20, ఆగస్టు 2010, శుక్రవారం

హై హై నాయకా

ఇప్పటి దాకా ఎప్పుడూ చీర కట్టుకోలేదు..... :-( కట్టు కుందాం అనుకునే.. నా పుట్టిన రోజుకి కొనుకున్నా కానీ చీర మహిమ ఏంటో గాని జ్వరం వచ్చేసింది.... అప్పుడు....

సరే.. ఈసారి లక్ష్మీ పూజ కి ఎలాగయినా కట్టాలి అన్న ఆలోచన బాగా పెట్టుకుని.... నిన్న రాత్రి పడుకున్నా.... లేచేసరికి.. తెల్లారి 10... మా వాళ్ళు అందరూ పూజ కోసం మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్ కి వెళ్ళారు.........

ఇంకా నాకు చిర కట్టే వాళ్ళు లేరు........... కష్ట పడి.... ఒక అమ్మాయిని వెతుక్కుంటే .. అక్కడ ఇంకో సమస్య.......... :-(

ఇంక .. ఈ చీర నాకు వద్దు అని డిసైడ్ అయినా టైం లో..... ఎలాగో అలా.. కట్టుకున్నా..... :-)

అందరూ పూజకు ఇంటికి వెళ్తే.. నేను మాత్రం.... లంచ్ కి వెళ్లి నట్టు అనిపించింది.... పైగా.. అపార్ట్మెంట్ కి రోడ్ క్రాస్ చెయ్యాలి.... ఏదో కష్ట పడి ఆ చీర పడిపోకుండా... ఓ.. జారిపోకుండా.. క్రాస్ చేస్తుంటే.. వెళ్ళే వాళ్ళు వాళ్ళ పని చూసుకోకుండా ప్రతి ఒక్కడు.. చూసే వాడే.. :-(

అయినా అంత వింత ఏమి ఉందో నాకు అర్ధం కాలేదు....

ఈరోజు నేను చేసిన పని ఏంటి అంటే... కలర్ మాయ బజార్.. dvd పెట్టుకుని.. చూసా. ఆ సినిమా.. ఎన్ని సార్లు చూసినా.., ఇంకా చూడాలి అనిపిస్తుంది నాకు ఎప్పుడూ...

రేలంగి అయితే అసలు నవ్వకుండా నవ్వు తెప్పిస్తాడు.. :-)

అసమదీయులు.. తసమదీయులు.... :-) అన్నిటి కన్నా svr అసలు............. సూపర్బ్....... !!!!

హై హై నాయకా.... !!!!!!!!!

పాటలు ఎప్పుడూ విన్నా ఇంకా కొత్త గానే ఉంటాయి........ :-) అలాంటి మ్యూజిక్ ఈరోజుల్లో చాలా తక్కువ...

3 కామెంట్‌లు: