13, ఏప్రిల్ 2010, మంగళవారం

ఊసు పోక....

ఇందాక మా ప్రొఫెసర్ ఒక అయన రాసిన బుక్ చదవడం స్టార్ట్ చేశా.. అయన చాలా బాగా మాట్లాడతారు .. అయన క్లాసు ను అపట్లో మేము ఎన్ని గంటలు చెప్పినా కూడా అలా వినే వాళ్ళం... మిగతా వారు చెప్తే మాత్రం సరిగ్గా అర గంట కూడా వినకుండా.. ఏదో గోల చేసే వాళ్ళం...
ఒక పని చేస్తే నేను నిఖిత ఎందుకు అవుతా చెప్పండి.. బుక్ తో పాటు.. మొబైల్ లో చాటింగ్.. నేను పేపర్ ని చాలా బాగా సేవ్ చేస్తా.. అభిషేక్ బచ్చన్ చెప్పాడు అని కాదు కాని... ఏమయినా గుర్తు పెట్టుకు కోవలసినవి .. ఇంకా షాపింగ్ లిస్టు.. అలా... అని నా మొబైల్ లోనే..

కొన్ని నెలలు అపట్లో నా diary ని microsoft one నోట్ బుక్ లో రాసేదానిని.. కాని ఎందుకో నచ్చక.. మళ్లీ diary లో నే రాస్తున్నా..

diary వాళ్ళ ఎన్ని ఉపయోగాలో అన్ని అనర్థాలు.. పొరపాటున.. ఎవరికయినా కనిపించింది అనుకోండి.. మామూలు పుస్తకం అయినా చదవడం మానేస్తారేమో కాని diary అంటే.. మహా అతి ఉత్సాహంగా చదివేస్తారు...... :-)

ఒక ఇద్దరు హాకీ ఆడే వాళ్ళు.. క్రికెట్ చూస్తున్నారు అంట... మన సచిన్ ఏమో.. ఫౌర్ కొట్టాడు.. అప్పుడు ఒకడు " హే గోల్ పడింది.. అని అరుస్తాడు

అప్పుడు రెండో వాడు

"నీ..... ఎంకమ్మ.. అది గోల్ కాదురా... ఆట లో గోల్ ఉండదు.. అది క్రికెట్ లో ఉంటుంది ",అన్నాడంట....... :-)

కొన్ని సారులు మనకి ఒక దానిలో ఎంత తెలివి తేటలు అయినా ఉండచ్చు కాని తెలియని విషయాలలో మనం కుడా ఇంతేనేమో..

నాకు లైన్స్ బాగా నచ్చాయి....

"మనసు ఎప్పుడు.. మంచు గడ్డ లా ఉండాలి అంట... అంటే అంత చల్లగా అని కాదు..... మంచు గడ్డ ఉప్పనయిన సముద్రం నీళల్లో ఉన్నా కూడా... ఒక శాతం కూడా ఉప్పదనం తనలో ఉండదు........ "

అంటే మనం ఎలాంటి వాళ్ళతో ఉన్నా కూడా
.. మన మనసు స్వచ్చంగా ఉంచుకోవాలి అన మాట......


idi చదవండి ఒక నల్ల అబ్బాయి... రాసిన కవిత ఇది 2005 బెస్ట్ కవిత కింద nominate అయ్యింది

"when i born ,i black
when i go in sun,i black,
when i scared, i black
when i die still am black

and a white fellow

when u born ,u pink
when u grow,u white
when u in sun,u red
when u die,u grey.
and u calling me coloured??



బావుంది కదా......... భలే express చేసాడు......

5 కామెంట్‌లు: