6, ఏప్రిల్ 2010, మంగళవారం
రూపం కాదు............
మనం కనపడే విధానాన్ని బట్టి మనుషులని ఎప్పుడు.. అంచనా వెయ్యకూడదు... నేను చెప్పేది కేవలం వ్యక్తిత్వం మే కాదు.. హోదా అయినా............... ఒక చిన్న కథ... ఉమ్.. కాదు వాస్తవ సంఘటన చెప్తాను... చదవండి.... మీ అందరికి హార్వర్డ్ విశ్వ విద్యాలయం తెలిసే ఉంటుంది.. అది ప్రపంచం లోనే చాలా అత్యుత్తమ మయినది... సరే.. అక్కడికి ఒక రోజు... ఒక ముసలి జంట వచ్చారు... చూడడానికి చాలా సాదాగా ఉన్నారు.. చాలా ముతక బట్టలకు వేసు కుని ఉన్నారు... డీన్ ని కలవడానికి చాలా సేపు.. వేచి ఉంటారు.. కాసేపటికి అయన వస్తారు...... అప్పడు సంభాషణ.. ఈ విధంగా ఉంటుంది జంట : "ఏవండి.. మేము ఇక్కడ ఒక శాఖను.. మా అబ్బాయి పేరు మీద పెడదాం అనుకుంటూ ఉన్నాము", అంటారు డీన్ :" కొంచెం వెటకారంగా........ మీకు ఈ విశ్వ విద్యాలయం విలువ ఎంతో తెలుసా... అని తొమ్మిది అంకెలసంఖ్యను... నొక్కి పలికి చెపుతాడు.. కావాలని....... ముసాలావిడ : కొంచెం ఆశ్చర్యంగా... "ఏంటి డార్లింగ్... ఇంత తక్కువ అయితే .. మనం కూడా శాఖను ఎందుకు...?? విశ్వవిద్యాలయంనే పెడదాంఅంటుంది....." వినయంగా నమస్కరించి వెళ్ళిపోతారు ఇంతకి ఆ ముసలి జంట ఎవరు అనుకున్నారు???? ఈనాడు ప్రముఖమయిన విశ్వ విద్యాలయాలలో.. ఒకటి అయినా... "స్టాన్ఫర్డ్ విశ్వ విద్యాలయం " వ్యవస్థాపకులు.... చూసారా వాళ్ళ రూపు చూసి... బికారి అనుకున్నారు.. కాని అది వాళ్ళ సాదా తనానికి నిదర్శనం.....
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఇది చూడమ్మ కాస్త...పోస్ట్ చేసేముమ్దు నిజనిజాలు తెలుసుకొవాలి...
రిప్లయితొలగించండిhttp://www.hoax-slayer.com/gingham-dress-stanford-university.shtml