17, సెప్టెంబర్ 2011, శనివారం

జనాలు రోగాలను కూడా ఫ్రెండ్స్ చేసుకోవడం ..........

మీ సంగతి నాకు తెలీదు కానీ.. నాకు మాత్రం  చలి కాలం లో icecream తినాలి అనిపిస్తది... జలుబు ఉన్నప్పుడు  కూల్ డ్రింక్ తాగాలనిపిస్తుంది  .. అర్ధ రాత్రిళ్ళు మాత్రమే తల స్నానం చెయ్యాలి అని పిస్తది  ,, :P

తేడా... అనుకున్నా.. కానీ నాలాంటి  బోల్డు మంది జనాలని  చూసాక.. తప్పు లేదు,,, మిగతా   వాళ్లకి ఇలాంటి వాటిల్లో ఆనందం తెలీదు అని డిసైడ్ అయిపోయా,, :P

అదేంటో.. ప్రపంచం లో మనం చేస్తున్న తేడా పని.. మనం ఒక్కళ్ళమే చేస్తే.. భయ పడతాం  కానీ కొంచెం, మనకు ఒక నలుగురు అయిదుగురు తోడు అయితే.. ఇంక ఎక్కడ ఆగుతాం చెప్పండి... :)

ఇప్పుడు నేను kerchief పట్టుకుని ఈ పోస్ట్ రాస్తున్నా... :)

జలుబు నా బెస్ట్ ఫ్రెండ్... సో దాన్ని ఏమి అనను.. ఒక పది రోజులు నా దగ్గరికి రాకపోతే ఎక్కడ లేని బెంగ వస్తుంది... :)

జనాలు రోగాలను కూడా ఫ్రెండ్స్ చేసుకోవడం మొదలుపెట్టారు అనుకుంటున్నారా ... :P

ఇష్టం లేని వాటి గురించి. తిట్టుకోవడం వల్ల ఇంకా చిరాకు ఇంకా పెరుగుతుంది ... సో కష్టం అయినా కొంచెం పోగుడుకుంటే  వాటి మీద ఉన్న చిరాకు తగ్గుతుంది,,,, ఈసారి నువ్వు జలుబు,జ్వరం నా దగ్గరికి రమ్మన్నా  రావు... :P


ఆరే  ఐడియా పని చేస్తుంది డార్లింగ్... నిజంగా.... :)

నా సంగతి అంటే చెప్పా  కదా.. "స్పెషల్  సెక్షన్ అఫ్ పీపుల్... " కి ప్రెసిడెంట్ ని.... :P


నాకు motivational బుక్స్ చదవడం ఇష్టం ఉండదు... ఇంకొకళ్ళు మన లైఫ్ perfect గా ఎలా lead చెయ్యాలో చెప్తే  నేను ఎందుకు వినాలి.. నా లైఫ్ ఇలానే నాకు తోచినట్టు.. పెన్సిల్ తో రాసుకుంటా,,, :)


కానీ ఈ మధ్య వాళ్ళ లాగే మీకు చెపుతున్నా కదా.... :P ఇలా ఉండండి అలా చెయ్యండి అని... !!!


డార్లింగ్... సంగతి ఏంటి అంటే... అలాంటి బుక్స్ చదివే టప్పుడు .. or వినేటప్పుడు ఇంకోడు రాసాడు/చెపుతున్నాడు  అన్న ఫీలింగ్ తో చదవకండి, మీరే మీకు చెపుతున్నారు అనుకోండి.... :))


మనం మన కన్నా ఎక్కువ ఎవరి మాట వినలేము...

. హే ...ఊసరవిల్లి లో సాంగ్ విన్నారా.. "నేనంటే నాకిష్టం" 
బావుంది వినండి..... !!!!

3 కామెంట్‌లు: