30, ఏప్రిల్ 2010, శుక్రవారం

నా నెల బ్లాగు...

నా బ్లాగ్ మొదలెట్టి జనాలను గొట్టడం మొదలెట్టి.. ఈరోజుకి సరిగ్గా నెల............ ఇలా ఎన్నో నెలలు.. పూర్తి అవ్వాలని కోరుకుంటున్నా... :-)

నిన్న బయటకి వెళ్లి రోడ్ క్రాస్ చేస్తుంటే... ఎవరో.. రోడ్ పక్కన "భార్గవి భార్గవి" అని అరుస్తున్నారు.. ... వెంటనే thougts ఎక్కడికో వెళ్ళిపోయాయి... రోడ్ క్రాస్ చేస్తున్న దానిని ఆగిపోయాను... ఇంతలో ఏదో కార్ ముందు వచ్చింది....... "ఇంట్లో చెప్పి వచ్చావా... అన్న లెవెల్ లో చూసాడు.... నిజంగా మాట అనుంటే.. నాలుగు ఇచ్చేదానిని.. మరి ఇంట్లో చెప్పి వస్తారు.. హీరో గారి కార్ కి dash ఇవ్వాలి ఈరోజు అని........ పాపం లే ఏమి అనలేదు...

వెంటనే.. నా రూం కి వెళ్లి నా diary లు అన్నీ వెతకడం మొదలు పెట్టాను.. .. కావలసినది ఎప్పుడు కనిపించదు........ అనవసరమయిన చెత్త అంతా కనిపిస్తది కాని........ నా మీద చాలా కోపం వచ్చింది.. నా నేగ్లిజేన్సు కి ...... :-(


మేము ఇదివరకు ఉన్న ఫ్లాట్ లో.. మా వెనక.. ఇంకొకళ్ళు ఉండేవాళ్ళు.. అమ్మమ్మ,తాతయ్య, ఆంటీ, ఇద్దరు చిన్ని పాపలు... నేను వాళ్ళను అలానే పిలిచేదానిని....

దానిలో ఒక పాప పేరు భార్గవి... మా అమ్మ కి నాకు అది అంటే.. చాలా ఇష్టం.. అప్పుడు ఇంకా ఫస్ట్ క్లాసు చదివేది... మొదట్లో మా ఇంటికి అంత వచ్చేది కాదు.. తర్వాత తర్వాత బాగా అలవాటు అయిన తర్వాత.. పడుకోవడానికి ఇంటికి వెళ్ళే అన్నా వెళ్ళేది కాదు.. :-)

దానికి ఆస్తమ ఉండేది... ఎప్పుడు దగ్గు, అందువల్ల.. చలి గాలి తగిలితే.. చాలా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఆంటీ వాళ్ళు.. ముందు నేను చదివే స్కూల్ లోనే చదివేది.. తర్వాత మా ఫ్లాట్ దగ్గర దానిలో మార్చారు... అది ఒక పది kg లో ఉంటది ఏమో.. దాని బాగ్ ఒక అయిదు kg లు ఉండేది... మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళేది...


దానికి మా అమ్మ చేసే వంకాయి ఇంకా శనగ పప్పు కూర చాలా ఇష్టం.. రోజూ మా అమ్మని చేసి ఇమ్మనేది.. సరదాగా మా అమ్మ చెయ్యను అన్నా.. కూడా.. దబాయిన్చేదిలే......... ఎందుకు చెయ్యవు.. అని.. :-)

మా అమ్మ దాని కోసం రెండు రోజుల కొకసారి చేసిపెట్టేది... ఎంత అలవాటయింది అంటే.. ఇంటికి వచ్చి వాళ్ళింట్లో కూర నచ్చకపోతే.. ఆంటీ వాళ్ళది ఏంటి అనేది.....

మా నానా ఎక్కువ tours లో ఉండేటపుడు.. మా ఇంటికి వచ్చి అమ్మను తిన్నావా అని అడిగేది... తినకపోతే మా అమ్మ కు చెపుతా అనేది... ఒకవేళ మా అమ్మ ఈరోజు గురు వారమే అంటే... నా దగ్గరకు వచ్చి ఎంక్వయిరీ మొదలెట్టేది.. :-) అందుకే మా అమ్మకు అదంటే చాలా ఇష్టం...

తర్వాత కొన్ని రోజులకి వాళ్ళు వేరే చోటకు మారిపోయారు.. కొంచం దూరం అది.. ఎపుడు అయినా ఫోన్ చేసి మాట్లాడే వాళ్ళం..
కొన్నిరోజుల తర్వాత ఎందుకో అమ్మకి నాకు ఒకే రోజు కలలోకి వచ్చింది... భార్గవి .. సరే అని ఒకసారి చూద్దాం అనుకున్నాం.. అమ్మ తర్వాత రోజు అక్కడ పని ఉంటే.. వాళ్ళ ఇంటికి వెళ్ళింది ... వెళ్ళగానే ముందుగా భార్గవి నే అడిగింది.. ఆంటీ వాళ్ళు ఏమి మాట్లాడలేదు.... మా అమ్మ రెండు సార్లు అడిగింది అంటా... అమ్మమ్మ ఏడవడం స్టార్ట్ చేసారు... భార్గవి ఇంకా లేదు.. సుద్దేన్గా ఆస్తమ ఎక్కువ అయ్యి హార్ట్ పట్టేసింది.. హాస్పిటల్ కి తీసుకువెళ్ళే లోగ నే......... అని,,,


అమ్మ ఇంక నాకు కూడా చెప్పలేదు ఇదంతా.. తర్వాత ఒక రోజు చెపితే చాలా బాధ అనిపించింది.. నాకు.... మా అమ్మ అయితే దానికి నచ్చిన కూర చెయ్యడమే మానేసింది... ఇప్పటికి ఏమైనా వస్తే.. మాటల్లో... తలుచుకున్టాము...


కొంత మందిని ఎంత చూడాలి అని ఉన్నా కుదరదు కానీ వాళ్ళ జ్ఞాపకాలు జీవితాంతం వదిలి వెళ్ళవు... మీతోనే నేను ఉన్నాగా అన్నట్టు... :-( :-(

5 కామెంట్‌లు:

  1. అబ్బ ఎంత బాధాకరమైన విషయం చెప్పరండీ. వినగానే గుండె లో మెలి పెట్టినట్టయింది. కొంతమందితో రక్తసంబంధం లేకపోయినా అటువంటి అనుబంధాలు ఏర్పడాయి జీవితంలో. వాటిని ఎప్పటికి మరచిపోలేము.

    రిప్లయితొలగించండి
  2. eeroju beethoven movie lo chinni papanu chuste tane gurthocchindi baaga.... :-(

    రిప్లయితొలగించండి
  3. first time mee blog visit chesanu..kothaga vundi..ma pakkinti ammai vaddanna kuda edo chepthune vuntundi sambandam lekunda alage vundi gala gala paaruthunnattu...

    ee okkarojulone mee posts anni chadivesanu..anni chadivaka anipinchina feeling idi...

    keep going..all the best.

    రిప్లయితొలగించండి
  4. @agnaata... thanks andi.. okkorojulone anni chadivesaara.. me opikanu mecchukovaali... :-)

    రిప్లయితొలగించండి