మన ఇంట్లో .. ఏదయినా శుభ కార్యాలు అంటే.. పెళ్ళిళ్ళు.. గృహ ప్రవేశాలు అయితే.. సత్య నారాయణ వ్రతం చేసుకోవడం మీ అందరికి తెలిసే ఉంటుంది... ఇప్పుడు పెళ్ళిళ్ళ సీసన్ కదా... అందరు వ్రతాలతో చాలా బిజీ గా ఉన్నారు....
మరి మీకు సత్య నారాయణ స్వామీ వారి దేవాలయం "అన్నవరం " గురించి విన్నారా...?? అసలు ఎప్పుడయినా.. వెళ్ళారా..???
అన్నవరం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది... మరి అక్కడ ఉన్న అమ్మవారి పేరు వచ్చి .. అనంత లక్ష్మీ సత్యవతి అమ్మవారు..
అన్నవరం దేవాలయం చాలా పురాతనమయినది కాదు... కాని చాలా మహిమ గలదని.. మన వాళ్ళ అభిప్రాయం అందుకే ఎక్కడేకడ నుండో. వస్తుంటారు..
నిజం చెప్పాలంటే ఈ గుడి కి స్థల పురాణం లేదు... ఇంకా ప్రతి పుణ్య క్షేత్రాలలో మనకు కనిపించే పుష్కరిణి కూడా ఇక్కడ ఉండదు.... కాని ఇది ఈరోజు తిరుపతి తరవాత ఎక్కువగా యాత్రికులు వచ్చే స్థలం..
మేము కుడా హైదరాబాద్ నుండి చాలా సార్లు అక్కడికి వెళ్లాం... మా అక్క వాళ్ళ పెళ్లి తరవాత అక్కడ వ్రతం అది చేయించుకున్నారు....
ఇంట్లో కూడా వ్రతం చేస్తారు మా వాళ్ళు.. ఎంత మోడరన్ గా అంటే... సి.డి. ప్లేయర్ పెడితే.. అది మంత్రాలు .. చదువుతుంది.. మేము పూజ చేస్తాము అన్న మాట...
అన్నవరం లో ఎక్కడ చూసినా డబ్బులు ఇవద్దు ఎవరికీ అంటారు.. కాని ప్రతీదానికి అక్కడ వాళ్ళు అడిగితీసుకుంటారు.. నాకు ఇంకా గుర్తు... వ్రతం టికెట్ వెయ్యి అనుకుంటా... ఒక్కో కథ చెప్పిన ప్రతి సారి. మీకు తోచింది ఇమ్మనే వారు...
అన్నవరం అంటే నాకు ఇప్పటికీ గుర్తు వచ్చేది అక్కడి ప్రసాదం..... అస్సలు దాని రుచి చెప్పలేం... మళ్లీ ఎక్కడా రాదు కూడా.. చాలా బావుంటుంది.. మీరు ప్రసాదం రుచి చూడ డం కోసం అయిన అక్కడికి వెళ్ళండి ఒకసారి... :-)
very interesting
రిప్లయితొలగించండిsrinuymahanti@yahoo.in
స్వచ్చమైన నెయ్యికి బదులు గొడ్డు కొవ్వు కలుపుతున్నారనే స్కాం లో యీ మధ్య ఆ ప్రసాదం వార్తల్లోకి కూడా ఎక్కింది కదూ?
రిప్లయితొలగించండిhm.. entha varaku nijamo.. telidu mari
రిప్లయితొలగించండిమీరు ఒకసారి ఈ లింక్ చూడండి. ఆలయం గురించి తెలుస్తుంది.
రిప్లయితొలగించండిhttp://annavaramdevasthanam.nic.in/index.htm
శ్రీవాసుకి,
srivasuki.wordpress.com
@satya గారు, ఆ ఆలయం వార్తల్లోకి ఎక్కిన మాట వాస్తవమే. కానీ అందులో నిజం లేదు. ఆ వార్త వెలువడిన మరుక్షణమే మావాళ్ళు అక్కడ అన్నీ విచారించి వచ్చారు. ఆలయానికి సప్లై చేసే నెయ్యి డబ్బాలు ఖాళీ అయ్యాక, వేలంలో గొడ్డు కొవ్వు తయారు చేసే వాళ్ళు కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్న డబ్బాల్లోనే వాళ్ళు ఆ కొవ్వును విక్రయించడం వల్ల ఆ అపోహలు వచ్చాయి.
రిప్లయితొలగించండిచాలా థాంక్స్ అండీ నాగప్రసాద్ గారూ నిజాన్ని తెలియపరచినందుకు.
రిప్లయితొలగించండిఈ వార్త విన్ననాటి నుండీ 'దేవాలయాలు కూడా ఇలాంటివాటికి అతీతం కాకపొతే మామూలు మనిషి ఎవరిని నమ్మగలడు?' అనే ఆలొచనతో సతమతమవుతున్న నాలాటి వారికి మీ మాట నిజంగా వూరటనిస్తుంది.
అక్రమాలు జరిగాయని రాత్రీ, పగలూ 'బ్రేకింగ్ న్యూసులతో' వూదరగొట్టే మీడియా, ఇలాంటి స్వాంతననిచ్చె విషయాలనెందుకు చిన్నచూపు చూస్తుందో అర్ధం కాదు.
మీకు మరోసారి ధన్యవాదాలు.
సత్య.. మీడియా గురించి కరెక్ట్‌గా చెప్పారు..
రిప్లయితొలగించండినాగా.. నేను ఆ ఆరొపణే విన్నాగానీ.. అది అపోహ అని ఎక్కడా చదవలేదు/విన్లేదు..నేను అది నిజనేమో అనే అనుకుంటున్నా..
-- ఎది ఏమయినా.. అన్నవరం ప్రసాదం మాత్రం బ్రహ్మాండం.. :-))
ya east godavari vadini ayinanthuku appudapudu anandha padethi tirupathi kaka poyina annavaram ayna dagara lo undhi ane :P
రిప్లయితొలగించండిreallly prasadam rox
and andhra lo leka povadam valla meeru cheppina scam gurinchi teliyadu :(
మీరు వెయ్యి చెప్పినా లక్ష చెప్పినా తిరుపతి తరువాత అగ్రస్థానం మా అమ్మ విజయవాడ దుర్గమ్మదే.
రిప్లయితొలగించండి