4, ఏప్రిల్ 2010, ఆదివారం

ఏమి సెమినార్ రా బాబు.....

సెకండ్ ఇయర్ లో ఏమి పని పాట లేనట్టూ ... మేము అందరం పి.పి.టి మీద పడ్డాం .. కాలేజీ లో ఈవెంట్ అంటేఆలస్యం .. వందలు వందలు పెట్టి పేరు నమోదులు.. పేపర్ కోసం నెట్ అంతా వెతుకులాట,,,,
అదేంటో కాని పేపర్ పెట్టిన ప్రతి చోట నాది సెలెక్ట్ అయ్యింది .. అలా రెండు ఊర్లు తిరిగా.. బిట్స్, ఇంకా హైదరాబాద్ లోకాలేజీ...
సరే.. అలా మూడో పేపర్ గుంటూరు లో పెట్టా...
అస్సలు ఇన్ని పేపర్లు ఎందుకు అంటే.. నిజం చెప్పాలి అంటే.. క్లాసులు కన్నా తిరగడం బెస్ట్ అని... హాజరు కూడా పాపంవీళ్ళు కాలేజీ కోసం సేవ చేస్తున్నాం అని వేస్తారు లెండి.. సో..డబుల్ ధమాకా...
సరే వెళ్ళిన వాళ్ళం .. పేపర్ తో ఆగకుండా అక్కడ ఏవో ఇంకా ఎవెంట్స్ ఉంటె నేమ్ ఇచ్చాం.. అది కమ్యూనికేషన్ స్కిల్ఈవెంట్ .....
ముందు టెస్ట్ రాస్తే వాళ్ళు వంద మందిలో యాబయ్యి మందిని సెలెక్ట్ చేసారు.. దానిలో నా పేరు ఉంది.. నేనునమ్మలేదు... ఎందుకు అంటే టైం వేస్ట్ చేసి.. అష్టా చెమ్మా లెవెల్ లో ఆన్సర్ లు పెట్టాలెండి
అలా నాకు తెలీకుండా అంటే నమ్మడానికి వీలు లేకుండా ఫైనల్ రౌండ్ దాక వెళ్ళిన (మధ్యలో ఏడు రౌండ్లు...) అయిదుగురిలో నేను ఒక్కదాన్ని .. ఒనె అండ్ ఓన్లీ గర్ల్ .........
నన్ను అడిగిన ప్రశ్న.......
" గృహ హింస,, స్త్రీ పై దాడులు.........
అప్పటికి లేటెస్ట్ టాపిక్...
అదే నండి,, స్వాప్నిక ఆసిడ్ దాడి అప్పుడే జరిగింది....
నేను చెప్పిన సమాధానం
"చట్టాలు ఉండి ఏమి చెయ్యలేవు.. మార్పు మనలో రావాలి అని......."
నా సమాధానం ఎంత వరకూ నచ్చిందో కాని వాళ్ళకి
అట్లాస్ట్ రెండో ప్రైజ్ చేతికి ఇచ్చి పంపిచేసారు........

అంతా బావుంది కానీ ఇంతకు పేపర్ పోయే .... endukuu అంటే.. రెండు ఈవెంట్ ఒకే టైం లో పెట్టారు..........!!!!

ప్రైజ్ మనీ రెండు వేలు .. బట్ ఫ్రెండ్స్ కి పార్టీ.. మూడు వేలు..................!!!!!
డబ్బులు వచ్చిన ఆనందం.. ఒక్క నిమిషం లో ఎగిరి పోయింది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి