7, ఆగస్టు 2011, ఆదివారం

అయ్యో మిస్ అయ్యాను...

మనం  దేని  కోసం  అయినా  wait చేస్తే  ఆ  moment వచ్చే  టప్పుడు దానిని  మనం  miss అవుతాం .. ఎంత మంది మనకు తోడుగా ఉన్నా మనని పట్టించుకోని ఒక్కరిని మనం చాలా మిస్ అవుతాం... :P

ఒక్కటి  మాత్రం నిజం మనం ప్రేమిస్తే వాళ్ళు మనకు శత్రువయినా ఆనందంగా మాట్లాడతాం...  ఒక్కసారి   కోపం వస్తే మనం చాలా ఇష్టపడ్డ వాళ్ళను కూడా పలకరించము...  ఇప్పుడు ఏ ఫీలింగ్ గొప్పది అనుకోవాలి... ప్రేమా లేక ద్వేషం హ?


కానీ కోపం అనేది మనం ఇష్టపడ్డ వాళ్ళ మీదే ఉంటుంది.. వాళ్ళు మన  expectations ని  తగ్గించేలా ఉన్నప్పుడు...
మనకు తెలిసి ఎవరు తప్పు చేసినా మనము పట్టించుకోము...మనం అంత freedom వాళ్లకి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు మన దగ్గర ఏవి అయినా దాస్తే... అప్పుడే చాలా బాధ పడతాం...

కానీ ఒక్కటి నిజం, మనం వీళ్ళతో ఆనందం గా ఉండగలం అన్న ఫీలింగ్ కలిగించే  వాళ్ళు ప్రపంచం లో చాలా తక్కువ ఉంటారు.. అలాంటి వాళ్ళు కలిసినప్పుడు.. అనవసరం అయిన  వాటి వల్ల ఆనందాన్ని చే జార్చుకోకూడదు...




1 కామెంట్‌: