9, ఏప్రిల్ 2010, శుక్రవారం

స్నేహం అంటే....???

ఒక అయిదేళ్ళ అబ్బాయి తన మిత్రుడిని అడిగాడంట
"స్నేహం అంటే ??"
అప్పుడు పిల్లోడు అన్నాడు
"నువ్వు రోజు.. నా బాగులో నుండి చాక్లేటులు ..
తిసేస్తున్నా మళ్లి అక్కడే పెడతా చూడు..
దానినే అంటారేమో...."

తల్లి తండ్రులను భగవంతుడు ఇస్తారు అంటారు.. కాని స్నేహితులను మనకు బహుమానంగా మనమే ఎంచుకోవాలి అంట ...

మన జీవితం లో మనలను వాళ్ళకన్నా ఇష్ట పడే స్నేహితులు చాలా మంది ఉంటారు... ఒక సమయం లో.. మన కష్టాలను పంచుకొని.. వాళ్ళ మాటలతో చాలా ఆనందాన్ని పంచిన.. నేస్తాలు...

కాలం గడిచే కొద్ది.. మన పనులతో.. మనం బిజీ అయిపోతాం.. మాట్లాడాలి అనుకుంటూ ఉంటాం కాని ఎక్కడో చిన్న మతి మరుపో.. నిర్లక్షమో.. తర్వాత మాట్లాడచ్చు అని............

మీకు అలాంటి పాత స్నేహితులు ఉంటె.. ఒక్కసారి వాళ్ళను పలకరించండి... ఎంత ఆశ్చర్యానికి లోను అవుతారో చూడండి...
నేను మొన్న అదే పని చేశా...... మా వాళ్ళు అయితే............. ఉన్నావా... పోయావా అని directugaa అడిగారు.. అది వేరే సంగతి లెండి... :-)

1 కామెంట్‌:

  1. అత్యంత ఫాస్ట్‌గా అర్ధ సెంచరీ కొట్టి మీరు మా మార్తాండ అన్నయ్య రికార్డును బద్ధలు కొట్టారు. :-))). పాపం, మా అన్నయ్య మీ బ్లాగు చూడలేదనుకుంటా. చూసి ఉంటే ఈ పాటికి కలర్ లీడరమ్మ పేరుతో మా అందరి మీద ఒక వ్యాసం రాసేవాడు. :-))).

    రిప్లయితొలగించండి