పోస్ట్ రాస్దాము అని బ్లాగర్ ఓపెన్ చెయ్యగానే మా అక్క కాల్ చెయ్యడం తో ఇది పక్కన పెట్టి ,దాని కూతురు జానవి తో మాట్లాడేసరికి గొంతు ఆరిపోయి :P నీళ్ళు తాగుదాము అనుకునే సరికి పొలమారింది ... ఎవరో బాగా నన్ను తిట్టుకుంటున్నారు / తలుచుకుంటున్నారు అనుకుని మళ్లీ బ్లాగర్ ఓపెన్ చేసాను ...
ఈ నీళ్ళు తలుచుకుకోవటం /తిట్టుకోవడం కాన్సెప్ట్ అలోచించి నప్పుడు కొంచెం nostalgic గా అనిపించింది .. మన లో చాలా మంది ఇళ్లల్లో ఇలాంటివి బోల్డు నమ్మ కాలు ఉండేవి/ఉంటాయి కదా .. !!! కొన్ని కాలం తో పాటు మర్చిపోతాము , మరి కొన్ని ఇలా జీవితం అంతా గుర్తుంచుకు ఉంటాము ...
కొన్ని కొన్ని మనం మర్చిపోయినా ఏదో ఒక సినిమాలో చూపించినప్పుడు నవ్వు కొని ఊరుకుంటా ము (బొమ్మరిల్లు లో తల తగిలితే కొమ్ము లోస్తాయి అంటుంది చూడండి అలాంటివి :) )
ఇప్పుడు నాకు గుర్తున్న ఇంకొన్ని ఇక్కడ రాస్దాము అనుకుంటున్నా :)
1. రాత్రుళ్ళు గోళ్ళు తీసుకో కూడదు , ఇంటికి దెయ్యాలు వచ్చేస్తాయి తెలుసా :D
2. పొద్దున్నే లేచి చీపిరి కట్ట చూస్తే ఆ రోజంతా మీకు కష్టాలే , అయినా రాత్రి తాగింది ఎక్కు వయ్యి చీపిరి ఉన్న చోట పడుకోవాలి కానీ normal గా లేవగానే చీపిరి కట్ట ఎలా కనిపిస్తుంది , నన్ను అడిగితే ఇక్కడ తప్పు పొద్దున్నే నిద్ర లేపి మరీ చీపిరి కట్ట చూపించే వాళ్ళది :D
3. ఈసారి మీకు ఆవలింత వస్తే పెద్దగా నోరు తెరిచి ఆవలించ కండి , ఈగలు వెళ్తాయి అని కాదు , దెయ్యాలు వెళ్తాయి :P
4. ఎవరయినా ఇద్దరు ఒకేసారి ఒకే మాట మాట్లాడితే ఇంటికి చుట్టాలు వస్తారు , కాకి అరిచినా ఇలానే అంటారు కదా
5. ఎవరి కయినా డబ్బులు కానీ / తాళం చెవులు కానీ ఎడమ చేతితో ఇస్తే అవి ఇంక పోయినట్టే :p ఈ లెక్కన నా లాంటి ఎడమ చేతి వాటం వాళ్ళ పరిస్థితి ఏంటంటారు :D
6 జంట అరటి పళ్ళు తింటే కవలలు పుడతారు , ట్విన్స్ కోసం ట్రై చేసే వాళ్లకు సూపర్ షార్ట్ కట్ :P
7. మీకు ఈల వెయ్యటం వచ్చా ?? సరే ఒక వేళ ఇప్పుడు మీకు రాత్రి అయితే వెయ్యకండి , ఎందుకంటే పాములు వచ్చేస్తాయి మీ ఇంటికి , ఈలకి పాముకి ఏం సంబంధం ఓ ఇప్పటికీ అర్ధం అవ్వట్లేదు నాకు ,ఈల కూడా నాధ స్వరం లా వేసేంత talent మనకు ఉందంటారా :P
8 ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్ళకూడదు , అందుకని ఒక రాయి పట్టు కుని వెళ్ళాలి :)
9. ఒక రోజు లేచి అద్దం లో మీ జుట్టు లో పొరపాటున ఒక తెల్ల వెంట్రుక కనిపిస్తే , వెళ్లి గోద్రెజ్ కలర్ కొనుక్కోండి అంతే కానీ ఒకటే కదా అని పీకకండి , ఎందుకంటే అలా చేస్తే తెల్లారే సరికి మీ తల కూడా తెల్ల గా అయిపోతుంది :P
10 ఎక్కిళ్ళు వస్తే మిమ్మలిని ఎవరో తలుచుకుంటున్నారు
11. నీలి కళ్ళు ఉన్న వాళ్లకి దెయ్యాలు కనిపిస్తాయి అంట :P పాపం ఐశ్వర్య రాయి కి ఇప్పటికి ఎన్ని ఆత్మలు కనిపించి ఉంటాయో :P
12. వర్షం , ఎండా వస్తే ఇంద్ర ధనుస్సు వస్తది ఏమో తెలీదు కాని ,ఎక్కడో కుక్కకి నక్కకి పెళ్ళి మాత్రం ఎక్కడో పెళ్ళి అవుతూ ఉంటుంది అని తెలుసు కోండి :P
13. ఎవరికయినా రెండు సుడులు ఉంటే వాళ్లకి ఇద్దరు భార్యలు ఉంటారు , అదృష్ట వంతుడా / దురదృష్ట వంతుడు అంటాడా :P
14. ఎవరి కాళ్ళు అయినా దాటి వెళితే వాళ్ళ ఆయుష్షు తగ్గి పోతుంది తెలుసా
ఇప్పటికి ఇవే గుర్తొస్తున్నాయి , మీకు ఏమైనా తెలిస్తే గుర్తు తెచ్చుకుని నవ్వుకోండి :)
అయ్యో కుక్క అరుస్తుంది , దానికి ఏమైనా దెయ్యం కనిపించి ఉంటది ఏమో .. ఇప్పుడు ఎలా :P
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి