20, జూన్ 2010, ఆదివారం

నేను కొంచెం ఆలస్యం

పాపం ఒక ఆయనకు ఇద్దరు అమ్మాయిలే .. ఆయనకు అబ్బాయి ఉంటే బావుండు అని...
అబ్బాయి అంటే మోజు కాదు కాని.. మన శాస్త్రాల ప్రకారం పున్నామ నరకం వస్తుంది అని బయం తో.. కలిగిన ఆశ... !!!

కాని పిల్లలు చాలా బాగా చూసుకోవడం తో.. అది మర్చిపోయాడు.. కాని చనిపోయే ముందు.. మళ్లీ బెంగా...
ఈయన బాధ చూసి అమ్మాయిలూ బాధ పడేవారు..
మొత్తానికి ఒకానొక సమయాన ఆయన గతించారు...
పున్నామ నరకానికి వెళ్ళాడు....

అది ఎలాగా ఉంటుందో అని ఈయన ఒక పక్క టెన్షన్ పడుతుంటే... యమ బటులు వచ్చి.. చేతిలో లక్ష పెట్టి ఒక చెరసాలలో వేసి అదిగో అక్కడ నే కొడుకు ఉంటాడు వాడితో కొన్ని రోజులు ఉండు అని తోసేస్తారు.. !!!

కొడుకుని చూడగానే ప్రేమ నర్మదా గోదావారి కృష్ణా ఇంకా ఎన్ని సముద్రాలు నదులు ఉంటాయో అంతా పైకి చూపించాబోయాడు.. కాని వాడేమో.. ముందు నీ చేతిలో డబ్బు ఇచ్చి ఏమైనా మాట్లాడు అంటాడు.. ఆయన alaage చేస్తాడు..
తర్వాత taagudu ,తన్నడం ,తిట్టడం మిగిలిన కార్యక్రమాలు చేసి చివరికి అక్కడి నుండి బయటకు గెంటు తాడు..:-(

అప్పుడు యమ బటులు వచ్చి నీ పున్నామ నరకం పూర్తి అయ్యింది అని.. పెద్దగా పాపలు ఏమి లేక పోవడం తో స్వర్గం చేర్చుతారు..

అప్పుడు ఆ తండ్రి అనుకుంటాడు.. "ఓరిని ఈ గోల కథ అంతా బూలోకం లో కొడుకులు ఉన్న వాళ్ళు పడేదేగా.. కాకపోతే నేను పోయి పడ్డాను.. :-)

4 కామెంట్‌లు: