5, ఏప్రిల్ 2010, సోమవారం

బ్లాగీకరణ....

నా బ్లోగీకరణలో... ఒక పాట పారడిగా.. గుర్తు వచ్చింది....

సత్య సినిమాలో పాట విన్నారా.......??
అది తాగుడు మీద .. ఇది బ్లాగుడు మీద...

"టపా మీద టపా కొట్టు...
మేటర్ రాసి మిక్సు కొట్టు...
కాపీ పేస్టు లు అన్ని ఇంకా.. పక్క పెట్టు....
మావా.. బ్లాగర్ మావా..."

.. నాకు మధ్య.. ఇలాంటి సృజనాత్మకమయిన ఆలోచనలు పెరుగుతున్నాయి ఎందుకో......!!

ఇలా కాదు కాని.. మూడు నెలల క్రితం మా ఫ్రెండ్ ఏదో హం చేసాడు.. చేసిన వాడు ఊరుకోకుండా... నిక్కీ దీనికి లిరిక్ రాయగలవా.. అన్నాడు...

సరేలే సరదాగా అని.. రాసి.. పెట్టి.. పాడాను కూడా...
లిరిక్ ఇది


"నీ మాట నా పాటగా..
సాగే వేళలో తాకే గానమే ఇలా..
ఇలా ఇలా ఇలా ఇలా... (ఇది మ్యూజిక్ ...)
సాగను అంది పాదమే
ఆగను అంది కాలమే
చల్లని వెన్నల వేళలో...

దరికి చేరగా.. ఇలా ఇలా
.. రాగ మాలికా
మదికి చేరువ అయ్యి
ఇలా ఇలా.. నాతోటే.. ఆడగా..."


ఇలా.. రాసాను.. పాట పాడింది కుడా ఉంది... మీకు ఎవరికయినా నచ్చితే చెప్పండి.. అటాచ్ చేస్తా,, తర్వాత ....

5 కామెంట్‌లు: