ఒక్కోసారి చిన్న పిల్లల మాటలు చాలా ముద్దు వస్తాయి.. వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారో.. వాళ్లకు అర్ధం కాకపోయినా మనకు అయితే చాలా ఆనందం ఇస్తాయి.....
మీ ఇంట్లో కుడా చిన్న పిల్లలు ఉండి ఉంటె.. మీకు ఈ విషయం బాగా తెలిసి ఉంటుంది ......
నాకు అప్పడాల ప్యాకెట్ చూసినప్పుడు అల్లా మా చెల్లి గుర్తు వస్తుంది..
దానికి అప్పుడు మూడు ఏళ్ళు అనుకుంటా...
మా బాబాయి వాళ్ళు ఇద్దరు ఉద్యోగం చేసేవాళ్ళు.. సో.. ఒకరోజు దానిని మా ఇంట్లో వదిలి వెళ్ళారు...
మా అమ్మ మాకు ఇష్టం అని.. వడియాలు వేయిస్తుంది...
ఇంతలో మా చెల్లి పరిగెత్తుకుంటూ... వచ్చి....
అమ్మాక్క (దాని భాషలో పెద్దమ్మ .. అంటే వాళ్ళ అమ్మ కు అక్క కదా.....!!!)
నువ్వు అంటే నాకు చాలా ఇష్టం.........
అంది.. ఇంకా దాని మాటలకు మా అమ్మ మురిసిపోయి....
ఎందుకు బంగారం అని అంది..
అది చెప్పిన సమాధానం ఇప్పటికి మేము మర్చిపోలేదు
"మరీ... నువ్వు కుడా నాకు వడియాలు చేస్తావు.. మా అమ్మ కూడా.. చేస్తుంది..... అందుకూ...
అమ్మక్క నీకు నేను పెద్ద అయ్యాక... అప్పడాల పాకెట్టు కొంటా నీకు .......... :-) :-)
ఇంకా చెప్పేదేముంది... నవ్వు ఆపుకోలేక.. పోయాము మేము.... !!!
నేను కుడా అడుగుతా మా అమ్మని.. చిన్నపుడు... ఇలానే మాట్లాడేదాన్న అని... మా అమ్మ ఏమో.. "నువ్వు చాలా తక్కువ... కాని ఇపుడేమో... మాట్లాడడం ఆపడం తక్కువ అనీ.............. "
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి