22, అక్టోబర్ 2010, శుక్రవారం

@ మల్లిక్

నా దిన ఫలాలలో .. నన్ను బుక్ చదవమన్నది... :-) సర్లే ఒకసారి చూద్దాం అనుకుని రూం లో ఉన్న నొవెల్స్ అన్ని వెతకడం స్టార్ట్ చేశా.. ఎలాగో ఏమి లేవు అనుకోండి.. సో లైబ్రరీ కి వెళ్దాం అని డిసైడ్ అయ్యా..... కాలేజీ లైబ్రరీ అంటే మూడ్ రాదు కానీ... జనరల్ లైబ్రరీ అంటే ఎక్కడ లేని ఆనందం ఎందుకో.... :-)

సరే... ఇక్కడ నేను ఒక బుక్ గురించి రాస్దాము అని డిసైడ్ అయ్యాను... మీకు ఎక్కడయినా దొరికితే చదవండి.... " నవ్వితే నవ రత్నాల్ -రచయిత మల్లిక్....


సూపర్ కామెడీ స్టోరీస్ నాకు అయితే బాగా నచ్చాయి........... మీకు కూడా నచ్చుతాయి .. దాన్లో "లవ్ మ్యారేజ్ అన్న స్టొరీ అయితే కాన్సెప్ట్ భలే బావుంది.. :-)

ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తున్నా అని చెప్పడానికి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది.... విషయం చెప్పే టప్పుడు తెగ కింద పడి పోతూ ఉంటుంది.... ( సిగ్గు తో మెలికలు తిరగడం వల్ల కాళ్ళు చీరకు అడ్డు వచ్చి..... :-) )
మొత్తానికి కష్ట పడి చెపుతుంది.. అబ్బాయి డాక్టర్.... వాళ్ళ ఇంట్లో ఏమి అభ్యంతరం లేదు... అమ్మాయి నాన్నకు ఇష్టం అయితే... వచ్చి మిగతావి మాట్లాడదాం అన్నారు....

కానీ వీళ్ళ నాన్న ఒప్పుకోడు......


ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకుని వచ్చేస్తుంది... ఎవరికీ చెప్ప కుండా..........


కొన్ని రోజులకి అన్నీ సర్దుకుంటాయి.....


అప్పుడు అమ్మాయి అమ్మ అడుగుతుంది తన భర్తని.... " ఏవండి ఇదేదో ముందే ఒప్పుకుని ఉండచ్చు కదా.... "

అప్పుడు అయన చెప్పే జవాబు ఏంటో తెలుసా.....


" అప్పుడే ఒప్పుకుని ఉంటే... అబ్బాయి నాన్న పెళ్లి మాట్లలకు వచ్చే వాళ్ళు... కట్నాలు అవి మనం అప్పుడు ఇచ్చుకోలేక పోతే... అసలు కే ఎసరు వచ్చేది.... ఇప్పుడు చూడు... కానీ ఖర్చు లేకుండా పెళ్లి అయిపొయింది... :=-)

ప్రేమ పెళ్ళి లలో ఇంత ఉందా..................... :-)


తెలివయిన మామ గారు కదా........... :-)

2 కామెంట్‌లు:

  1. మల్లిక్ కార్టూన్స్ బాగుంటాయి. కొద్దిగా కామెడి పాలు ఎక్కువ ....బాగుంది మీ నరేషన్

    రిప్లయితొలగించండి
  2. ఇంజనీరింగులో వున్నారంటే, మీ ఫోటోలో వున్నంత చిన్నపిల్లకారు. ఆల్కెమిస్ట్, చేతన్ భగత్ పుస్తకాలు, ముఖ్యంగా యండమూరి పుస్తకాలు చదివిన మీరు, మల్లిక్ నవ్వితే నవ్ రత్నాలు (1) ని ఇప్పుడే చదివారంటే.....!

    ఓ కే!

    రిప్లయితొలగించండి