14, సెప్టెంబర్ 2011, బుధవారం

బాధ పడకండి... :)

Trouble and perplexity drive me to prayer and prayer drives away perplexity and trouble.  ~Philip Melanchthen


మనలో ఒక 90 %  దేవుడిని ఎప్పుడు గుర్తు చేసుకుంటాం? 

important పని ఉన్నప్పుడు  రోజు వెళ్ళే కార్/బైక్  సడన్ గా రోడ్ మధ్యలో ఆగిపోతే... దేవుడిని తిట్టుకుంటాం... :)

అనుకున్న పని... అనుకున్నట్టు అవ్వకపోతే  పొద్దున్న ఎవడి మొహం చూసాం రా అని చూసిన వాడిని తిట్టుకుంటాం :P

ఇలాంటి నమ్మకాలు అన్నీ... పరిస్థితి తారు మారు అయ్యి నప్పుడు మాత్రమే గుర్తొస్తాయి :)


అన్నీ స్మూత్ గా వెళ్లిపోతుంటే,,,


" ఏంటి ఈ నమ్మకాలు చిరాగ్గా... పొద్దున్న ఎవడినో చూసినంత మాత్రాన  ఏమి అవుతుంది ... అని పక్క వాడికి క్లాసు ఇచ్చే స్టేజి  లో ఉంటాము :))"


prayer అనేది.. మన మైండ్ లో ఉన్న disturbances ని తొలగించడానికి మాత్రమే... 

నేను అనుకోవడం ఏంటి అంటే...దేవుడిని కోరికలు  అడగటానికి reason ... మనం దేని కోసం పరితపిస్తున్నామో మనకు తెలుస్తుంది... మాటి మాటికి అడగడం వల్ల దాని గురించి ఆలోచిస్తాం.. దాని పొందే వే ని కనుకుంటాం అని ఏమో....!!!

వహ్...  నికిత,,, చూడండి మీరు ఎలాగో పొగడట్లేదు కదా.. సో నేనే పొగిడే సుకుంటున్నా  .... :)


మనని మనం పోగుడుకోవాలి అప్పుడప్పుడు... అప్పుడే  మనని తిట్టే వాళ్ళు ఉన్నా... మనం అంత effect అవ్వము... :P


చలో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే.. ఎంత బిజీ గా ఉన్నా ఒక రెండు నిమిషాలు మీకు ఇష్టం అయిన దాని గురించి, మీరు చాలా హ్యాపీ గా రోజులని తలుచుకోండి... అప్పుడు మైండ్ చాలా రిఫ్రెష్ అవుతుంది...

తలుచుకోండి  కాని.. ఇప్పుడు అలా లేదని బాధ పడకండి... :)


మన లైఫ్ లో బెస్ట్ రావాలి అంటే  మనం చాలా worst situations ని face చెయ్యాలిసి వస్తుంది.... !!!





1 కామెంట్‌: