11, సెప్టెంబర్ 2011, ఆదివారం

అది అన మాట సంగతి.... :)



కాబోయే పెళ్ళికూతురు

రాబోయే అనామక భర్త కోసం
ఎంతో కష్టపడి
ఇంటి పనులు నేర్చుకుంటోందీ పిల్ల.

ఎవడో డిప్పకాయ కోసం
ఎందుకీ అవస్థని
నా కనిపించింది కాని,

ఫర్నీచరూ గిన్నెలూ తోమి
వాటికన్న ఉజ్వ్జలంగా మెరిసిపోయే

నా భార్య గుర్తుకొచ్చింది.

తలుపు  
నా మీద అలిగి
భళ్ళున తలుపు తెరచుకుని
వెళ్ళిపోయావు నీవు.
నీకై ఎన్నడో మూసుకున్న తలుపును
బార్లా తెరిచి,
గాలీ వెలుతురూ రానిచ్చినందుకు
బోలెడు థాంక్సు

ఈ కవిత ఇస్మయిల్ అన్న ఆయన రాసినది...  బావుంది కదా... !!  అలాంటి పరిస్థితుల్లో కూడా ఎంత optimistic   గా ఉండచ్చో అర్ధం అయ్యింది ఇది చదివాక... :)

ప్రాబ్లం వచ్చినప్పుడు... corporate లాంగ్వేజ్ అంట.. concerns అనాలంట... :P కంగారు పడడం వల్ల ఏమి use లేదు.. ఎంత పెద్ద బాధకి అయినా కొంచెం ఆలోచిస్తే... బయట పడే వే ఎలాగయినా దొరుకుతుంది... :) :)
కానీ........
Being an optimist after you've got everything you want doesn't count.


అది అన మాట సంగతి.... :)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి