14, మార్చి 2015, శనివారం

ఇంకా బోర్ కొడితే ఇంట్లో వంట చెయ్యి :P

 గత  నెల  రోజులుగా  పగలు  రాత్రి  ఆఫీసు  లోనే  కనిపిస్తున్నాను ఏమో   నా  మేనేజర్  పాపం   నాకు  ఒక  వీక్  vacation  ఇచ్చారు  , వీకెండ్స్  అన్నీ  కలిపితే  9 days  :) :)


పైన ఫోటో  చూసి  నా  బాయ్  ఫ్రెండ్  తో  ఏమైనా  అడ్వెంచర్  ప్లాన్  చేస్తున్నానేమో  అనుకోకండి  ,నాకంత  అదృష్టం  లేదు  :P

ఒక  రెండు  రోజులు  సెలవ  దొరుకితేనే .. నా  మైండ్  మంకీ  డాన్స్  చెస్తుంది  :) ఇంక  9 రోజులు  అంటే  మీరు  ఊహించుకోవచ్చు .. !!!

నా  ప్లానింగ్  మధ్యాహ్నం  1 నుండి  స్టార్ట్  అయితే  7.  30 దాకా  ఎక్కడ  వెళ్ళాలి  అని  ఎండ్  లేని  తెలుగు  సీరియల్  లా  సాగుతూనే  ఉంది ,చూపించిన  షాట్  పది  సార్లు  చూపించినట్టు ,చూసిన  ప్లేస్  నే  పది  సార్లు  చూస్తూ  ఉన్నా  .. :D  కళ్ళ  ముందు  స్టీవ్  వోజ్నిక్ , వెర్నెర్  heisenberg , స్టీఫెన్  హాకింగ్ ,  కనిపించి  డేట్  కి  పిలిస్తే ఎవరిని  choose  చేసుకోవాలో తెలియక  confusion  లో  పడినట్టు  అనిపించింది  :P

మున్నార్  తో  మొదలుపెట్టా ..  అన్నపూర్ణ  సర్క్యూట్  కూడా  వెళ్ళాలని  పించింది  ,కానీ  కంపెనీ  లేరు  ;( ;(

నేను  లిస్టు  చేసిన  కొన్ని  ప్లేస్  లు  ఏంటంటే
1. మున్నార్ ,అల్లెప్పి
2. శ్రావణ  బెలగోల ,హంపి
3. ఊటీ
4. కులు
5 లడఖ్

ఇంక  సాయంత్రానికి  మా  ఫ్రెండ్స్  గోవా  అంటే  అక్కడికి  వెళ్దాం  అని  డిసైడ్  అయ్యా  , ఇంట్లో  ఏమో " 3 డేస్  అమ్మాయిలు ,అబ్బాయిలు  కలిసి  వెళ్ళాల్సిన  అవసరం  లేదు,అక్కడ  తాగి  పడితే   ఇంటికి  తీసుకొచ్చే  వాళ్ళు  కూడా  ఉండరు , :P  .. ఇంట్లో   బుద్ధిగా కూర్చో ,కావాలంటే  ఇక్కడ  ఫీనిక్స్  మాల్  లో  ఏ  రంగు  వెలిసిన  డ్రెస్  లు  sale  పెడితే ,ఒక  రెండు  మూడు  కొనుక్కో ,ఇంకా  బోర్  కొడితే  ఇంట్లో  వంట  చెయ్యి :P  అని  చెప్పారు  :D  :D  Actual  గా  ఇలా  చెప్పలేదు , గోవా cousins  తో  వెళ్ళు  , ఇప్పుడు  ఎందుకు ,మనం  family  ట్రిప్  ప్లాన్  చేస్దాం అని  అన్నారు  ..( దాని  వెనక  అర్ధం  నేను  అర్ధం  చేసుకుని  మీకు  చెప్పాను   :P )

సరే  ఏ  రాయి  అయితేనేమి  పళ్ళు  ఉడ  కొట్టుకోవటానికి  అని ,  ఇంట్లో  వాళ్ళతో  వెళ్తే  వాలెట్   రూపాయి  తియ్యకుండా  ఫైవ్  స్టార్  ట్రీట్మెంట్  అనుకుని , వెళ్ళటానికి  ప్లేస్  లు  చూసీ  చూసీ ,నీరసం  వచ్చి  రెండు  గ్లాసులు  బూస్ట్  తాగి ,laptop  చూస్తుంటే ,మా  అక్క  కాల్  చేసింది , మీ  పిన్ని  ఈ  వీకెండ్  బెంగుళూరు  అనుకుంటుంది నువ్వు  మున్నార్  అంటున్నావు  ఏంటి  అని ....!!

