30, అక్టోబర్ 2013, బుధవారం

350 కి రెండు ఏనుగులు

అమ్మాయిలు   ఎంత కోపం లో ,డిప్రెషన్ లో ఉన్నా ఒక రెండు మాటలు  చాలా తొందరగా వాళ్ళ మూడ్ మార్చేస్తాయి అంట ... ఒకటి   I love You ,ఇంకోటి  50 % డిస్కౌంట్  :P

ఒక  వైఫ్ అండ్ హస్బెండ్  మధ్య  జరిగిన  conversation  గురించి  రాస్తాను  చదవండి  ...

Husband -> Wife   :  "నేను  నీకు  ఈరోజు  ఎంత  గొప్ప  డీల్ finalise  చేసుకొని వచ్చానో   చెప్పాలి ,రేపు మనం ఇద్దరం పక్క ఊరు వెళ్లి   200 రూపాయలకి  ఏనుగు ని  కొంటున్నాం



Wife :  కానీ  ఏనుగుని మనం  ఏమి   చేసుకుంటాము ?

Husband : ఏంటి  అలా  మాట్లాడతావు అసలు  ఎంత చవక బేరమో నీకు తెలియట్లేదు ,మళ్లీ  మళ్లీ  ఎవరూ  అమ్మరు ,నీ మట్టి బుర్రకి అర్ధం అవ్వట్లేదా ?

Wife : అది సరే  కానీ  మనం  ఉండేదే రెండు గదుల ఇంట్లో , దాన్ని తెచ్చుకుని మనం ఎక్కడ పెట్టుకుంటాము

Husband : అసలు  నీ బాధేంటి ,అర్ధం  చేసుకోవేంటి , ఎంత మంచి  బేరం  ఇది , అసలు రేపు  వాడిని   350 కి  రెండు  ఏనుగులు అడుగుదాం  అనుకుంటున్నా

హాహా  చూడండి  ఇప్పుడు ఈ   పెద్ద మనిషి  తనకు  ఉన్నవి  రెండే గదులన్న  విషయం  కూడా  ఈ  బేరం  లో పడి మర్చిపోయాడు  .. !!!

 ఇప్పుడు నాకొక డౌట్  ఆ   ఏనుగుని  200 కి  వదిలించుకోవాలి అనుకున్న షాప్ వాడిని మెచ్చుకోవాలా ?  లేక నిజంగా  350 కి  రెండు  కొందామన్న  ఈ భర్త గారిని   ని మెచ్చుకోవాలా ? లేక ప్రాక్టికల్  గా ఆలోచించిన  మట్టి బుర్రని మెచ్చుకోవాలా  :) కొంచెం  ఆలోచిస్తుంటే 350 కి  రెండు  ఏనుగులు  cheap  యే  కదా :P

We should watch our desires, they go on befooling us , goes on leading us into illusions,into dreams. ఇంత  కన్నా ఎక్కువ  ఫిలాసఫీ  ఈ  పోస్ట్  లో  రాయదలుచు కోలేదు  :P







29, అక్టోబర్ 2013, మంగళవారం

ఇప్పటి దాకా బానే ఉందిగా :)

                         
అన్నీ మనకు కావలిసినట్టు జరిగితే మనం ఎందుకు ప్రపంచం మారితే బాగుండు అనుకుంటాం  :P

ఒక బుజ్జి కోతి పిల్ల అయిదు సంవత్సరాలు వచ్చినా మాట్లాడటం మొదలు పెట్టలేదు అంట , దాని తల్లి ఇంక దీనికి మాటలు రావేమో అని అనుకుని ఊరుకున్నది అంట .. ఇలా కొన్ని రోజుల తర్వాత  ఒకరాత్రి  అరటి పండు తింటూ ,ఆ చిన్ని కోతి  చాలా స్పష్టంగా  " ఇలా కుళ్ళిపోయిన అరటి పండు పెట్టడం లో నీ ఉద్దేశం ఏంటి ? " అన్నదంట

అది విన్న తల్లి సంతోషాన్ని తట్టులేక  (అంతే కదా జరగదు అన్నది జరిగితే వచ్చే ఆనందం కి ఏది సరిపోదు ) ఇన్నిరోజులు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతుంది

అప్పుడు ఆ  పిల్ల  "మ్మ్మ్ ఇన్ని రోజులు మరి నువ్వూ   పెట్టిన  అరటి పళ్ళు  బానే ఉన్నాయి  " అన్నదంట  :O

     "If you are in harmony ,you will not complain about  the world. you will not complain about anything "

బాగా మెచ్చుకుని ,hikes ఎక్కువ ఇచ్చే మేనేజర్ ఉంటే పని చేస్తున్న కంపెనీ ని తిట్టుకోము , చెప్పింది విని ,మనకు సరిగ్గా సరిపోయే పార్టనర్ దొరికితే పెళ్లి ని తిట్టుకోము ;)


ఒక్కోసారి మనకు కావాల్సిన దాని గురించి తప్పితే ఇంకో దాని గురించి అస్సలు పట్టించుకోము,అదే పని మీద ఉంటాము  ...

