18, మే 2010, మంగళవారం

ఒకే ఒక్కటి

విషయం లోనయినా క్లారిటీ ఉండాలి... తిట్టించుకున్నా ఎదుటి వాళ్ళతో ఎందుకు తిట్టిన్చుకున్నమో అర్ధం అవ్వాలి....

ఒక ఊరిలో పాపం ఒక అమ్మాయి ఉండేది.. చాల మంచిది .. ఎప్పుడూ అందరికీ హెల్ప్ చేసేది.. అమ్మాయి చాలా బావుండేది.. ముక్కు మాత్రం అస్సలు బావుండేది కాదు.. దానికి తెగ బాధ పడిపోయేది...

ఇలా రోజు దేవుడు కనిపిస్తాడు.. ఒక మూడు వారాలు కోరుకో.. అంటే...
" నాకు అందమయిన ముక్కులు కావలి అని కంగారులో అనేస్తుంది.. ఇంకేం ఉంది మొహం అంతా ముక్కులే.. :-( చూసి దడుచుకుని.. దేవుడా నాకు ముక్కులు వద్దు అని.. రెండో వరం కోరుకుంటుంది.. మళ్లీ క్లారిటీ మిస్ అయ్యి అన్ని ముక్కులతో పాటు ఉన్నది కూడా పోతుంది... :-(

ఇంకా చేసేదేమీ లేక.. మూడో వరంగా.. నా పాత ముక్కు నాకు ఇవ్వు ప్రభో అని బోరుమంటుంది... !!!

అది మరి.. దేవుడు కనిపించినా ఎటు వంటి ఉపయోగం లేకుండా పోయింది కదా...

అందుకే .. మన మాటలో మన ఆలోచనల్లో క్లారిటీ ఉండాలి అని ఊరికే అనరు...

ఇంకో.. తెలివయిన ఇల్లాలు.. దేవుడు కనిపించి ఒకే ఒక వరం కోరుకో.. అంటే...

" దేవుడా నాకు ముని మనవరాలు వాళ్లకు మనవరాళ్ళు పుట్టి వాళ్ళు మేము.. ఎప్పుడు పెద్ద బవంతి లో ఉంది.. వాళ్ళను బంగారు ఉయ్యాలలో ఉగించడం చూడాలి అని ఉంది అని.. అన్నీ కోరికలను కలిపేసి ఒక కోరికగా తెలివిగా అడిగింది అంట.... !!!

అః.. ఏమి తెలివి కదా... !!!

మరి నాకు దేవుడు కనిపించి ఒకే ఒక వరం అంటే..

" దేవుడా నేను పిలిచినప్పుడు అల్లా వచ్చి ఒకో వరం ఇవ్వు అని అడుగుతా....:-)

ప్లీజ్... నిక్కీ నువ్వు టూ స్మార్ట్ అని పొగడకండి... నాకు అస్సా.. లు నచ్చదు.. :-)

మరి మీరు కూడా దేవుడు కనిపిస్తే అడిగే ఒకే ఒక వరం రాయండి.. 90% అవి తీరుతాయి అని guarantee ఇస్తా..

త్వరపడండి.. అస్సలే దేవుడికి చాలా పనులు ఉన్నాయి... !!!!!!!!!!!!!

3 కామెంట్‌లు: