ఒక software employee... పాపం వర్క్ కి తిక్క వచ్చి.. parallel గా.. online.. లో ఎవరో అమ్మాయి కనిపిస్తే.. సోది వెయ్యడం స్టార్ట్ చేసాడు....
అమ్మాయి : మీరు ఎం చేస్తారు....
అబ్బాయి : నేనా.. ఏదో.. కంపెనీ పేరు చెప్పి దానిలో.. గత రెండు ఏళ్ళుగా.. కానిస్తున్నాను అంటాడు
అమ్మాయి : ఓ.. నేను కూడా ఇంకో చోట పని చెస్తునాను.. మీ బాస్ ఎలాంటి వాడు...
అబ్బాయి : అబ్బో.. ఎంత చెప్పినా తక్కువే....
అమ్మాయి : అంటే అంత మంచి ఆయనా... !!!
అబ్బాయి : నీకు అలా అర్ధం అయ్యిందా.. అంతలేదులే ముత్యాల ముగ్గులో రావు గోపాల్ రావు కన్నా.. దారుణం... ఒక ముక్క రాదు వాడికి...... ఎలా మేనేజర్ అయ్యాడో అర్ధం కాదు నాకు...
(ఇంతలో మేనేజర్ వస్తాడు.. )
రామ్.. నాకు ఏదో ప్రోగ్రాం కోడ్ కావాలి
అది ఎంత చిన్నది అయినా.. కూడా..
సర్ చాలా కష్టం రెండు రోజులు పట్టచ్చు....
సరే take ur own టైం...
అమ్మాయి : ఏమయింది ??
అబ్బాయి : మా బాస్ లే...
అమ్మాయి : ఏయ్ ఒక్క నిమిషం మా బాస్ పిలుస్తున్నాడు...
తరవాత ఒక అయిదు నిమిషాలకి
ఆమ్మాయి : ఏదో ప్రోగ్రాం అంట.. ను నాకు హెల్ప్ చెయ్యవా.. ప్లీజ్.. రేపటి లోగా ఇవ్వాలి..
అబ్బాయి : అదెంత పని చెప్పు
అమ్మాయి : same ఇందాక బాస్ ఇచ్చిన ప్రోగ్రాం ఏ ఇస్తుంది..
అబ్బాయి : ఈమాత్రం దానికి రేపు ఎందుకు గంటలో ఇచ్చేస్తా.....
(అమ్మాయి నుండి.. రెస్పాన్స్ ఉండదు.... )
ఇంతలోగా బాస్ పిలుస్తాడు..
అబ్బాయి : వీడి torture తట్టుకోలేకపోతున్నా ......... ప్రశాంతంగా మాట్లాడకోనీడు..
బాస్ : రాం నేను నీకు ఏదో కోడింగ్ చేప్పాను అనుకుంటా...
అబ్బాయి : చెప్పా కదండీ చాలా కష్టం
బాస్ : ఓహో.. అలాగా....... ఇందాక గంట చాలు అన్నావ్ గా,, యువర్ టైం starts now ....."
పాపం అప్పుడు అర్ధం అయ్యింది ఆ జీవికి ఇప్పటి దాకా ఎవరితో సోది వేసాడో...............
:)
రిప్లయితొలగించండిbaavundi.
GOOD ONE :)
రిప్లయితొలగించండి