8, ఏప్రిల్ 2010, గురువారం

plz.. నన్ను అడగద్దు....

టపా.. లో రాసినది.. నా వ్యక్తిగత అభిప్రాయం .. ఎవరి నయినా బాధ పెడితే... మన్నించండి...

మనలో చాలా మంది... మనకు అవసరమయితే... ఎంత అయిన ఖర్చు చేసుకుంటాం.. కానీ అవసరమున్నా కూడా పక్క వాళ్ళకి వంద రూపాయలు.. ఇవ్వడానికి.. మనసు రాదు...
అనవసర మయిన వాటికి.. హెల్ప్ చెయ్యనక్కర్లేదు... బట్.. మీకు చేతనయినంత వరకు.. చదవాలని ఇష్టం ఉన్నా,, చదవలేని ఎంతో మంది పిల్లలకు.. చేయూత నివ్వండి....

నాకు ఇప్పటికి ఒక విషయం అర్ధం కాదు... ఇంట్లో అత్తలను .. అమ్మలను... కొంచెం కుడా పట్టించుకోని వారు... అవేవో ఆశ్రమాలకి వెళ్లి... సంఘ సేవ.. చేస్తారు....
తెలిసిన వాళ్ళను ఆదరరించని వాళ్ళు కూడా... కుల సంఘాలకు లక్షలు వేలు .. దానాలు చేస్తారు.......

అబ్బో.. మాకు తెలిసిన వాళ్ళలో కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.....

పేరు కోసమేనా... మన తాపత్రయం... ???? నిజంగా.. మన వల్ల ఒకళ్ళు బాగు పడాలి అన్న ఆలోచన... ఇనుసంత కూడా.. మనకు.. ఉండదు అంటారా????

మీ కడుపు నిండ కుండా వేరోకల్లకి సాయం చెయ్యనక్కర్లేదు... కాని ఎక్కా తిక్కా ఉన్నా కుడా పక్క వాళ్ళను పట్టించుకోక పోతే.. ఇంకా మనకీ... ఇంగితం లేని వాళ్ళకి ఏమి తేడ.. చెప్పండి....??

పూజలు.. యాగాలు అలంటి వాళ్లకు లక్షలు లక్షలు ఇస్తున్న జనాలను చూస్తుంటే.. నిజంగా నాకేమి అర్ధం కాదు..... మొన్న ఇలానే ఎవరో ఆశ్రమం మీద చాలా వార్తలు వచ్చాయి... పేరు రాయటం నాకు ఇష్టం లేదు..
దర్శనానికి పది వేలు, ప్రత్యేక దర్శనం పదిహేను వేలు...... ఇచ్చే వాళ్ళు ఉంటే.. ఎంత అయిన పెడతారు లెండి.. వాళ్ళ తప్పు ఏముంది.....

ఇంత .. lecture ఇచ్చావ్ నువ్వేం చేసావ్ అమ్మ.. అంటారా......?? నా వంతు చెయ్యటానికి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటా... కొన్నిసార్లు చేసిన వాటిలకి అక్షింతలు కూడా పడ్డాయి కొండి...
మారతది అంటారా.. సమాజం...
నాకు తెలిదు plz,, నన్ను అడగద్దు...!!!

6 కామెంట్‌లు:

  1. టపా బావుంది కానీ ..ఇందులొ ఆలొచనిచాల్సిన విషయాలు చాలా వున్నయ్ నిఖితా.. ఎవరికి తోచినంతలొ వాళ్ళు సహాయం చేస్తారు కానీ దానికి కొంత లిమిట్ అంటూ వుంటుంది.. ప్రపంచం లొ పేదరికం లొ బాధపడుతున్న వాళ్ళందరికి మనం సహయం చెయ్యలేం.. ఉదాహరణకి నువ్వు ఐ మాక్స్ లొ సినిమా చూస్తున్నంత టైం లొ బొల్డు మంది తిండి లేక బాధ పడుతూ వుంటారు.. అందుకు వాళ్ళ ఆకలి బాద కన్నా నీకు సినిమా ముఖ్యమా అంటే ?? నీకు సినిమా ఎంత సంత్రుప్తి ని ఇస్తుందొ వెరే వారికి పూజలు అంతే సంత్రుప్తిని ఇచ్చి వుండవచ్చు.. పూజలకు లక్షలు లక్షలు ఇచ్చెవారు ఎవరికి దానం చెయ్యరని నీకెలా తెలుసు.. నువ్వంటే వెరే వాళ్ళు సంపాదించిన డబ్బు దానం చేస్తున్నవ్ కాబట్టి లెక్క చెప్పాలి.. స్వంత డబ్బు తొ సంపాదించుకున్న వారు ప్రపంచానికి లెక్క చెప్పక్క్రెల్దు కదా నేను ఇంత దానం చేసాను అని..

    దర్శనం , ప్రత్యేక దర్శనం కి వేలు ఖర్చు పెట్టెవారు వాళ్ళ సమయాభావం గురించి అని కూడా అనుకొవచ్చు కదా..

    లాస్ట్ మూడు పేరాలు తప్పించి మిగతా పొస్ట్ బావుంది.. :-))

    రిప్లయితొలగించండి
  2. ఒక సంవత్సతరం కిందట నాకూ అలాంటి అభిప్రాయం ఉండేది. కానీ చాలా మందిలో దాతృత్వం ఉంది. దానికి ఉదాహరణ మా జీవని సంస్థకు వస్తున్న విరాళాలు. కానీ ఎక్కువమంది ఎందుకు సహాయం చేయలేకపోతున్నారంటే వారికి సరైన వేదిక కావాలి. ఇప్పుడున్న స్వచ్చంద సంస్థలు చాలామటుకు భోంచేసే టైపు. దాతలకు సహాయం చేయాలన్న మనసు ఉంటుంది. వారికి సమయం దొరకదు. ఎవరికి ఇస్తే ఎలా వృధా చేస్తారో అన్న భయం. ఇందులో డబ్బు పోగొట్టుకోవడం కంటే మోసపోయాం అన్న భావన దాతలను బాధిస్తుంది. సమాజం అన్నాక అన్నిరకాల సమ్మేళనం. మీరు చెప్పినట్టు ఒక పూటకు లక్షలు ఖర్చు చేసేవారు ఉన్నారు. ఒక కారు డ్రైవర్ మాకు నెల నెలా 100 రూపాయలు విరాళం ఇస్తాడు. ఇలాంటి వైరుధ్యాలు ఎన్నో.
    ఇక మీరు అన్నట్టు పూజలకు తగలబెడతారు అన్నది... అదేసమయంలో వారు సెవకు కూడా ఖర్చు పెడతారు. దేవుడి దగ్గర తమ సొమ్ము వృధా కాదు అన్న నమ్మకం వారిని ఖర్చు పెట్టిస్తుంది. ఒక కాంట్రాక్టర్ అనంతపురం సమీపంలోని కొండ మీది దేవుడికి రోడ్డు వేయించారు. అలాగే మాకు 2 లక్షలు విరాళం ఇచ్చారు.
    నిజానికి సేవ అన్నది సామాజిక బాధ్యత. మన స్థాయిలో నెలకు 100 చాలు అంతకైనా తక్కువైనా సరే ఎక్కడో ఒకచోట ఎవరికో ఒకరికి సహాయపడాలి.
    కల్కి భగవాన్ గురించి మీరు చెప్పారు. అది భక్తుల ఖర్మ. ముక్కోటి దేవతలు ఉండగా ఈ దొంగ స్వాములను నమ్మేవారిని ఏమీ చేయలేం. మంచి ఆధ్యాత్మిక సేవలు, సమాజ సేవలు చేస్తున్న స్వాములు బాబాలు కూడా ఉన్నారు. మంచి శాతం ఎక్కడైనా తక్కువే ఉంటుంది.
    సేవకు సంబంధించి మీ ఆలోచనకు జోహార్లు. అది కొనసాగిస్తూ మరికొంతమందిని చైతన్య పరచండి. మనకు కనిపించని శాతం అయినా సరే మార్పు అనేది సంభవిస్తుంది.

