30, ఏప్రిల్ 2011, శనివారం

మిడ్ నైట్ ఇడ్లీ ...

globalisation...

ఇది వరకు మన చిన్నప్పుడు ... ఒక plate ఇడ్లి రూపాయి ఉండేది , std కాల్ చెయ్యాలి అంటే rs 15 ఉండేది... ఇప్పుడు.. ఫోన్ కి రూపాయి పడుతుంది.. ఇడ్లి 15 రూపాయి లు పెట్టి కొంటున్నాం ... :)


ఇడ్లీ నాకు so much deadly... :) కానీ నాకు ఇడ్లీ అంటే.. ఎప్పుడూ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు గుర్తొస్తుంది... ఏలూరు లో ఉండే వాళ్ళు... .. నాకు holidays ఇచ్చినప్పుడు ప్రతిసారీ.. అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళం... ఇప్పుడు మా అమ్మమ్మ ఇడ్లీ సూపర్ గా చేస్తారు అని నేను రాయట్లేదు...... కానీ ఏలూరు highway మధ్యలో... చాలా ధాబా లు ఉంటాయి... అలానే ఇంచు మించు ఏలూరు ఒక 20 min ఉంది అనగా చేబ్రోలు అనుకుంటా ప్లేస్ పేరు.. మిడ్ నైట్ ఇడ్లీ బండి పెట్టి వేస్తారు.. సూపర్ హాట్ గా serve చేస్తారు... ఇడ్లీ, కారం పొడి , నెయ్యి......

ఒక్కో ఇడ్లీ ఒక్కో రూపాయి.... :) కానీ అది 9 years బ్యాక్ సంగతి.......... !!!!

బోల్డు cars అక్కడ highway మీద ఆపి జనాలు తినేవారు........... మధ్య నాకు అది కనిపించలేదు... :(


కానీ ఇడ్లీ కూడా సూపర్ గా ఉంటుంది అని నాకు అప్పుడే తెలిసింది............. :)


ఎంత అయినా బండి ఫుడ్ కి restaurant ఫుడ్ కి అసలు చాలా తేడా ఉంటుంది కదా.... !!!


మీరు కూడా ట్రై చెయ్యండి మిడ్ నైట్ ఇడ్లీ... :)

3 కామెంట్‌లు:

  1. నాకు అప్పుడు తెలియదు, ఇడ్లీ లకి ఏలూరు ప్రశస్తి లాగా ఉంది. నేను చదువుకునేటప్పుడు వాల్తేరు నుండి శలవలకి ఇంటికి వెళ్ళేటప్పుడు స్పెషల్ గ పాసింజర్ ట్రైన్లో వచ్చేవాడిని, పొద్దున్నే ఏలూరు ట్రైన్ స్టేషన్ భోజనశాలలో ఇడ్లీ తినటానికి. ఇడ్లీ కారోప్పడి కమ్మటి ఘుమఘుమ లాడే నెయ్యి గట్టి చట్నీ. రుచులు గుర్తుకొస్తున్నాయి. వావ్.

    రిప్లయితొలగించండి
  2. NH - 5 ను 4 లేనర్ గా మార్చే క్రమం లో రోడ్డు పక్క హోటల్స్ ను తొలగించే క్రమం లో కొన్ని హోటల్స్ చేబ్రోలు పక్కనున్న కైకరం తరలి పోయాయి. కానీ ఇడ్లి బళ్ళకు ఇంకా చేబ్రోలు ఫేమస్.

    రిప్లయితొలగించండి