friendship డే.......... లైఫ్ లో either డబ్బు అయినా ఉండాలి.. లేదంటే మనని ఎంతగానో ఇష్టపడి మన కష్టం లో తోడుందే ఒక స్నేహితుడయినా ఉండాలి.. అప్పుడు మన జీవితం లో ఎలాంటి కష్టం తెలీదు.... ఎవరూ లేకుండా మన జీవితం మనం హ్యాపీ గా గడిపేయచ్చు... కానీ ఎవరైన మనకు తోడు ఉంటే ఆ లైఫ్ వేరు... ఫ్రెండ్స్ లేకపోతే.. ఆడియో లేని మూవీ లా ఉంటుంది :P
పాత ఫ్రెండ్స్ తో ఈరోజు మాట్లాడండి... సండే కదా.. ఆఫీసు,కాలేజీ అలాంటి గొడవలు కూడా లేవు... అసలు అందుకనే ఫస్ట్ సండే సెలెబ్రేట్ చేసుకుంటారేమో.. :)
అడిగి తెలుసుకుని మనకు తోడు ఉండే ఫ్రెండ్స్ ఉంటారు. కానీ కొంత మంది మనం అడగకుండానే.. ఇలా ఉంటే బావుండు అన్న మాట విని మనకోసం చేసి పెడతారు... అలాంటి వాళ్ళని లైఫ్ లో దేని కోసం మిస్ అవ్వకూడదు ...
ఒక అమ్మాయి, అబ్బాయి.. లవ్ అన్న relation లో కన్నా friendship అన్న relation లోనే చాలా ఆనందంగా ఉంటారు... అలాంటి ఫ్రెండ్స్ మీకు ఉంటే.. మీరు చాలా చాలా లక్కీ... :)
anyways . మార్నింగ్ చదివాను ఒక చోట.. స్నేహం అనేది పెద్ద పని కాదు.. కానీ అది ఒక million చిన్న పనులు ఉన్న package లాంటిది అని... :)
కొట్టుకోవడం,అర్ధం చేసుకోవడం,తప్పు చేసినా నేను ఉన్నాను అని చెప్పడం లాంటి చిన్ని పనులు..
మన దగ్గర వంద కోట్లు ఉన్నా అవి దాచుకోవటానికి తప్పితే దేనికి పనికి రావు.. కానీ వంద కోట్ల నిమిషాలు కలిసి ఉన్నా ఇంకా ఉండాలి అన్న ఫీలింగ్ కలిగించే ఫ్రెండ్ ఉంటే... మన లైఫ్ ఎప్పుడు బ్యూటిఫుల్ గా ఉంటది కదా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి