31, జులై 2010, శనివారం

ఈ రోజు అప్పుడు...

friendship డే.. valentines డే, mothers డే, fathers డే.... ఇలా ప్రతీ రోజు చేసుకుంటున్న పుడు... చాలా మంది అంటారు.. వీటన్నిటి కోసం ప్రత్యేకమయిన రోజు ఎందుకు.. ఇవన్నీ అటు వయిపు దేశాలలో.. వాళ్లకి.. అని...

అక్కడికి మనం రోజు.. మన వాళ్లకి చాలా గౌరవం ఇస్తునట్టు.......... :-)

కానీ బ్యాండ్ కట్టడం లో నావరకు ఒకటి అనుకుంటాను......... మన ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళు.. ఇప్పుడు ఉన్న అంత క్లోజ్ గాతర్వాత ఉండకపోవచ్చు... అసలు ఏదయినా గొడవ అయ్యి మాట్లాడక పోవను వచ్చు........ కాని వాళ్ళు కట్టిన బ్యాండ్ చూసినప్పుడు తర్వాతా అయినా.. వాళ్ళు తో memorable moments మనకు గుర్తు రావచ్చు......... :-)

అందుకే.. ఎప్పుడయినా చిన్నది అయినా సరే.. గిఫ్ట్ ఇవ్వడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది....

నా దగ్గర అయితే ఈవెన్ choclate wrappers కూడా ఉంటాయి.... :-)

లాస్ట్ ఇయర్ నా పుట్టిన రోజు న friendship డే.. ఈసారి friendship డే తర్వాతా నా పుట్టిన రోజు... :-)

మీ ఫ్రెండ్ కి surprise ఇవ్వండి

సుమంత్ , ప్రభంజ్, లేక్య, వంశీ అండ్ 2 మై జాను... "హ్యాపీ friendship డే" an miss u ఆల్........... !!!

రెండు....

మనకి ఎప్పుడు రెండే ఒప్షన్స్ ఉంటాయి........ ఒకటి

1. మార్పు...

2. అంగీకరించడం....

ఇష్టం లేని దానిని మనం మార్చుకో గలగాలి.. మార్చలేని వాటిని ఒప్పుకోగలగాలి............ !!!!

మహబూబ్ నగర్ కి ఒక 45 km దూరం లో... "మక్పాల్" అనే ప్లేస్ లో ఒక రావి చెట్టో మర్రి చెట్టో ఉంది అంట అక్కడికి వెళ్తే.. వీసా లు చాలా తొందరగా వస్తునాయని జనాలు తెగ వెళ్తునారు అంట.. :-)

నాకు తెలిసి ఇలాంటిది రెండోది ఏమో.. చిలుకూరు గుడి కూడా వీసా లకు famous కదా.......... !!!

ఒక్క లాభం అయితే ఉంది.. ఆ ప్లేస్ ఒక సంవత్సరం లో టూ మచ్ డెవలప్ అవ్వకపోతే అడగండి... పోనీలే ఇలాగాయిన మన development మనమే చేసు కుంటునాము .. :-)

24, జులై 2010, శనివారం

దేని దారి దానిదే....

లైఫ్ లో కొన్నిటిలో న్న సంతోషాన్ని ఎప్పుడూ వేరే వాటితో పోల్చలేము...


మెర్సిడెస్ లో వెళ్ళడం కన్నా.. ఒక బైక్ మీద ముగ్గురు ఫ్రెండ్స్ తో వెళ్లి.. ఫైన్ కట్టిన రోజులే చాలా బావుంటాయి... :-)


బ్లాకు లో మూడు వందలు పెట్టి టికెట్ కొనుక్కుని.. ఒక్కరే చూసే కన్నా... మన ఫ్రెండ్స్ తో 50 టికెట్ తో చూసి.. ఈసారి popcorn ఎవరు కొంటారో అని ఎదురు చూడటం లో ఏంటో మజా ఉంటుంది.......... :-)



ఆ ccd లో కాఫీ తాగే కన్నా.. మన ఇంటిలో మన వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ.. తాగితే ఇంకా బావుంటుంది.......... !!!



ఒక diary మిల్క్.. అందరు షేర్ చేసుకుని తింటే ఆ ఆనందమే వేరు ...... :-)



నిజమే కదా.. రోజలు మారుతాయి.. అయిదు వందల పాకెట్ మనీ.. అయిదు అంకెల జీతం గా మారచ్చు...


చోట recharge.. unlimited postpaid గా మారచ్చు.....


బట్టలు అన్నీ బ్రాండెడ్ గా మారచ్చు............



కానీ ఆ చిన్ని వాటిలో ఉన్న సంతోషం మళ్లీ ఎప్పుడు.. రాదు................ !!!



ఎంతయినా "అమ్మ నాకు ఇది కావాలి" అని రెండు రోజులు ఏడిచి సాదించి కొన్నుకున్న తర్వాత వచ్చే ఆనందం ముందు... మనమే ఎన్ని వేలు పెట్టి కొనుకున్న సంతోషం ఏ పాటిది............. :-)

21, జులై 2010, బుధవారం

ఎవరు మీరు????????

ఒక చిన్ని quiz.... !!!! మీకు గుర్తున్నవి... ఎన్నో చూడండి... :-)

ఈ వరల్డ్ లో అయిదుగురు.. రిచెస్ట్ పీపుల్.. ఎవరో మీకు తెలుసా????

నోబెల్ ప్రైజ్ అందుకున్న పది మంది పేరు చెప్పగలరా...???

ఆస్కార్ గెలిచినా మొదటి ఇండియన్ ఎవరో తెలుసా.... ???

మీకు ఎవరయినా అయిదుగురు మిస్ ఇండియా తెలుసా.... ??


నాకు కొన్ని తెలిసి నట్టు ఎక్కడో బాగా విన్నట్టు ఉన్నాయి... మరీ మీకు తెలిస్తే చెప్పి మిమ్మల్ని మీరే మెచ్చుకోండి... :-)

కానీ ఇవన్ని ఏదో ఒక రోజు వార్తలు headlines లాంటి వె కదా................ !౧౧ కానీ కాలం గడిచే కొద్ది చప్పట్లు మాయమయిపోతాయి...

అవార్డ్స్ ఎవరు పట్టించుకోరు....... ఆ certificates అన్నీ...... పొందిన వాడి తో.. సమాది

అయిపోతాయి.......... !!

సరే .. ఇంకా కొన్ని అడుగుతా చెప్పండి ఇప్పుడు....

మీ ఫస్ట్ లవ్ పేరు ఏంటి???

మీకు చాలా నచ్చిన టీచర్??

మీ ప్రాణ స్నేహితుడు ఎవరు??

మీకు చాలా సహాయం చేసిన వ్యక్తి పేరు???

నాకు తెలిసి ఇవి ఎవరూ మర్చిపోరు... జీవితాంతం కూడా..........

విజయాలు ,డబ్బు... ఇవన్నీ మనలని కొంత కాలం వరకే ప్రభావితం చేస్తాయి........... కానీ మనం చూపే ప్రేమ, జాగ్రత్త, లైఫ్ లాంగ్ మనలని గుర్తు ఉండేలా చేస్తాయి.............. !!!

మరీ మీరు ఎవరిలో ఒకరు????????????

ఒక quote ఉంటుంది............

"నువ్వంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు ఒకోసారి.. ఎందుకంటే.. దేనిని చూసీ ఆగని నేను... ఎంత కష్టమయినా ఆగని నేను... మొదటి సారి నువ్వు చూపించిన ప్రేమతో ఆగి పోయాను ......!!! "

20, జులై 2010, మంగళవారం

ఎందుకు... అంటే...

I miss you not because you miss me but because you taught me how to feel the emptiness when you’re not here. I love you not because you love me but because you taught me everything I never knew existed before.


ఇది నాకు చాలా ఇష్టం........... :-)


మనం ఎవరినయిన మిస్ అయితే....

... వాళ్ళు మనకు అప్పటి దాక తెలియని విషయాని మనకు పరిచయం చేసిన వాళ్ళు అయ్యి ఉంటారు... ఇలా కుడా ఉండచ్చు అని చెప్తారు...

బ్లాకు బోర్డు ని బెంచ్ ఎక్కి చూసినట్టు.... అప్పటి దాక చూసిన దానినే కొత్తగా చూపిస్తారు......... :-)

వెన్నెల్లో నే కాదు వర్షం లోను తాజ్ మహల్ ను చూడచ్చు.. అని తెలిసేలా చేస్తారు.. :-)


thats makes difference ..... !!!! y we love some lott.... !!

18, జులై 2010, ఆదివారం

ఎలా కుదురుతుంది........... :-)

ఒక రోజు... ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఆక్సిడెంట్ లో చనిపోయి.. స్వర్గం కి వెళతారు...........

వాళ్ళు ముగ్గురు చాలా తెలివయిన వాళ్ళు.. సో దేవుడు అంటాడు..

" మీరు ఇప్పుడు చనిపోయారు కదా.. మీకోసం మీ వాళ్ళు అందరూ.. ఏడుస్తునారు... వారి నోటి నుండి మీరు ఏమైనా మాట వినాలి అనుకుంటునారా??? "


అవును.. అని ముగ్గురూ అంటారు..........


మొదటి అయన.. " నేను చాలా గొప్ప టీచర్ ని.. నా పిల్లలని చాలా బాగా చూసుకునే వాడిని.." అని వాళ్ళ నోటి నుండి వినాలని ఉంది అంటాడు............"


సరే.. అంటాడు దేవుడు............ !!!


రెండో వాడేమో.. " నేను సంగీతం అంటే ప్రాణం ఇచ్చేవాడిని.. నా సంగీత జ్ఞానం గురించి వాళ్ళు చెపితే.. వినాలని ఉంది"
అంటాడు...


సరే.... అంటాడు దేవుడు..


ఇప్పుడు మూడో వాడి turn.... చాలా అలోచించి అడుగుతాడు.......


"దేవుడా. నాకు వాళ్ళ నోటి నుండి.. అరేయ్ చూడండి తను ఊపిరి పీలుస్తున్నాడు.. !!!!! అని చెపితే వినాలని ఉంది అంటాడు................ :-)


అదీ.. smartness అంటే............................ !!!!!!!!!!!!!!!!!!!!!! :-)


మాటలు చాలా impression ని వేస్తాయి మన మనసులో..........


పొట్టిగా.. నల్లగా ఉన్న ఒక అతను.. ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు.. అమ్మాయి చాలా పొడుగుగా అందంగా ఉంటుంది....

అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి చెపితే.. ఆయన మా అమ్మాయిని అడుగు అంటాడు..........


అమ్మాయి " నీకు నాకు ఎక్కడ కుదురుతుంది అంటుంది............ ???"


అప్పుడు తిను అంటాడు...


"దేవుడు నన్ను చాలా పొడుగుగా అందంగా పుట్టించి ఎంతో అందాన్ని ఇచ్చాడు.. కాని నాకోసం పుట్టించిన అమ్మాయిని పొట్టి గా నల్లగా పుట్టించాడు.. అది నాకు నచ్చలేదు...


నేను అబ్బాయిని కాబట్టి ఎలా ఉన్న పర్లేదు కదా.. అందుకనే నా అందాన్ని అంతా అమ్మాయికి ఇచ్చేసా.......... కాని ఇప్పుడు అమ్మాయి అది మర్చిపోయి.... నీకు నాకు ఎక్కడా అంటుంది.. :-(


ఒక్క మాటకి అమ్మాయి పడిపోయి పెళ్లి చేసుకుంటుంది.. :-)


"మాటలకి మేజిక్ ఉంటుంది............ ఎంత బాధలో ఉన్న వారినయిన నవ్విస్తుంది.. ఎంత ఆనందంగా ఉన్నవాల్ల్నయిన ఎదిపిన్చనూ గలుతుంది.............. "

ఫ్లో కి తగట్టు...........

ఏదయినా కొత్త విషయం కొత్తగా అనిపిస్తే... అది పాతది అయ్యే దాకా దానిని వదిలి పెట్టం.. జనాలు.. నేను కూడా... :-) చిలక పోయింది.. octopus వచ్చింది...


మీకు తెలుసా paul కాకుండా ఇంకో టి కూడా "cassandra" దాని ముందు.. ఆస్ట్రేలియా జనరల్ elections కోసం.. :-) బాక్స్ లు పెట్టారు.........


ఎందుకయినా మంచిది మీరు కూడా పెట్ ని కొనుక్కోవాలి అనుకుంటే.. ఈసారి.. ట్రెండ్ కి తగట్టు.. octopus ని తెచ్చుకోండి.. మీ ఇంటికి జనాలు నాన్ స్టాప్ గా వస్తారు........ :-)


పనిలో పని మీకు నచ్చినవి రెండు బాక్స్ లో పేట్టి తెమ్మనండి :-)


గోల అంతా చూసిన ఒక డాక్టర్... రెండు సంవత్సరాల వయసు octopus కే అంత టాలెంట్ ఉంటే... నాలుగు ఏళ్ళు నుండి ముద్దుగా కష్టపడి.. pedigree, నాన్ veg పెట్టి పెంచుతున్న తన కుక్క కి ఎంత టాలెంట్ ఉండాలి అని...


అయన ఒక రెండు గిన్నె లలో.. దానికి ఇష్టమయిన ఫుడ్ పెట్టి... ఏది తీసుకుంటుందో అన్న anxiety ఎక్కువ అయ్యిపోయి.. బ్లడ్ pressure పెరిగి పైకి పోయి నంత పని అయ్యింది.. ఇది తట్టుకోలేక .. తనకు నచ్చిన ఆప్షన్ లో తన కుక్క కు బాగా ఇష్టమయిన ఫుడ్ పెట్టి.. అతి తెలివి ప్రదర్శించాలి అనుకున్నాడు...

పాపం కుక్క అది తినబోయే కంగారు లో అయన చెయ్యి కోరికేసింది.......... :-)


పాపం ఇంకా మన డాక్టర్ వేరే హాస్పిటల్ లో admitt అయ్యి.. కుక్క అలా చేసి నందుకు చాలా బాధ పడి... చేసేది ఏమి లేక........... injection చేయించుకున్నాడు............ :-)


నన్ను అడిగితే.. ఇలాంటి animals sooth saying బెటర్ .. ఏమి expect చెయ్యకుండా .. చేస్తునాయి...

అదే అమ్మాజీ నో బాబాజి నో అడిగితే.... " నా future ఎలా ఉంటుంది అని"

అప్పటిదాకా మనం సంపాదించిన డబ్బు అంతా తీసుకుని... " లైఫ్ లో అంతా కష్టమే.. చిల్లి గవ్వ ఉండదు అంటారు"

ఇంకేమి ఉంటది అంతా వాళ్లకి పెడితే.................. :-)


ఒక్క మాట నిజం పెట్స్ ఉంటే చాలా రిలీఫ్ గా ఉంటుంది... కాని అవి దూరం అయితే అంత కన్నా బాధగా ఉంటుంది... :-(

నా 200 వ పోస్ట్


ఇది నా 200 టపా....... నాకే నమ్మాలి అనిపించడం లేదు.. అప్పుడే అన్ని రాసానా అని....... :-)


ఏకాంతం అనేది చాలా విలువ అయినది... అది మనకు అన్నిటినీ నేర్పుతుంది... కానీ అది మనకి ఇచ్చిన మనిషిని మాత్రం మర్చిపోయేలా చెయ్యదు... :-(



కానీ టైం మనకు చాలా నమ్మకమయిన వారితో మన గురించి చెప్పడానికి అవకాశం ఇస్తుంది... నమ్మకమయిన వ్యక్తి మనమే........ !!!


మనం ఎంత నమ్మకంగా ఉంటామో వేరే వాళ్ళతో.. వాళ్ళు కూడా అలాగే ఉంటారు.. ఉండాలి అనుకుంటాము......



ఒకరోజు ఒక చిన్న పాప, బాబు.. ఆడుకుంటూ.. ఉంటారు... అబ్బాయి దగ్గర ఏమో.. marble collection ఉంటుంది.. అమ్మాయి దగ్గర ఏమో.. బొమ్మల collection ఉంటుంది.....



అయితే ఒకరోజు ఇద్దరు రెండు మర్చుకుందాం అనుకుంటారు........ అలాగే చేస్తారు....



కానీ బాబు కి రాత్రంతా నిద్ర ఉండదు.. పాప మాత్రం చాలా ప్రశాంతంగా పడుకుంటుంది.... ఎందుకు.. అంటే.. బాబు తన దగ్గర ఉన్న వాటిలో బెస్ట్ ని తన దగ్గర ఉంచుకుని మిగిలినవి అమ్మాయికి ఇస్తాడు.. ఒకవేళ అమ్మాయి కూడా అలాగే చేసిందేమో అని.. anukuntu ఉంటాడు రాత్రంతా.... :-)


రేలషన్ లో అయినా అంతే.. మనం 100% dedicated గా ఉన్నపుడు అనుమానాలు ఉండవు.. కాని మనలో నే తక్కువ ఉంటే.. ఎదుటి వాళ్ళు ఎంత బాగా ఉన్నా మన మనసులో.. అనుమానమే ఉంటుంది........ :-)

17, జులై 2010, శనివారం

ఆగాలి

ఒక్కోకరిని ఒక్కో విషయం వల్ల ఇష్ట పడతాం........

కొంత మంది నవ్వు నచ్చుతుంది.. లేక వాళ్ళని అలానే చూడాలి అనిపిస్తుంది........ చూడక పోతే ఎప్పుడో వచ్చే 2012 ఇప్పుడే కనిపించేస్తుంది మన కల్ల ముందు....... దాని "attraction " అంటారు.....

ఇంకొంత మంది.. టాలంట్ నచ్చుతుంది.. బాగా పాడుతారు అనో...... బాగా ఆడతారు అనో.. లేక బాగా రాస్తారు అనో... అది కూడా ప్రేమ కాదు.. "admiration"

.. ఇంకో కోణం ఉంటుంది.. దీనిలో....... ఒకళ్ళని ముట్టుకోవాలి అని పదే పదే అనిపిస్తుంది.. ముట్టుకోకపోతే.. చచ్చిపోతామేమో.. అనట్టు. అది "lust"


అమ్మ చెప్పింది.. నాన్న గారు చెప్పారు అందుకే నచ్చారు అంటే.. అది మీ "కర్మ"

మనం ఒకరని ప్రేమిస్తే నిజంగా reason తెలీదు........ వాళ్ళు మనకోసం కాదు అని తెలిసినా కూడా మనం దేవుడిని వాళ్ళు సంతోషం గా ఉండాలి అనే కోరుకుంటాం....... వేరే వాళ్ళు చిన్న తప్పు చేసినా కుడా కోపం వచ్చే మనస్తత్వం కల వారు కూడా వాళ్ళు ఇష్ట పడే వాళ్ళని.. వాళ్ళు ఎంత తప్పు చేసినా కూడా.. కోపం రాదు............. :-)


అబ్బా........... ఇది నా రాతలు కాదు నాకు వచ్చిన రాతలు...... ఎం analasis చేసాడు.. ఎవరో కాని.. :-)



కాని ఒకళ్ళని ప్రేమించాలి అంటే.. చాలా responsibility అండ్ ఓపిక చాలా ఉండాలి.........


responsibility ఎందుకు అంటే.. వాళ్ళని వాళ్ళ parents తర్వాత అన్నట్టు మనం చూసుకోవాలి..........


ఓపిక ఎందుకు అంటే. అది వాళ్ళు తెలుసుకోవచ్చు తెలుసుకోకపోవచ్చు. తెలుసుకునే దాకా ఆగాలి... :-)







dowry............

కట్నం ఇవ్వడం మీద ఒక్కోకల్లకి ఒక్కో అభిప్రాయం ఉంటుంది.. కొంత మందికి అది స్టేటస్ ఇష్యూ అయితే ఇంకొంత మందికి.. కాదూ చాలా మందికి ఒక్క విషయం మీద. పెళ్ళిళ్ళు ఆగిపోతాయి కూడా....... :-(

ఇప్పుడు ఏదో చెప్పాలని కాదు.. కానీ ఈరోజు నేను చదివిన ఒక బుక్ లో స్టొరీ చాలా కొత్తగా అనిపించింది......

ఒక అమ్మాయి... చాలా మామూలు ఫ్యామిలీ... తనకి ఒక అక్క..... అమ్మాయి చాలా బావుండేది.. అండ్ చాలా తెలివయిన అమ్మాయి కూడా....... తన అక్కకి ఒక nri మ్యాచ్ చూసి కట్నం అన్నీ ఇచ్చి పెళ్లి చేసి సెటిల్ చేసారు...

అమ్మాయి కి కూడా.. అలాంటి ఒక మ్యాచ్ తెచ్చారు... అబ్బాయి ఆమ్మాయి బాగానే ఉండే వాళ్ళు పెళ్ళికి ముందు.. అండ్ ఒక రోజు అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి...... మీరు కట్నం మొత్తం ఇచ్చేడట్టు అయితేనే.. పెళ్లి చెయ్యండి లేకపోతే.. cancel చేసేసుకుందాం అంటాడు....

మాటలు అమ్మాయి విని చాలా బాధ పడి.. వాళ్ళ నాన్న తో.. ఎందుకు ఇలాంటి అబ్బాయి తో పెళ్లి.. నాకు వద్దు అంటుంది....


కాని ఆయన ఏమో.. పెళ్లి అంటే ఇలాంటివి మామూలే.. అని సర్ది చెప్తాడు...

కాని అమ్మాయికి " పెళ్లి cancel చేస్తాము" అన్న మాట ఇంకా మనసులోనే ఉంది.. అలాంటి అబ్బాయినిచేసుకుంటునాన అన్న బాధ మూల.........

అమ్మాయి వెనకాల చాలా మంది పడే వారు such a "beaux yeux "

తర్వాత రోజు వేరే అబ్బాయితో రోజు అంతా తిరిగి రాత్రి కూడా తనతోనే ఉంటుంది అమ్మాయి..........


తెల్లారి అవుతుంది.......


వెళ్ళిపోయే ముందు.. ఒక మాట అంటుంది అమ్మాయి అబ్బాయి తో...... " అందరి అమ్మాయిల లాగానే నాకు ఎన్నో కలలు ఉన్నాయి..... నా chastity ని నేను చేసుకోబోయే వాడికే ఇద్దాం అన్న ఆలోచనతోనే ఇప్పటి దాకా వున్నాను..... కాని కేవలం డబ్బు కోసం పెళ్లి కూడా మానుకుంటా అన్న వాడు.. నన్ను pure గా తీసుకోవడానికి అర్హత కోలిపోయాడు......

ఇప్పుడు తనతో ఉన్నంత కాలం నాకు కూడా ఒక సానుబూతి ఉంటుంది........ పాపం సెకండ్ హ్యాండ్ వైఫ్ దొరికింది... చాలా మిస్ అయ్యాడు అని..........


అప్పుడు అబ్బాయి ఒకటి అనుకున్నాడు " జీవితం లో కట్నం తీసుకోకూడదు అని............... !!!!


ఎవరు ఇష్టాలు వారివి.... తీసుకోవడం తప్పు లేదు...... అమ్మాయి ఉంటే ఇవ్వడం కూడా parents కి చాలా ఆనందంగా ఉంటుంది..........


ఇష్టం తో తీసుకోండి......... అంతే కాని కష్టం పెట్టి కాదు................. !!!!!!!

చిన్ని పాప........



ఈరోజే మార్నింగ్ లేస్తూనే....... ఏదో కొత్త ఫీలింగ్...... మైండ్ చాలా peaceful గా అనిపించింది......... ఏదయినా ఒక విషయం గురించి నెలలు నెలలు వర్రీ అయితే.. ఆ తర్వాత అది క్లియర్ అయితే చాలా బావుంటుందేమో ఆ ఫీల్........


అప్పటి దాకా పడిన కష్టం బాధ అన్నీ......... ఒక్క నిమిషం లో......... మాయం అయిపోతాయి......... :-) ఏదో magic చేసినట్టు..........


ఒక రోజు.. చాలా పెద్ద వర్షం వస్తుంది............ అండ్ ఒక చిన్ని పాప........ సాన్వి పాప..... :-) పాపం అంత వర్షం లో కూడా బాగ్ వేసుకుని మెల్లిగా నడుచుకుంటూ......... వెల్తూ ఉంటుంది.......


చాలా మెరుపులు, ఉరుములు వస్తూ ఉంటాయి.. ఇంకా ఇంట్లో ఉన్న తన అమ్మ పాప ఎలా వెళ్లిందో.. ఇంత వర్షం లో అని.. కార్ బయటకు తీసి.........



స్కూల్ కి డ్రైవ్ చేస్తుంది....... ఇంతలో మద్యలో దారిలో పాప కనిపిస్తుంది......


ఆ చిన్ని డాల్.. మెరుపు పడిన ప్రతి సారి ఆగి నవ్వుతూ.. నిలబడడం వాళ్ళ అమ్మ చూస్తుంది....... అలా మెరుపు వచ్చిన ప్రతీసారి ఇంకా క్యూట్ గా నవ్వుతుంది.........



అప్పుడు వాళ్ళ అమ్మ " ఏం చేస్తునావ్ అలా" అని అడుగుతుంది........



అప్పుడు ఆ స్వీటీ డాల్ ఎం చెపుతుంది అంటే.... " అమ్మ గాడ్ నా ఫోటో తీయడానికి చాలా ఇష్టపడుతున్నాడు... అందుకనే స్మైల్ ఇస్తున్నా"....... అని :-)