11, సెప్టెంబర్ 2011, ఆదివారం

లేకపోతే మానెయ్యి.. పోయేదేమీ లేదు...

Real charity doesn't care if it's tax-deductible or not.  ~Dan Bennett 


అసలు  ఒక్కరికి  హెల్ప్ చేయడం అంటే ఏంటి  అంటారు.... ?  వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు     హెల్ప్ చేసి.. తర్వాత    జీవితం అంతా   చెప్పు   కోవడమా  ?

లేకపోతే  .. కొంచెం  సహాయం  చేసి వాళ్ళ జీవితం అంతా  మనం ఉద్దరించాము అన్న ఫీల్  లో  ఉండడమా .. ?


.  మనం తీసుకున్నవే  గుర్తు పెట్టుకోవాలి కాని.. ఇచ్చినవి  మర్చిపోవాలి  అంటారు... 

బాస్ మీ satisfaction కోసం కాకుండా వేరే వాళ్ళ గురించి మీరు ఇలాంటి  చారిటి చేస్తుంటే..  పిచ్చ లైట్ తీసుకుని మీరు అలాంటి పనులు  మానేయ్యండి... దాని వాళ్ళ ఉపయోగం ఏమి లేదు... :)


ఒక chinese proverb ఉంటుంది... పూలు పంచే వాడి చేతికి ఎప్పుడూ ఆ  సువాసన ఎంతో కొంత ఉంటుంది అని.... !!!


కొంత మంది జనాలని చూసిన   తర్వాత ఇలా రాయాలనిపించింది... ఇంట్లో వాళ్ళని చూసుకోరు కాని.. లక్షలు లక్షలు సొసైటీ కి ఖర్చు బెట్టారు...  :)


ఒక స్టేజి కి వెళ్ళిన తర్వాత బాగా earn చేసిన తర్వాత... మనం పుట్టినప్పటి నుండి శ్రీ మంతులు  అన్న షో ఆఫ్ ఇవ్వాలి అనుకుంటాము జనాలకి...  మన కన్నా తక్కువ స్టేజి లో ఉన్న చుట్టాలు ఉంటే  ... అస్సలు పట్టించుకోము... అదే కొంచెం ఎక్కువ స్టేటస్ వాళ్ళు అయితే.. మనకి వాళ్ళు తెలియక పోయినా కావాలని పరిచయం పెంచుకుంటాం... కదా... !!!


బంగారం ..ఇప్పుడు సంగతి ఏంటి అంటే..నీ రూట్స్ నువ్వు మర్చిపోయిన రోజు ,  నీ లైఫ్ నువ్వు lead చేస్తున్నట్టు కాదు.... ఎవరో లాగా pretend చేస్తున్నట్టు...  అది నీకు అవసరమా.. !!!

సో.. చెప్పేది ఏంటి అంటే.. ఊరి కోసం ఉపకారం చెయ్యకు.. నీకోసం చెయ్యి.. నీకు ఇష్టం లేకపోతే మానెయ్యి.. పోయేదేమీ లేదు... 









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి