సో.. ఇంజనీరింగ్ చెయ్యాలని ఎంత ఇష్టం ఉన్నా.. చివరికి మెడిసిన్ చేసాడు....

నా విషయం లో కూడా ఇదే.. కానీ చివరికి నాకు నచ్చిందే చేయ్యనిచ్చారు మా వాళ్ళు...

మనకి నచ్చిన దారిలో వెళ్తే.. ఒక వేళ.. ఏమైనా తేడ వచ్చినా.. మనం సర్డుకుపోతాం.. ఎందుకంటే కోరి మనం చేస్తున్నాం,, అదే ఇంకొకళ్ళ నిర్ణయం మీద మనం చెస్తూ ఉంటే.. ఏదో రోజు అనిపిస్తుంది.. ఒక వేళ నాకు నచ్చినది తీసుకుని ఉంటే.. పరిస్థితి వేరేలా ఉండేదేమో అని.. నిజంగా అది కష్టమయినది అయినా.. కూడా...


అందుకే మనకే నచ్చిన దారే ఎన్ని ముళ్ళు ఉన్నా మనసయినది.............. !!!!!

3 కామెంట్‌లు:

  1. బాగా చెప్పరు. కనీ 'నిర్ణయం','అభిప్రాయం' ,'సలహా' ఒకటి కాదు. తల్లిదండ్రులు ఏ విషయం లొనైనా తప్పొప్పులు చెప్పి పిల్లలు సరైన నిర్ణయం తీస్కొగలిగే సన్నద్ధం చేయడం సరైన పద్ధతి.

    రిప్లయితొలగించండి
  2. ee title mee sontamaa?ante ekkado vinnatlu vundi .mee creation ayite kadu kadaaa?

    రిప్లయితొలగించండి