ఇదివరకు మనం చాలా టెన్షన్ గా ఏ సినిమా ఓ.. సీరియల్ ఓ.. వచ్చినప్పుడు.. మధ్యలో విరామం అంటే.. వాడిని రాయి పెట్టి కొట్టాలనిపించేది ... ఇప్పుడు ఎప్పుడు ఆడ్స్ వస్తాయి రా బాబు అనిపిస్తుంది..
అదేంటో.. అసలు వాటిల్లో creativity పోయింది.. ఇలాంటి వాటిల్లో.. సూపర్ గా పెరిగింది.. మా కజిన్ షేర్ చేసిన వీడియో నాకు ఛాలా బాగా నచ్చింది... grand maa proof ......... :P
అయినా ఈ మధ్య అమ్మమ్మలకి కూడా టైం దొరకట్లేదు మన తో ఉండటానికి... అమ్మ తోనే ఉండట్లేదు జనాలు వర్క్ వల్ల ఇంక అమ్మమ్మ దాకా ఎందుకు లే... :)
నాకు అన్నిటి కన్నా టూ much నవ్వొచ్చే ad మట్టుకు.. లారా /త్రిష... "మీ టూత్ పేస్టు లో ఉప్పు ఉందా.... ?? "
పెళ్ళికి, airport లో చెకింగ్ కి.. ఉప్పుకి ఏం సంబంధమో... :P ... ఉప్పు గురించి తక్కువగా estimate చేస్తున్నాం మనం.. ఆరోజు మహాత్మా గాంధీ.. ఈరోజు colgate toothpaste మాత్రమే గుర్తించాయి బాగా... :)
by the way .. "మీ toothpaste లో ఉప్పు ఉందా .. ? :P "
రేపు మీ ఇంట్లో అమ్మో,ఆవిడో ఇదే question అన్నం పెట్టేటప్పుడు అడిగితే... కష్టం... :P