13, ఏప్రిల్ 2010, మంగళవారం

అమ్మా.. తాత తప్పిపోయారు :-(

నా జీవితం లో రెండు సంఘటనలు అస్సలు మర్చిపోలేను.. ఒక వేళ అవి ఇంకోల జరిగి ఉంటె.. నేను ఈపాటికి ఎక్కడ ఉండే దాన్నో.. అమ్మో తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది.... మీరు కూడా నా లాంటి మంచి బ్లాగర్ ని మిస్ అయ్యే వాళ్ళు ఏమో.... :-)

నిజం చెప్పాలి అంటే చిన్నపటి నుండి ఇప్పటి దాకా కుదురుగా ప్రాబ్లం తెచ్చుకోకుండా.. తెప్పించకుండా లేనేమో... అందుకే అంటాను am cute .. create useless troubles every time... (cute కి అర్ధం నా విషయంలో )

నా చిన్నపుడు ఒకసారి... మేము హైదరాబాద్ లో exhibition కి వెళ్లాం .... నాంపల్లి దగ్గర... అప్పడు నాకు ఆరు ఏళ్ళు అనుకుంటా... మా అమ్మా వాలు షాపింగ్ కి వెళ్తే మమ్మలిని అక్కడ rides సెక్షన్ లోకి మా అత్త తీసుకుని వెళ్ళింది..
నేను మా కజిన్ ... వాడేమో.. neat గా మా అత్త చెయ్యి పట్టుకుని .. నేను మాత్రం పట్టుకోకుండా.. పక్కననడుస్తున్నా.. (కొంచెం ఎక్కువ కదా.. వాడి కన్నా నేను ఒక సంవత్సరం పెద్ద అన పొగరు)

అలా మొత్తానికి ఒక చోట ఆగి ఏదో చూస్తూ ఉండిపోయా... మా అత్త కంగారులే నన్ను చూసుకోకుండా వెళ్ళిపోయింది... ఇంకా చూడాలి నా ఏడుపు.... ఎక్కడ తిరుగుతున్నా ఒక చోటికే వస్తున్న... ఇంతలో పాపం ఎవరో కొంత మంది వచ్చి నన్ను అమ్మా దగ్గరికి తీసుకు వెళత రా అని అంటే.. ఇంకా.... ఏడుపు స్టార్ట్ చేశా... ఎందుకంటే.. మా స్కూల్ లో.. strangers తో మాట్లాడద్దు అన్న మాట గుర్తు వచ్చి

పాపం చేతిలో ఒక choclate పెట్టి (అప్పుడు ఇంకా అనుమానం పెరిగింది) చిన్నపుడు చాలా బొద్దుగా క్యూట్ గా ఉండే దాని ఏమో.. మా స్కూల్ దగ్గర ఒకాయన ఈలనే choclate ఇస్తా నంటే పరుగో పరుగు.. మల్లి ఆ గేటు నుండి వెళ్ళల.... :-)

...ఎలాగోలా
ఎంక్వయిరీ ఆఫీసు కి తీసుకువెళ్ళారు... నేను too స్మార్ట్ లెండి.. మా డాడీ ఫోన్ నెంబర్ ఇచ్చాను... అలానే వాళ్ళు అనౌన్స్ చేసారు.. లాస్ట్ కి అక్కడ ఉన్న మా అమ్మా వాళ్ళ కంటే.. పాపం మా డాడ్ చాలా ఫాస్ట్ గా వచ్చారు...

ఇంతకి వాళ్ళకి నేను ఎం చెప్పానో.. తెల్సా....??

"మా అమ్మా తాత గారు తప్పిపోయారు.. ప్లీజ్ వెతకరా అని.... !!!!"

ఇంకా రెండో.. సంఘటన అంటారా.. తర్వాత రాస్తా లెండి... నాకు టపా మరి కిలో మీటర్ లు ఉంటే అంత నచ్చదు...

మరి రెండు అని ఎందుకు అన్నా..అంటారా............. suspense అండి... మరీ.. అన్నీ చెప్పేస్తే ఎలా............ !!!
పార్ట్ 2 కోసం ఎదురు చూడండి :-):-)

3 కామెంట్‌లు: