28, అక్టోబర్ 2013, సోమవారం

అమ్మయ్యో ...... !!!

నేను మొన్నీమధ్య ఒక కథ విన్నాను 
                     
 బెంగాల్ లో ఈశ్వర చంద్ర విద్య సాగర్  అన్న ఒక వ్యక్తి ఉండేవారు అంట ,ఆయన గొప్ప సంఘ సంస్కర్త  ,మేధావి ఇంకా గొప్ప  ఫిలాసఫర్ అంట .. అయన చేసిన గొప్ప పనులకు గాను ,రాష్ట్రపతి పురస్కారం ప్రకటించటం జరిగింది , అయన చాలా పేదవాడు  (మనం కొలిచే డబ్బులు,బట్టలు,బంగారాల విషయం లో  ... :)  )  సరే మరి రాష్ట్ర పతి అవార్డు అంటే గొప్ప హడావిడి ఉంటుంది ,చాలా మంది వస్తారు కదా , మంచి బట్టలు వేసుకోవాలి అని ఆయనకు తెలిసిన వాళ్ళు ,ఆరోజుకి అవసరమయిన బట్టలు కొనిస్తాము ఎలాగయినా వేసుకోవాలి అని పట్టు పడితే ఈయన సరే అని ఒప్పుకున్నారు అంట 

ఈ హడావిడి ఇంకొన్ని  రోజులు ఉండగా .. విద్య సాగర్ కు ఒక మార్కెట్ ప్లేస్ లో ఒక ముస్లిం పెద్ద మనిషి కనిపించారు ,చాలా నెమ్మదిగా  తన ఇంటి వయిపు  నడుచుకుంటూ  వెళ్తున్నారు , ఇంతలో అటు వైపు నుండి ఇంకో మనిషి పరిగెత్తు కుంటూ వచ్చి  " అయ్యా  మీ ఇల్లు కాలిపోతుంది , తొందరగా రండి అన్నాడంట , ఈ పెద్ద మనిషి మాత్రం ఏ మాత్రం తన నడక లో వేగం మార్చలేదంట , ఈ ముసలాయనకు చెప్పింది అర్ధం కాలేదేమో అని ,మళ్లీ ఆ మనిషి "మీ ఇల్లు కాలిపోతుంది అంటుంటే ఇంత పెళ్లి నడక నడుస్తున్నారు ఏంటి? " అన్నాడంట 

అప్పుడు  ఆయన కాలిపోయే ఇల్లు ,నేను కంగారు పడినా పడకపోయినా కాలిపోతుంది ,అలా కాదు నేను పరిగెత్తడం వల్ల ఆగిపోతుందంటే చెప్పు ,ఇప్పుడే  పరుగు  మొదలు పెడతాను అన్నదంట  :)

ఇదంతా  చూసిన విద్య సాగర్ , తన పరిస్థితిని దీనికి రిలేట్  చేసుకుని  ఒక్క అవార్డు తీసుకోవటానికి నేను ఎప్పుడూ ఉండే విధంగా కాకుండా ,ఇప్పటిదాకా నేను జీవించిన జీవితానికి విరుద్దంగా  ఖరీదయిన బట్టలు  వేసుకోవడం అవసరం లేదని ,మాములుగానే అవార్డు  తీసుకోవటానికి వెళ్ళారు అంట 

“Any fool can know. The point is to understand.”  అంటారు  ,అది  ఆయన బాగా అర్ధం  చేసుకున్నట్టున్నారు  :)


అది నేను విన్న కథ ,,  నిజంగా జరిగి కూడా ఉండచ్చేమో ,,  

కాలిపోవటం  అంటే గుర్తొచ్చింది , అసలు ఉన్నాయో లేదో  తెలీని దాని గురించి  చెప్తాను వినండి   అదేలే చదవండి , ఎప్పుడో  చా ..... లా  కాలం కిందట (చాలా అంటే చాలా  :P )  THOTH   అనే ఒకాయన ఏక్కడో వేరే గ్రహం నుండి వచ్చి ,ఆయన కున్న  తెలివిని " khemu " అన్న ఒక human  race   కి నేర్పించాడు అంట .. ఈ khemu వాళ్ళే egyptians అంటారు , పిరమిడ్ ఆఫ్ గిజా  కూడా thoth  ఏ  కట్టించాడు  అని అంటారు 

కొన్ని వేల ఏళ్ళ తర్వాత ఇంక ఈజిప్ట్ వదిలి వెళ్ళే టైం లో , తన teachings అన్నీ కొన్ని ఎమరాల్డ్ plates మీద రాసి ఉంచారని చెప్తారు .. ఆ emerald plates ,ఆసిడ్ లో కరగవు అంట ,గాలిలో కలవవు అంట ,నిప్పులో కాలవంటా ,ఇంకా చెప్పాలంటే law of ionisation ని  ఏ మాత్రం obey చెయ్యవు అంట .... ఇంతకు దాన్లో ఏం రాసాడు అంటారా , secrets of life ,universe ,wisdom  వగైరా వగైరా ...  atlantean లాంగ్వేజ్ లో  అంట . 
 
అమ్మయ్యో నిజంగా ఇలాంటివి ఉంటాయా  :O  



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి