21, జూన్ 2010, సోమవారం

ఫైనల్ గా ఈ ఉత్తరం

నేను ఎన్నో రోజులుగా నీతో బాధ పడీ పడీ .. ఫైనల్ గా .... ఒకటి చెపుదాం అని నీకు ఈ లెటర్ రాస్తున్నాను .. జీవితం లో ఎవరికయినా ఎప్పుడో ఒక సారి ప్రొబ్లెంస్ వస్తాయి కాని నీ లైఫ్ అంతా ప్రాబ్లం యేనా.. ప్రాబ్లం అంటేనే నువ్వు.. అసలు నిన్ను ఇలా తయ్యారు చేసిన పెద్ద వాళ్ళని అనాలి.. నాలుగు కాదు కాదు నలబయ్యి పీకినా నష్టం లేదు... అయినా నీలో maturity తక్కువ అని నా ఫీలింగ్.. ఫీలింగ్ కాదు నిజం... !!!

ఆరోజు బొమ్మరిల్లు లో హాసిని అన్నా.. ఈరోజు నా బ్లాగిల్లు లో నేను అన్నా ఒకే మాట .... "బుక్ నిండా ప్రొబ్లెంస్ ఏ... "

సో.. నేను ఏమి చెప్తున్నాను అంటే..

"డియర్ మాథ్స్ నువ్వు తొందరగా ఎదిగి నీ ప్రొబ్లెంస్ నువ్వే solve చేసుకోవాలి.. అంతే కాని ఇతరుల మీద ఆధార పడకు .. !!!"

అర్ధం అయ్యిందా మైండ్ ఇట్... !!!!

1 కామెంట్‌: