ఈ కీర్తన ఎన్ని సార్లు విన్నా ... అంతకు అంత ప్రశాంతత పెరుగుతుంది అనిపిస్తుంది నాకు :) చాలా నెలల కిందట ఒక పెళ్ళికి వెళ్లి నప్పుడు , పెళ్లి కూతురు చాలా బాగా పాడుతుందని అందరూ ఏదయినా కీర్తన పాడ మంటే ఆ పిల్ల ఈ పాట పాడింది , నాకు సగం నుండి వినడం వల్ల పాట పల్లవి తెలియలేదు :( కానీ భలే నచ్చింది ...!!!
మొన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఒక టీవీ ఛానల్ వాళ్ళు చూపిస్తూ బ్యాక్ గ్రౌండ్ లో ఈ కీర్తన ప్లే చేసారు .youtube లో వెతికితే ,ఇది అన్నమాచార్య కీర్తన అని తెలిసింది .. ఇద్దరు ముగ్గురి వెర్షన్ విన్నా కానీ ఆ అమ్మాయి పాడినంత బాగా ఎవరిదీ అనిపించలేదు :(
ఈ కీర్తన పక్కన పెడితే అన్ని చోట్ల ఇంకో కీర్తన ఏంటంటే అదే హాట్ టాపిక్ జయ అమ్మ పాపం జైలు కి వెళ్ళింది ,65 ఏళ్ళు వయసులో నాలుగు ఏళ్ళు శిక్ష , అక్కడ ఒకటి అర్ధం కాలేదు నాకు ,66 కోట్ల ఆస్తికి 100 కోట్లు ఫైన్ ఏంటి ,అసలు అంత వైట్ మనీ తో ఫైన్ ఎలా కడతారు :O మళ్లీ ఇంకో స్కాం చెయ్యాలేమో :D
ఒక అమ్మ బ్లాక్ మనీ కేసు లో ,ఇంకో తాత 2జి స్కాం లో పోతే మిగిలేది మన పార్టీ నే అని BJP సూపర్ ఆనంద పడుతుంది అనుకుంటా :)
వీకెండ్ హ్యాపీ గా మహేష్ బాబు సినిమా చూసుకుందాం అనుకుంటే అస్సలు అలాంటి సాహసం చెయ్యొద్దు అని చూసిన వాళ్ళు గీతా బోధ చేసారు :P
ఇంకేం చెయ్యాలో చెయ్యాలో తెలీక youtube లో సినిమాలు ,tv లో సినిమాలు చూస్తూ ,ఎంత entertainment పొందానో తెలీదు కానీ బోల్డు విజ్ఞానం మాత్రం పొందాను :P అంటే పాత సినిమా చూసిన ప్రతి సారీ ఏదో ఒక కొత్త సినిమా సీన్ గుర్తు వచ్చేది :)
కావాలంటే ఇప్పుడు కూడా "రామయ్య వస్తావయ్య " చూస్తున్నా ,దానిలో రోహిణి హత్తంగడి ,'అప్డేట్ అవ్వండి ' అని ఫ్రీక్వెంట్ గా అంటుంది , ఆగడు లో మహేష్ డైలాగ్ ఇదే కదా :P
post కీర్తన తో స్టార్ట్ చేశా కాని , ఒక మంచి ఇండియన్ రాపర్ వీడియో ఆడ్ చేస్దాము అనుకుంటున్నా :) yo yo సింగ్ ది కాదులే భయ పడకండి / తన వీడియో లో సన్నీ లియోన్ ని గుర్తు తెచ్చుకుని ఇక్కడ లేదని నిరాశ చెంద కండి :P
ఆ చార్ బాటిల్ వోడ్కా లో రాప్ ఎక్కడ ఉందో ఇప్పటికీ అర్ధం కాదు నాకు ,తను పిట్ బుల్ ,సన్నీ ఏమో జెన్నిఫర్ లోపెజ్ అని మనం అనుకోవాలేమో :( ఏదో నాలుగు మాటలు ఫాస్ట్ గా అనేస్తే చాలేమో రాప్ అయిపోతది అనుకుంటా :) ఆ బేబీ డాల్ సాంగ్ jlo "dance again " నుండి కాపీ చేసి పడేసాడు స్టెప్స్ అన్నీ.... :( :(
వసుధైక కుటుంబం అన్నారు కదా .. సినిమాలు అన్నీ పాత వాటి నుండి వచ్చినా ,పాటలు అన్ని పక్క కంట్రీ నుండి ఎత్తుకు వచ్చినా ... అందరిదీ ఒకే కుటుంబం సో లైట్ తీసుకుని నచ్చితే విందాము ,లేకపోతే మానేస్దాము :D
హైదరాబాద్ లో బతుకమ్మ పండగ అని పది కోట్లు ఫండ్స్ ఇచ్చాడంట KCR , అక్కడ govt women employees కి ఈ దసరా అన్నీ రోజులూ మధ్యాహ్నం 2 నుండి వచ్చేయచ్చు అంట :O హాఫ్ డే ఆఫీసు అనమాట ...
సంక్రాంతి పండగకి మాత్రం రెండు రోజులు మాత్రమే సెలవు ఇచ్చాడంటా ,తెలంగాణా వాళ్ళు సంక్రాంతి చేసుకుంటారా ఎక్కడయినా :P అయినా సూపర్ అబ్బా .. పోలీస్ లకి ఇన్నోవాలు , గణేష్ లకి హెలికాప్టర్ లో పూల వానలు ,ఆడ పడుచులకి బతకమ్మలు ,సగం రోజు ఆఫీసు లు , తప్పదు లే మరి కిందటి సారి తెలంగాణ తెచ్చాడని వోట్ వేసారు , ఈసారి ఇలాంటివి ఏమైనా చెయ్యక పోతే ఎట్టా :) :)
కొమ్మలాల పాట బాణీ బాగుంది. కానీ గాయకుడు శ్రుతిని sustain చేయలేక పోయాడు అనిపించింది.
రిప్లయితొలగించండి