మా  పిన్ని  నాకన్నా  బిందాస్  :) తనను  కూడా  తీసుకుని  వెళ్ళిపోదాం  అని  కాల్ చేస్తే , నేను ఈసారి  ఇండియా  ట్రిప్  లో   ఉడిపి ,sringeri  చూడాలి  అనుకున్నా  నిక్కీ,బెంగళూర్  నుండి  దగ్గర  కదా  ...  ప్లాన్  చెయ్యి  ఈ  వీక్  రోడ్  ట్రిప్ వెళ్దాం  అనింది .. !!!

మనసులో  (మరి  నా  మున్నార్ ,అల్లెప్పి  హౌస్  బోటు  .mommyyyy  :( :( ) .. !!!

పర్వాలేదు ,ఉడిపి  చాలా  బావుంటుంది , నేమలులు , చెట్లు ,సౌపర్నిక  రివర్ , బీచ్  లు .. :D

 కొన్ని  సార్లు  దొరికిన  దానిలోనే  ఆనందం  వెతుక్కో  వాలి  :) :P


18, జనవరి 2015, ఆదివారం

మీ ఫోన్ పాతది అయిపోయిందా :)

మీ  ఫోన్  పాతది  అయిపోతే  ఇప్పుడు  నేను మీకు  కొనివ్వలేను  కానీ  . :)  అసలు ఎందుకు  అలా  అడిగానంటే , ఇప్పుడు  ఒక  ఆండ్రాయిడ్  app  గురించి  రాద్దాం  అనుకుంటున్నా ...  S.M.T.H (send me to heaven)
ఇంతకీ  ఈ  ఆప్  ఏంటంటే  మీరు  మీ  ఫోన్  ని  పైకి  ఎగరేయ్యాలి   :D  :D  అప్పుడు  ఇది  మీరు  ఎంత  height  కి  ఎగరేసారో   చెప్తుంది   అనమాట  :D  :D  పొరపాటున  నిజంగా   కింద  పడేస్తే  మీ  ఫోన్  కి  స్వర్గ  ప్రాప్తి  అనేమో  అంత సింబాలిక్  గా  పేరు  పెట్టారు  :O :O



ఏంటో  జనాలకి  క్రియేటివిటీ  బోల్డు  పెరిగిపోతుంది  :)

ఈ  ఆప్  వాడాలంటే  either  మీ  ఫోన్  దాని  చివరి  దశలో  ఉండి  ఉండాలి ,or   మీరు మంచి  క్రికెట్  experience  ఉండి  ఉండాలి  (మంచి  catcher గా  :)  )

సరే .   ఇది  పక్కన  పెట్టేస్తే  ఈరోజు  ఒక  సినిమా  చూసా .. ఇంటి  పక్కన  షాపింగ్  మాల్ ఉంటే  డబ్బులు  సూపర్  ప్రాఫిట్స్   , అదేలే  ఆ  మాల్  లో  ఉన్నవాడికి  :D   ఇంతకీ  వెళ్లి  వచ్చింది  "Alone "  కి  బిపాషా  బసు ,ఇంకెవరో  కొత్త  హీరో.. సంగతేంటి  అంటే  ఇది  ఒక  హారర్  సినిమా  అక్కడ  అక్కడా    ఎక్కడ    జనాలు  వెళ్ళిపోతారు  అని  కొన్ని  A  రేటెడ్  scenes .. సౌండ్  ఎఫెక్ట్స్  తప్ప  అంత  ఏమి  లేదు .. !!    కరెక్ట్  గా  టికెట్  డబ్బులిని  10 తో  డివైడ్  చేస్తే  వచ్చే దానికన్నా  గొప్ప  రేటింగ్  కూడా  ఇవ్వటం  వేస్ట్  2. 5/5. 0

మీరు  ఎప్పుడైనా  Thought  Experiment  గురించి  విన్నారా  ??  interesting  గా  అనిపించింది   మీరు  కూడా  ఒకసారి  ఈ  వీడియో  చూడండి   ...

  

 అలాంటి  సోది  సినిమాలు  చూడటం  కన్నా  ఇలాంటి  వీడియోస్  చూస్తూ  టైం  పాస్  బెటర్  కదా ...  .. :)

17, జనవరి 2015, శనివారం

ఆ రెండు సినిమాలు కాకుండా :)