    రిప్లయితొలగించండి
  3. మీరు కేవలం ఒకవైపు నుంచే ఆలోచిస్తున్నారు. మరోవైపు నుంచి కూడా ఆలోచించండి. అప్పుడు ధనవంతులు చేసే ఖర్చులో లగ్జరీ కాకుండా, డబ్బు ప్రవాహం కనిపిస్తుంది మీకు.

    పూజ చెయ్యాలంటే, ఆ పూజకు ఎన్నో రకాల వస్తువులను సిద్ధం చెయ్యాలి. ఆ వస్తువులు ఎక్కడ నుండి వస్తాయి అన్నది ఆలోచించారా? పోనీ ఒకడు ఒక కారు కొన్నాడనుకుందాం. మరి ఆ కారు తయారు చెయ్యాలంటే దాదాపుగా 5000 రకాల విడి భాగాలు కావాలి. అన్ని పార్ట్‌లు తయారు చెయ్యాలంటే ఎంత మంది పనిచేస్తారో ఆలోచించండి. ఒకడు ఒక కారు కొనడం వల్ల లేదా ఏదైనా ఒక వస్తువు కొనడం వల్ల మరొకరికి పని దొరుకుతున్నట్టే లెక్క.

    ఊర్కనే డబ్బు దానం చేస్తూ పోతే, ఎవ్వడూ పని చెయ్యడు. కానీ, కొంతమంది పని చెయ్యలేని స్థితిలో ఉంటారు. వాళ్ళ విషయంలో మాత్రం దానం చెయ్యడం తప్ప మరో మార్గం లేదు. లేదా ప్రభుత్వమే వాళ్ళకు సంబంధించి శ్రద్ధ తీసుకోవాలి.

    ఇకనుంచి ఎవరన్నా డబ్బు ఖర్చు చేస్తే, వాళ్ళ వల్ల పదిమందికి ఉపాధి దొరుకుతుందని ఆనందించండి. అంతేకానీ, అనవసరంగా నిందించకండి. లేనోడూ కొనక, ఉన్నోడూ కొనకపోతే ఈ ప్రపంచంలో సగం మందికి ఉద్యోగాలు పోతాయి. :-)).

    చివరిగా మా సైన్స్ భాషలో చెప్పాలంటే,
    డబ్బు నాశనం లేనిది. అది ఒకరి చేతినుంచి మరో చేతిలోకి ప్రవహిస్తుంది. ఈ ప్రవాహం అనేది వివిధ వస్తువుల, అవసరాల రూపంలో ఉంటూ మరో పదిమందికి పని కల్పిస్తుంది. This is Nagaprasad's Law. :-))).

    రిప్లయితొలగించండి
  4. devudini nammadam lo tappu ledhu.. ikkada nenu poojalu.. yaagaalu ani cheppindi.. bogus ashramaala gurinchi.. enduku janaalu antha guddiga nammuthaaru,, ani

    రిప్లయితొలగించండి
  5. >>"enduku janaalu antha guddiga nammuthaaru,, ani"

    అవసరం అలా అందర్నీ నమ్మేలా చేస్తుంది. వాళ్ళకు అంతకు మించి మరో దారి కనిపించదు ఆ సమయంలో. నాలుగు స్వాంతన చేకూర్చే మాటలే వాళ్ళని నడిపిస్తాయి. ఆ స్థితిని అనుభవిస్తే గానీ అర్థం కాదులెండి మీకు (అశుభం ప్రతిహతమౌగాక).

    రిప్లయితొలగించండి