అన్నీ మనకు కావలిసినట్టు జరిగితే మనం ఎందుకు ప్రపంచం మారితే బాగుండు అనుకుంటాం :P
ఒక బుజ్జి కోతి పిల్ల అయిదు సంవత్సరాలు వచ్చినా మాట్లాడటం మొదలు పెట్టలేదు అంట , దాని తల్లి ఇంక దీనికి మాటలు రావేమో అని అనుకుని ఊరుకున్నది అంట .. ఇలా కొన్ని రోజుల తర్వాత ఒకరాత్రి అరటి పండు తింటూ ,ఆ చిన్ని కోతి చాలా స్పష్టంగా " ఇలా కుళ్ళిపోయిన అరటి పండు పెట్టడం లో నీ ఉద్దేశం ఏంటి ? " అన్నదంట
అది విన్న తల్లి సంతోషాన్ని తట్టులేక (అంతే కదా జరగదు అన్నది జరిగితే వచ్చే ఆనందం కి ఏది సరిపోదు ) ఇన్నిరోజులు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతుంది
అప్పుడు ఆ పిల్ల "మ్మ్మ్ ఇన్ని రోజులు మరి నువ్వూ పెట్టిన అరటి పళ్ళు బానే ఉన్నాయి " అన్నదంట :O
"If you are in harmony ,you will not complain about the world. you will not complain about anything "
బాగా మెచ్చుకుని ,hikes ఎక్కువ ఇచ్చే మేనేజర్ ఉంటే పని చేస్తున్న కంపెనీ ని తిట్టుకోము , చెప్పింది విని ,మనకు సరిగ్గా సరిపోయే పార్టనర్ దొరికితే పెళ్లి ని తిట్టుకోము ;)
ఒక్కోసారి మనకు కావాల్సిన దాని గురించి తప్పితే ఇంకో దాని గురించి అస్సలు పట్టించుకోము,అదే పని మీద ఉంటాము ...
ఒక ఊరిలో ఇలానే ఒక ముసలావిడ ఒక్కతే ఉండటం వల్ల జీవితం విరక్తి వచ్చి , మాట్లాడే చిలక కావాలని కొనుక్కుని తెచ్చుకుంటుంది , ఒక రెండు వారాల తర్వాత ఈ చిలక మాట్లాడట్లేదు అని అమ్మిన వాడి దగ్గరికి వెళ్తే , ఒక చిన్ని మువ్వలు కొన్నివ్వమంటాడు ఆడుకోవటానికి అప్పుడు మాట్లాడచ్చు అని , అది వర్కౌట్ అవ్వదు ,మళ్లీ వాడి దగ్గరికి వెళ్తే ఈసారి ఒక అద్దం కొనమంటాడు , అది కూడా వర్కౌట్ అవ్వదు
ఇలా ఎన్నోన్నో చేసి ఒక వారం తర్వాత ఆ ముసలావిడ ఈ షాప్ వాడితో చిలక చనిపోయింది అని చెపుతుంది (మాట్లాడలేదు అన్న frustration లో కొన్నవన్నీ విసిరి కొట్టిన్దేమో దాని మీద, నాకు డౌట్ యే :P )
అప్పుడు షాప్ వాడు అన్నదంట "అస్సలు ఏమి మాట్లాడకుండానే చచ్చిపోయిందా ? " అని
అప్పుడు ఈవిడ "ఒహ్ కాదు చనిపోయే ముందు ఒకే ఒక మాట మాట్లాడింది
"ప్లీజ్ ఇప్పటికయినా తినటానికి ఏమయినా పెట్టు " అని
మనకు కావాల్సింది ఎలాగయినా అయిపోవాలి అని ఒకోసారి ఇలాంటి చాలా important థింగ్స్ వదిలేస్తాము ,పక్క వాళ్ళ minimum అవసరాలు కూడా మర్చిపోతాము extremes లో ఉండటం వల్ల జరిగే అనార్దాలు ఇలాంటివే :)
nice post
రిప్లయితొలగించండిThanks volieti garu
రిప్లయితొలగించండిChala bagundi mee kadhanam,kadha !
రిప్లయితొలగించండిippatidaaka baane undigaa mottam meeda baane undi. simply superb.
రిప్లయితొలగించండిhttp://www.googlefacebook.info/
@ tarangini garu Thanks :)
రిప్లయితొలగించండి@ Ajay garu Thanks
రిప్లయితొలగించండిహహహ... భలే ఉంది. అందుకే అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. ఏది అతి అయినా ప్రమాదమే :)
రిప్లయితొలగించండిఈ సత్యాన్ని చిన్న కథల్లో చక్కగా చెప్పారు.
:) Thanks Pranav garu...
రిప్లయితొలగించండిమీరు చెప్పే తీరు అందులోని అంతరార్థం చాలా బాగా ఆకట్టుకుంది
రిప్లయితొలగించండి@Nagendra Thanks andi :)
రిప్లయితొలగించండి