10, ఏప్రిల్ 2010, శనివారం

ఇదా ప్రేమ.... ???


టపా లో రాసింది నా వ్యక్తిగత అభిప్రాయం.... ఎవరిని బాధ పెట్టాలని కాదు..... మొన్న మా ఫ్రెండ్ ఒక అమ్మాయి గురించి మాటలలో వచ్చింది వచ్చింది.. ఇంతకి సంగతి ఏంటి అంటే.. తను డ్రగ్ అడిక్ట్ అయ్యింది... కారణం ఇప్పటికే అర్ధం అయ్యి ఉంటుంది... రెండు అక్షరాలు "ప్రేమ"......

కలిసి
ఉన్నంత కాలం లోకమే తెలీదు.. ఒక్కసారి మనలని ... వదిలి వెళ్లి పోతే.. బాధ ఇలానే ఉంటుంది.. ఏం చెయ్యాలో తెలీదు.. ఎవరికీ చెప్పుకోవాలో తెలీదు... ఇలా ఆత్మ హత్యలు లేకపోతే డ్రగ్స్ .....

ఒకటి కాకపోతే ఇంకొకటి అనుకునే వాళ్ళ గురించి ఏం చెప్పలేము... ప్రేమ ఇది అది అని తిరగడం ఎందుకు.. తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు.. మా అత్తా వాళ్ళకి మాట ఇచ్చారు అని అనడం ఎందుకు??? అస్సలు ఇంట్లో ఒప్పించలేము అని తెలిసి నప్పుడు.. ఇంకొకళ్ళ జీవితం లోకి ఎందుకు రావడం అంటారు....?? తిరగడం గంటలు గంటలు.... కబుర్లు చెప్పుకోవడం ఇంతేనా..

కొన్నిసార్లు
పెద్ద వాళ్ళు కూడా.. విచిత్రంగా మాట్లాడుతారు.... మొన్న ఒక మహానుబావురాలు వాళ్ళ కొడుకు తో ఇలా అంది ..... " ప్రేమ ఇది అది తిరగడం నీ ఇష్టం ...పెళ్లి మాత్రం నేను చూపించిన అమ్మాయిని చేసుకో.. అని.... " ఇలా ఉంటే ఇంకా ఏం చెప్పాలి.....

నాకు ప్రేమ అంటే... గౌరవం లేదు అని కాదు.. మా అమ్మ వాళ్ళది కూడా.. 22 సంవత్సరాల క్రితం ప్రేమ పెళ్ళే.. అది కూడా.. కులాంతరం.. అప్పట్లో వాళ్ళ వాళ్ళు కూడా ఒప్పుకోలేదు.. అలా అని.. వదిలెయ్యలేదు కదా...

జీవితాంతం కలిసి ఉండాలి అన్నపుడే.. ఇంకొకళ్ళ మనసులో ప్రేమ అన్న దాని మనం ఉంచాలి లేకపోతే.. ఒకళ్ళ జీవితం చేతులారా నాశనం చేసిన వాళ్ళం అవుతాము....


ఇది
కేవలం అబ్బాయిలకు మాత్రమే కాదు ఎందుకంటే ఈరోజుల్లో అమ్మాయిలు కూడా అలానే ఉన్నారు లెండి మాటకి మాటే చెప్పుకోవాలి... మొన్న ఎప్పుడో.. మా అమ్మ తెలుగు సాక్షి పేపర్ చూసి అడిగింది... దానిలో రామ్ గారి నన్ను అడగద్దు.. లో.. అందరు అబ్బాయిలేనా రాసేది.. అమ్మాయిలు రాయరా అని........... ఎంతయినా అమ్మాయిలు తో జాగ్రత్త అని అబ్బాయిల తల్లులు వాపోతున్నారు........ అని... అబ్బాయిలు అంటే పైకి చెప్పుకోగలరు.. పాపం అమ్మాయిలకి సదుపాయం కూడా లేదులెండి...

ప్రేమ అనేది ఒక అపురూపమయిన భావం.. మనకోసం ఒకళ్ళు ఉంటున్నారు జీవితాంతం అన్న.. ఆలోచనే చాలా ఆనందాన్ని ఇస్తుంది... మన బాధ పడితే.. మన కన్నా ఎక్కువ కుమిలి పోయి.. మన సంతోషాన్ని.. ఇంకా.. పెంచే ఒక అపురూపమయిన సహావాసం...

మనసులో .. నిజంగా ప్రేమ ఉండి.. జీవితాంతం తోడు ఉండగలము.. ఎన్ని ఎదురయినా.. అంటేనే ప్రేమను వ్యక్త పరచండి .. లేకపోతే.. ఆ అందమయిన భావాన్ని మనసు లోనే పదిలంగా దాచిపెట్టుకోండి..
అంతేకాని... మద్య దారిలో ఎటు కాకుండా వదిలిపెట్టి పోకండి.. .... అదే నేను చెప్పదలుచుకునేది .............

లేని ప్రేమను వేరే అవసరాలకోసం వాడుకోవద్దు.............!!!!
అసలు దానికి ప్రేమ అని పేరు పెట్టద్దు...



9 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. మీరు చెప్పేది మరీ బాగుంది.
    అన్ని లెక్కలు చూసుకుని ప్రేమ మొదలువుతుందా..
    ఇంట్లో సమస్య వస్తుందా? ప్రేమిస్తే లైఫ్ సెక్యూర్డ్ గా ఉంటుందా? అమ్మకి నాన్నకి చెప్పి ప్రేమిద్దమా?
    ఇలా అలోచించి ప్రేమిస్తారా? ప్రేమ దానంతట అది పుడుతుంది అంతే..
    తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం వ్యక్తిగత సామర్ద్యం మరియు వారి మధ్య అండర్ స్టాండింగ్ మీద ఆధారపడి ఉంటుంది.
    మీ ఫ్రెండ్ కి చెప్పండి.. "వదిలి వెళ్ళిన వాడు హ్యాపి గా లైఫ్ ని ఎంజాయ్ చేసుంటే.. నీకెందుకు ఈ కర్మ అని.." ఫ్రెండ్స్ అందరు కలిసి తనని ఎప్పుడు సంతోషంగా ఉంచడానికి ప్రేయత్నించండి..
    తనకి మీరున్నారు అని అనిపించేలా చేయండి..

    "కావాలంటే ఎవరితో అయిన తిరుగు, పెళ్లి మాత్రం మేము చూసిన అమ్మాయి నే చేసుకోమన్నదా?" ఆవిడకి కూతుర్లు లేరా? ఆవిడ ఆడది కదా?
    అమ్మాయిల జీవితాలతో ఆడుకోమని ఇండైరేక్ట్ గా చేపుతుందన్నమాట.. ఏంటో జనాలు.

    రిప్లయితొలగించండి
  3. lekkalu chusukuni prema puttadu. kaani premichana tarvata okkalla jeevitham lo hopes penchi.. vadileyadam enti tarvaatha ani..... ??

    రిప్లయితొలగించండి
  4. I wonder ,how could a girl ,who couldn't read and write telugu has writing blogs in telugu?there must be a good editor behind this?what do you say nikitha chandrasena?

    రిప్లయితొలగించండి
  5. anyways you have the right to blog on every thing.But leave friendship and love.Bcoz I feel you dont know anything about these two.

    రిప్లయితొలగించండి
  6. @agnaata.. hw can u feel so.. if v r intreste anythng cud b possible... na varaku na blog ki nene editor ni... :-)

    రిప్లయితొలగించండి
  7. exams time lo kuda daily blog check chesukune time untunde neku.....hmmmm parledu.ya Language shouldn't be a barrier for thoughts kada........good job anyways.keep it up.I just read 2 topics,I'll definitely find time to read the rest.inkokati cheppanu kada love ni friendship ni vadiley mani......

    రిప్లయితొలగించండి
  8. love and friendship gurinchi maatlaaade hakku andhariki untundi....first of all...the keything in love and friendship is responisibility...prema puttatam ante(andulo responsibility kuda puduthundi anedi naa opinion)oblems so ade unte problems raavu....if there is no possibility to make one's love as life then one should convince other...thana life thanu chusukoni inkokarini gaaliki vadileyakudadu kadaa...appudu kudaa daanni love ante inka daaniki ardame ledu.o...wat i felt i write dont tke take it seriosly....

    రిప్లయితొలగించండి
  9. venu touch chesaav ga neelo intha ubdhani inni rojulu naaku enduku teliyaaledu antav

    రిప్లయితొలగించండి