14, సెప్టెంబర్ 2014, ఆదివారం

మొదటి ఆఫర్ లెటర్ స్టోరీ .... !!!

ఈరోజు నా  కజిన్  ఒక  అమ్మాయి  కాల్  చేసింది , తనకు  TCS  లో  జాబ్  వచ్చింది అని  ... అది  తన  మొదటి  జాబు  అవ్వటం  అందులోను  కొంచెం  లేట్  గా  రావటం  వల్ల  చాలా  హ్యాపీ  గా  ఉంది  పిల్ల  :)

నా  మొదటి  ఆఫర్  లెటర్  తీసుకుని  ఇప్పటికి  మూడు  ఏళ్ళు  దాటింది , ఈ  పిల్ల  తో  మాట్లాడిన  తర్వాత  ఆ  రోజులు  తలుచుకుంటే  భలే  నవ్వు  వచ్చింది :)

నిజంగా  మొదటి  ఆఫర్  లెటర్  ని  bible /గీత  కన్నా  మిన్నగా  భావించి  రోజుకి   ఒక  పది  సార్లు  అయినా  చూసుకుని  మురిసిపోతాము  :D  ఇంక  ఇంట్లో  వాళ్ళ  సంగతి  అయితే  చెప్ప  నక్కర్లే   .. !!



జాబు  వచ్చిందీ  అంటే , నాకు  తెలిసి  మనం  చేసిన  మొదటి  పని  షాపింగ్  :D  ఇంట్లో  వెయ్యి  జతలు  ఉన్నా , ఫార్మల్స్  లేవు /  టై  లేదు / బెల్ట్  లేదు  లాంటి  పిచ్చి  excuses  చెప్పి  మరీ ఏదో  ఒకటి   కొనుక్కుని  వస్తాము  :)

ఆ  టైం  లో  మన  ముందు  ఉండే  పెద్ద  పనులూ ,మిలియన్  డాలర్  questions ఏంటి  అంటే 

 ఇప్పుడు  ఏ  బ్యాంకు  లో  సాలరీ  ఎకౌంటు  ఓపెన్  చెయ్యాలి  :D " ఎవడి  క్రెడిట్  కార్డు  బావుంటుంది  ,  సంవత్సరానికి  50k స్పెండ్  చెయ్యకపోతే  తర్వాత  వెయ్యి  రూపాయిల  ఛార్జ్  ఉంది  అంటే , అమ్మో  50k  ఎలా  ఖర్చు  పెట్ట  గలుగుతాము  అనుకుంటాము  కానీ  , సీన్  తర్వాత  రివర్స్  అయ్యి  ఇంకో  కార్డు  ఎవడు  ఇస్తాడా  అని  ఆలోచించే  పరిస్థితి  ఉంటుంది  అని  అప్పటి  మన  చిన్ని  బుర్ర  కి  తెలియదు  :D  :D

నెల  కు  వచ్చే  జీతాన్ని  మెంటల్  గా  అన్నిటికీ  డివైడ్  చెయ్యటం  మొదలు  పెడతాము   :)





మనం  ఎప్పుడూ   పేరు  కూడా  వినని  మావయ్య , తాతయ్య   LIC  తీసుకో  నీకు  టాక్స్  తగ్గుతది  అని  చెప్పడం  మొదలు  పెడతారు  అక్కడికి  మనం  నెలకు  లక్ష  మించి  సంపాదించే  తట్టు  :D

ఫేక్   రెంటల్  అగ్రిమెంట్  కోసం  స్టాంప్  లు  కొనటం లాంటి  అలవాటు  లేని  పనులు  కూడా చెయ్యటం  మొదలు  పెడతాము

మొదటి  రోజు  కంపెనీ  ambience  చూసి  నిజంగానే  చాలా  excite  అవుతాము , మన  పేరెంట్స్  కి  ఇలాంటివి  తెలియక  పోతే  ఇంటికి  వచ్చి  చాలా  గొప్పగా  చెప్తాము , నా  ఆఫీసు  బిల్డింగ్  20 ఫ్లోర్  లు  , అంతా  ac నే , కాఫీ  కి  మెషిన్  లు  ఉంటాయి ,పడుకోవటానికి  wellness  రూం  లు  ఉంటాయి , జిమ్  లు  ఉంటాయి , ఇవి  ఉంటాయి  అవి  ఉంటాయి  అని  మన మాటల  ప్రవాహం  ఆపము, వాళ్ళు  కూడా  అంతే  ఆనందం  గా  వింటారు   :)

పైన   లైన్  రాస్తుంటే  ఈ  మధ్య  Tv  లో  చూసిన  airtel  ad  గుర్తొచ్చింది  :) దాన్లో  అమ్మాయి  తన  పేరెంట్స్  కి  వీడియో  కాల్  లో తన  కంపెనీ  accomodation  చూపిస్తూ  ఉంటుంది ... లింక్  పెడతాము  అని  youtube  లో  వెతికితే  కనిపించట్లే  :( :(

నేను  కూడా   ఒక  త్రీ  ఇయర్స్  బ్యాక్  మా  అమ్మ నాన్న  కి , నా  కంపెనీ   accomodation   ని  అలానే  చూపించాను  :)

ఇంక  మొదటి  నెల  పని  గురించి  చెప్పు  కోవాలి, అందరూ  8 గంటలు  పని  చేస్తే , మనం  పన్నెండు  గంటలు   పని  చేస్తాము  :P  కొత్త  మోజు  అంతే  లెండి ... !!



ఇంత  మహా  ప్రస్థానం  తర్వాత  మన  కొచ్చిన  మొదటి  జీతం  చూసి  నప్పుడు  వచ్చిన  ఆనందం  మన  లైఫ్  లో  ఎప్పటికీ  గుర్తుంటుంది  కాదంటారా  , తర్వాత  నెలకు  ఎన్ని  లక్షలు  వచ్చినా  ,మొదటి  జీతం  ,మొదటి  జీతమే :)

జాబు  లో  ఏం  నేర్చుకుని  ఉంటామో  తెలీదు  కానీ , మొదటి  pay slip  మాత్రం  మనకు  టాక్స్  calculations  నేర్పిస్తుంది , ప్రావిడెంట్  ఫండ్  అంటే  కంపెనీ  మనకు  చేతికి  ఇవ్వదు  అని  తెలుస్తుంది , మనం  ఇంటికి  వెళ్లి  ఈ  విషయం  చెప్తే , తర్వాత  నీకు  కట్  అయిన  దాని  కంటే  డబల్  ఇస్తారు  అంటే , అప్పుడు  ఎప్పుడో  ఎందుకు ,అదేదో  ఇప్పుడే  ఇస్తే  బావుండు  అని  అనిపిస్తుంది  :D





అదండీ   మొదటి  ఆఫర్  లెటర్  స్టోరీ .... !!!  హ్యాపీ  సండే :) :)

2 కామెంట్‌లు: