kiss your life .accept it,just as it is,today,now. so that those moments of happiness you're waiting for don't pass you by."
అప్పుడే మొదలు అయిపోయింది మా ఇంట్లో అమ్మ కి నా పుట్టిన రోజు గోల.. పాపం పది రోజుల నుండి.. షాపింగ్ అనీ ఇది అనీ అది అనీ.. ఏదేదో చెప్తున్నా.. కొత్త బట్టలు ముందు కొనుక్కుంటే వేసుకునే దాకా మనసు ఆగదు.. ఒకవేళ తర్వాత కొనుక్కుంటే.. కొనే దాక మనసు ఊరుకోదు.. :P చిన్నప్పటి నుండి ఇదే అలవాటు ఏమో... :)
పొద్దున్న లేచే పాపానికి పోయే దాన్ని కాదు.. కానీ కొత్త బట్టలు ఉంటే.. ఎప్పుడు తెల్లారు తుందా అన్న ఆనందం :) వేసుకుని చూసుకునే దాకా.. అంతే.. బావుందా.. ఒక రెండు మూడు సార్లు వరసగా వెయ్యడం.. బాలేదా ఇంక దాని కి ఆరోజు తోనే విడుదల.. మళ్లీ కన్నెత్తి చూస్తే వొట్టు.. :)
august 2 ని క్యాలెండరు లో.. అదే మొబైల్ క్యాలెండరు లో ( కాలం తో పాటు అన్నీ మారిపోతాయి కదా... ) పెట్టుకుని రోజూ చూసుకోవడమే.. ఇంకా 5 రోజులు, ఆరు రోజులు అని... :P
కొన్ని చిన్న వాటిల్లో.. చాలా ఆనందం ఉంటుంది.. మన మనసు తట్టుకోలేని అంత.... :) ఎదురు చూడటం ఎప్పుడు బావుంటుంది ఇష్ట మయిన వాటి కోసం .. ఒకవేళ అవి సరిగ్గా జరగకపోయినా.. ఆ నిరీక్షణ లోనే మనం కావలిసిన సంతోషాన్ని పొందుతాం... :)
Advanced...wishes andi...
రిప్లయితొలగించండిthnks a lott
రిప్లయితొలగించండి