ఒక  వారం  నుండి  ఎవరిని  కదిపినా  అయితే  గోపాలా  గోపాలా   / లేకపోతే  ఐ  ... !! నేను  కూడా  చూసాను అనుకోండి  అది  వేరే సంగతి  :)  కానీ  వాటి  నుండి  నేను  తెలుసు కున్నది   ఏమి  లేదు  Vikram  తప్ప  "ఐ"  లో  నాకైతే  ఏమి  wow  factors  లేవు ....
రీసెంట్  గా  PK  చూసి  నప్పుడు , నాకు  కొంచెం  "OMG " సినిమా  గుర్తొచ్చింది , చాలా  తక్కువ  టైం  లో " గోపాలా గోపాలా"  చూడటం  వల్ల  ఇంచు  మించు  రెండూ ఒక  స్టోరీ లైన్   మీదే 3 గంటలు  సినిమా  తీసినా , ఒకటేమో  దేవుడు  లేడేమో  అన్న  విషయాన్నీ  straight  గా  చెప్తే ,రెండోది  చెప్తూ .. దేవుడిని  కూడా  పై  నుండి  కిందకు  తెచ్చేసింది  :)
ఈ  రెండూ  పక్కన  పెట్టేస్తే  "The Imitation Game", ఈ  సినిమా  నాకు  ఎందుకో  చాలా  తెలుసుకునేలా  చేసింది  అనిపించింది ... !!  Alan  Turing  లైఫ్  ఎంత  inspiring  గా  అనిపించిందో , అంత  బాధ  గా  కూడా  అనిపించింది , 41 years  కి ఆయనని  కేవలం  గే  అన్న  కారణం  వల్ల  ఆఖరికి  చనిపోవాలిసి  కూడా  వచ్చిందంటే  పాపం  కదా .. !!!

39 ఇయర్స్ తర్వాత  British  Queen  రాయల్ apology  ఇచ్చారంట ...  పోయిన లైఫ్  ఎలా  వస్తదో  మరి  :)
ఇంతకీ  Alan  "ఎనిగ్మా"  మెషిన్  మెసేజెస్ ని  decrypt  చెయ్యగలిగే  ఇంకో  మెషిన్ ని  కనుక్కున్నాడు .. దీని  వల్ల  వరల్డ్ వార్  2 ఒక  రెండు  నెలలు  తగ్గిందని  కూడా  అంటారు ..

ఇంతకీ  ఈ  "ఎనిగ్మా" ని  జర్మన్  వాళ్ళు  తయ్యారు  చేసారు ,అది  messages  ని  చాలా  స్ట్రాంగ్  గా  encrypt  చేసి  పంపగలదు ,(almost  26*26*26  కాంబినేషన్  ఒక్కో  లెటర్  కి )  దీనిని  use  చేసుకుని  Nazi  Army   కమ్యూనికేట్  అయ్యేది  అంట ,.
ఒక్క  సినిమా  చూడటం  వాళ్ళ  బోల్డు  విషయాలు  తెలుసుకోవచ్చు  కదా  :D  ఆ  మెషిన్  కి  భలే  పేరు  పెట్టారు  "ఎనిగ్మా "   :) దీనిని  బ్రేక్  చేసిన  మెషిన్  కన్నా  నాకు  దీని  గురించే  ఎందుకో  బాగా  తెలుసు  కోవాలని  అనిపించింది .. పేరు  బావుంది  కదా  అందుకనేమో :D

ఇది  పక్కన  పెడితే , చాలా  రోజులకి  హైదరాబాద్  వెళ్లాను , అక్కడ  T. S.R.T.C  బస్సులు  చూసి  తమిళ్  నాడు  బస్సులు  అనుకున్నా  :D  తర్వాత  వెలిగింది  అవి  తెలంగాణా  స్టేట్  బస్సులు  అని  :) ఏంటో  కెసిఆర్  official  కలర్  పింక్  చేసేసారు  అనుకుంటా  :) అన్ని  చోట్లా  ఎక్కడో  ఒక  మూల  పింక్  కనిపిస్తుంది ..  కొన్ని  రోజులకి  జైపూర్  కాదు  హైదరాబాద్  ని   "పింక్ సిటీ " అంటారేమో !!! 
నేను  ఈసారి  హైదరాబాద్  వెళ్లి  కనుక్కున్నా   ఇంకో  ప్లేస్  ఏంటంటే , జనరల్  బజార్   తరుణి " lane  లో ,ఒక  చాట్  ఇంకా  sandwich  చేసే  చిన్ని ...   షాప్ ,జనాలు  బార్లు  తీరి  ఉంటే  ఏంటో  అనుకుని  వెళ్లి ,మేము కూడా  cheese Toast ఆర్డర్  చేసాం . (20 Rs  ఈ  మధ్య  కాలం  లో  నేను  తిన్న  cheapest  sandwich ),ఎంత  బాగా  చేసాడంటే ,మళ్లీ  రెండో  రోజు  40 నిమిషాలు  డ్రైవ్  చేసుకుని  వెళ్ళాము  :D  (పిచ్చి  పలు  విధాలు కదా ) కానీ  అటు  వైపు  వెళ్తే  ట్రై  చెయ్యండి :)  especially  అబ్బాయిలు  మీ  అమ్మో/వైఫ్ /gf  ఓ  అక్కడ   షాప్  లో  బట్టలు  అన్నీ   తీయించి  ,వేయించి  కొనుక్కునే  type  అయితే  మీకు  మంచి  టైం  పాస్  :) :)

అదండీ  సంగతీ  సమాచారం  :)