12, ఏప్రిల్ 2010, సోమవారం

a/c బైకులు..

ఈరోజు పొద్దున్నే.. లేచి... అలా బయటకు రాగానే... ఎక్కడినుంచో... కోయిల కూ.. కూ.. అని కూయడంమొదలుపెట్టింది.. ఎండా కాలం లో.. ఎండ మాట పక్కన పెడితే.. మామిడి కాయలు,, కోయిల కూతలు.. చాలా బావుంటాయి...

సరే అని దానికి పోటిగా నేను కూడా కూయడం స్టార్ట్ చేశా... అబ్బో.. అలా చాలా సేపు అయ్యిందిలే... ఇంకా నాకు ఓపిక లేక.. కోయిలకి "indian idol " టైటిల్ ఇచ్చేసి... లోపలికి వెళ్ళిపోయా...
లాంటి సరదా మీలో చాలా మందికి ఉంది ఉంటుంది.. నాకు తెలిసి...

అబ్బో.. ఎండలు .. మాదిరి ఉంటున్నాయి... మన ఆంధ్ర లో .. ఇక్కడ వాళ్ళవి ఒక రకం బాధలు అయితే.. పాపం అటు దేశాలలో వాళ్ళు ఎండ కోసం ఎదురు చూపులు చూస్తుంటారు...

కార్ లో తిరిగే వాళ్లకి పరవాలేదు కాని బైకు మేడా అందునా హెల్మెట్ పెట్టుకుని.... బాప్రే నరకమే....

మరీ బైక్ కి కూడా a/c ఉంటే..??


వచ్చేస్తున్నాయి అండి... బైక్ a/c లు.. ఇవి బండి వెనక వయిపు చాలా ఈజీ గా.. అమర్చుకోవచ్చు... మీ battery ద్వారా ఇది పనిచేస్తుంది...

compressor లేకపోవడం వాళ్ళ.. కరెంటు అంత అవ్వదు... దేనిని అసలకు నాసా వాళ్ళ కోసం చేసినది... అంతరీక్షం లోకి .. చిన్న డబ్బా లాంటిది.. a/c మషిను .. దానికి ఒక ట్యూబ్ తో కలిపి ట్యూబ్ ను.. జాకెట్ కి అమరుస్తారు.. జాకెట్ మీరు వేసుకోవడం ద్వారా... చల్ల గాలి circulate అవుతుంది అన్న మాట...

బావుంది కదా.. కాని ఇపట్లో మనకి ఇక్కడ దొరకకపోవచ్చు.. కొత్త కదా.. కంచెం ధర ఆదరచ్చు.. పోనీ లెండి.. ముందు ముందు.. చవకగా వస్తుంది కదా.......... అప్పుడు కొనుక్కుందాం... మొదటగా కంపెనీ వాళ్ళు కేవలం అయిదు వందల ఆర్డర్లు మాత్రమే తీసుకున్నారు అంట...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి