13, సెప్టెంబర్ 2010, సోమవారం

తవిక

మరు క్షణం నా జీవితం ఆగి పోతుందని
తెలిసిన... ఆ క్షణ కాలం నీ సహవాసం లో ఉంటాను.........

నీ కన్నుల తడి లో వెచ్చదనం....
నా గుండెను తాకిన సమయం
నా ప్రాణం నన్ను వదిలి పెట్టకుండా ఆగుతుందేమో.. అన్న ఆశ తో....!!!

నిశీది లో నక్షత్రం అయ్యి
నీ చెంపన నా వెలుగులు చిందిస్తూ............
నా కోసం నువ్వు తలుచుకున్న ప్రతీ క్షణం...
నీ కన్నీరు చంప జారకుండా వెన్నెల తో
నీ కన్నుల వల వేస్తా

కలలో నీతో జీవితం నాకు వద్దు....
ఇలలో కలిసి ఉండాలనే ఆశ ఇంకా మూలో ఉంది..... ఏమో...

నీ అధరాల అమృతం ఇచ్చి నన్ను బతికించు









15 కామెంట్‌లు:

  1. ఇది రాసింది నువ్వేనా...!! నమ్మలేకుండా ఉన్నాను. పదాల మధ్య gaps పై దృష్టిపెట్టు, ప్రభావం ఇంకాబాగా ఉంటుంది....good luck :)

    రిప్లయితొలగించండి
  2. ఇది తవికే

    //కలలో నీతో జీవితం నాకు వద్దు....
    ఇలలో కలిసి ఉండాలనే ఆశ ఇంకా ఏ మూలో ఉంది..... ఏమో...

    నీ అధరాల అమృతం ఇచ్చి నన్ను బతికించు//
    :-)

    రిప్లయితొలగించండి
  3. Beautiful! tavika ani enduku pEru pettaali? andamgaa raasinappuDu edainaa andamaina peru pettocchu kadaa?

    రిప్లయితొలగించండి
  4. అమ్మాయ్...
    నాకు భావాన్ని ఎలా వ్యక్తం చెయ్యాలో అర్ధం కాలేదు...
    నీ తవిక కి..ఈ తవిక ని అంకితం ఇస్తున్నా...
    ఇన్నాళ్లూ..ఈ భావుకతని...ఏ అటకెక్కించావ్?
    అని మాత్రం అడగాలనిపించింది.......

    ---------------------
    నువ్వే... నువ్వే



    నువ్వే.... నువ్వే....
    కలలో..కవితలో...
    పాటగా....పదముగా...

    నువ్వే...నువ్వే..
    మనసులో....మమతలో..
    తోడుగా....నీడగా......

    నువ్వే...నువ్వే...
    కలవరింపులో...పలువరింపులో...
    అశగా....శ్వాశగా....

    నువ్వే...నువ్వే...
    కలహంసవై.....కలహప్రియవై....
    వెంటాడగా.....వేధించగా....
    - మూల్పూరి.ఆదిత్య చౌదరి
    -------------------

    రిప్లయితొలగించండి
  5. హృదయం
    . . . .

    తలపుల కిటికీ...
    తలుపులు తెరిచిన సమయం..
    మనసుని తాకిన
    మనిషిని కలిసే... క్షణం.
    హృదయం హృదయం..కలిసే
    ఉదయం....
    ఒకటి ఒకటి...
    ఒకటయ్యే ముహూర్తం...
    అపుడా...ఇపుడా...
    ఎపుడెపుడా అని...
    అడిగెను..... నా
    హృదయం..
    - మూల్పూరి. ఆదిత్య చౌదరి.

    రిప్లయితొలగించండి
  6. నీ సీరియల్ రాయటం మానేశావా?డోన్ట్ డూ దట్...ప్లీజ్ రైట్..

    రిప్లయితొలగించండి
  7. hiii nikki,

    mee katha next part eppudu post chestara ani nenu kallu kayalu chesukoni eduruchustunte, meerentandi unna parts kuda delete chesesaru.
    meemoppukom, dharnalu chestam. avasaramaite edo oka peru meeda yatra kuda chesetam.
    idanta jaragakudadante, aa katha purti cheseyandi

    mee
    veerabhimaani

    రిప్లయితొలగించండి
  8. నువ్వు రాయటం ఆపేస్తే...ఇంకేంలేదు..
    నేనూరుకోను...
    ఏదో ఒకటి రాయి...
    రేపటి నుండి నీ బ్లాగ్ కి సెలవు...
    పిల్'గ్రిమేజ్....సో ఇక నెక్స్ట్ మంత్ వస్తాను..
    ఈ లోపు..ఓ పదో పరకో రాసి పడెయ్యి..
    అన్నట్టు...నీకు ఆరోగ్యం అదీ బాగానే ఉంది కదా...
    రాయకపోతే డౌట్ వచ్చింది...లే

    రిప్లయితొలగించండి
  9. nikitha chandra sena good one

    enti posts numbers tagginchesav

    september lo only 9 posts idi dharunam

    రిప్లయితొలగించండి
  10. @ mahesh and aditya. naku time undatledu.. ala sagam sagam kanipisthunte.. naku nacchaledu.. so time unnapudu mottham antha raasthaanu...

    రిప్లయితొలగించండి