9, ఏప్రిల్ 2010, శుక్రవారం

బ్లాగ్ కొమ్మచ్చి...


మనకు కావలసినవి .. దూరం అయితేనే కానీ వాటి విలువ తెలీదేమో..... మన దగ్గర ఉన్నంత సేపు అవి మనకు ఎంత చులకనో... ఒక్కసారి దూరం అయిపోతుంది.. అంటే... ఎక్కడ లేని ప్రేమ,,, పుట్టుకు వస్తుంది వాటి మీద. అది మనుషులయినా కావచ్చు... లేకపోతే.. వస్తువులయినా కావచ్చు....
Sometimes, no matter how much faith we have,
we lose people. But you never forget them.
And sometimes,

it's those memories that give us the strength to go on........ ...

స్కూల్ లో చదివి అన్ని రోజులు.... గోల ఎంటిరా అనుకుంటాం.. నాలుక కు అమ్మ అని పలకడం రాగానే.. మంకి అను.. ఇది అను అది అను అని నోరు తిరగని పదాలెన్నో చెప్పించేస్తారు .... తర్వాత ఇంకా ఎప్పుడు అవుతాది రా స్కూల్ చదువులు అనుకుంటాం... కాని అదేం విచిత్రమో.. ఇప్పుడు సమయం ఎంత బావుంది అనిపిస్తుంది...
సరే,,, మరి నేను స్వాతి వార పత్రిక లో రమణ గారిలా.. కోతి కొమచ్చి టపా రాద్దాం అనుకుంటున్నా.... అదే అండి.. మేటర్ ని దారి మల్లిద్దాం అనుకుంటున్నా... మీకు పానిపూరి అంటే ఇష్టమా... నాకు అయితే.. చా... ఇష్టం.... కానీ మా అమ్మ.. రోడ్ లు మీద.. .. తిండి ఏంటి.. వాడు ఎం కలుపుతాడో.. ఏం చేస్తాడో.. అని.. మాటలతోనే.. విరక్తి తెపించ్చేయడం వాళ్ళ.. konchem తగ్గింది లెండి... ఇంతకి నా గోల ఏంటి అంటే.... మొన్న నాకో కల వచ్చింది... అది నేను పాణి పూరి ని తినడానికి వెళ్లాను .. వాడు పూరి లో అన్నీ పెట్టి.......... హి హి.. నేను ప్రాసెస్ చెప్పటం లేదు లెండి... పూరి ని నిమ్మకాయల ప్రేస్సేర్ లో పెట్టాడు... కానీ పూరి కి ఏమి కాలేదు.. :-) ఇంతలో మెలుకువ వచ్చిందిఅనుకోండి.. లేకపోతే... ఇంకేం వింతలు అయ్యేవో... అందుకనే.. ఈరోజు ఎలాగయినా... పానీ పూరి తినాలని.. తినేసి వచ్చేసి టపా రాస్తున్న... నా చిన్నపుడు ఒక రూపాయి కి నాలుగు వచ్చేవి... ఇపుడాయితే.. ఒకటి కుడా రావట్లేదు .. :-( మీరే చెప్పండి.. బండి మీద పానిపురి బావుంటుందా లేక సెంట్రల్, ఫుడ్ కోర్ట్ లో వి బావుంటుందా,,,..???? మీది హైదరాబాద్ అయితే.. సికింద్రాబాద్ లో కే.ఎఫ్. సి పక్కన పానిపూరి చాలా బావుంటుంది....... ఇంకా.. మినిస్టర్స్ రోడ్ లో .. సింధి కాలనీ... బొంబాయి చాట్ అదరహో.... ట్రై చెయ్యండి........!!
అక్కడ వీధి వీధంతా చాట్ మాల్స్ ...

ఇది చెప్పడం మర్చిపోకండి.... బండికా..? షాపుకా..? మీ వోటు......

2 కామెంట్‌లు:

  1. హైదరాబాది పానిపూరిని గుర్తుచేసినందుకు మీకు thanks. ఇప్పుడే అర్జంటుగా తినాలనిపిస్తుంది కాని ఏం చేయను ఇక్కడ ఖరగ్పూర్‍లో పానిపూరిలో బఠానికి బదులు ఆలుగడ్డలు పెడతారు,తిన్న అనుభూతి వుండదు..:(

    రెండొ ఆలోచనలేకుండా బండికేనండోయ్ నా వోటు

    రిప్లయితొలగించండి