ఒక ఊరిలో ఇలానే ఒక ముసలావిడ ఒక్కతే ఉండటం వల్ల జీవితం విరక్తి వచ్చి  , మాట్లాడే చిలక కావాలని కొనుక్కుని తెచ్చుకుంటుంది , ఒక రెండు వారాల తర్వాత ఈ చిలక మాట్లాడట్లేదు అని  అమ్మిన వాడి దగ్గరికి వెళ్తే , ఒక చిన్ని మువ్వలు  కొన్నివ్వమంటాడు ఆడుకోవటానికి అప్పుడు మాట్లాడచ్చు  అని , అది వర్కౌట్ అవ్వదు ,మళ్లీ  వాడి దగ్గరికి వెళ్తే  ఈసారి  ఒక అద్దం కొనమంటాడు , అది కూడా వర్కౌట్  అవ్వదు
ఇలా  ఎన్నోన్నో చేసి ఒక వారం తర్వాత ఆ ముసలావిడ  ఈ షాప్ వాడితో  చిలక చనిపోయింది  అని  చెపుతుంది (మాట్లాడలేదు అన్న  frustration లో కొన్నవన్నీ  విసిరి కొట్టిన్దేమో దాని మీద, నాకు  డౌట్ యే   :P )

అప్పుడు షాప్ వాడు అన్నదంట  "అస్సలు  ఏమి మాట్లాడకుండానే చచ్చిపోయిందా ? " అని

అప్పుడు  ఈవిడ  "ఒహ్  కాదు  చనిపోయే ముందు  ఒకే ఒక  మాట మాట్లాడింది

"ప్లీజ్  ఇప్పటికయినా  తినటానికి ఏమయినా   పెట్టు " అని

మనకు కావాల్సింది ఎలాగయినా  అయిపోవాలి అని  ఒకోసారి  ఇలాంటి చాలా  important  థింగ్స్  వదిలేస్తాము ,పక్క  వాళ్ళ minimum  అవసరాలు కూడా మర్చిపోతాము extremes  లో  ఉండటం వల్ల  జరిగే  అనార్దాలు  ఇలాంటివే :)




28, అక్టోబర్ 2013, సోమవారం

అమ్మయ్యో ...... !!!

నేను మొన్నీమధ్య ఒక కథ విన్నాను 
                     
 బెంగాల్ లో ఈశ్వర చంద్ర విద్య సాగర్  అన్న ఒక వ్యక్తి ఉండేవారు అంట ,ఆయన గొప్ప సంఘ సంస్కర్త  ,మేధావి ఇంకా గొప్ప  ఫిలాసఫర్ అంట .. అయన చేసిన గొప్ప పనులకు గాను ,రాష్ట్రపతి పురస్కారం ప్రకటించటం జరిగింది , అయన చాలా పేదవాడు  (మనం కొలిచే డబ్బులు,బట్టలు,బంగారాల విషయం లో  ... :)  )  సరే మరి రాష్ట్ర పతి అవార్డు అంటే గొప్ప హడావిడి ఉంటుంది ,చాలా మంది వస్తారు కదా , మంచి బట్టలు వేసుకోవాలి అని ఆయనకు తెలిసిన వాళ్ళు ,ఆరోజుకి అవసరమయిన బట్టలు కొనిస్తాము ఎలాగయినా వేసుకోవాలి అని పట్టు పడితే ఈయన సరే అని ఒప్పుకున్నారు అంట 

ఈ హడావిడి ఇంకొన్ని  రోజులు ఉండగా .. విద్య సాగర్ కు ఒక మార్కెట్ ప్లేస్ లో ఒక ముస్లిం పెద్ద మనిషి కనిపించారు ,చాలా నెమ్మదిగా  తన ఇంటి వయిపు  నడుచుకుంటూ  వెళ్తున్నారు , ఇంతలో అటు వైపు నుండి ఇంకో మనిషి పరిగెత్తు కుంటూ వచ్చి  " అయ్యా  మీ ఇల్లు కాలిపోతుంది , తొందరగా రండి అన్నాడంట , ఈ పెద్ద మనిషి మాత్రం ఏ మాత్రం తన నడక లో వేగం మార్చలేదంట , ఈ ముసలాయనకు చెప్పింది అర్ధం కాలేదేమో అని ,మళ్లీ ఆ మనిషి "మీ ఇల్లు కాలిపోతుంది అంటుంటే ఇంత పెళ్లి నడక నడుస్తున్నారు ఏంటి? " అన్నాడంట 

అప్పుడు  ఆయన కాలిపోయే ఇల్లు ,నేను కంగారు పడినా పడకపోయినా కాలిపోతుంది ,అలా కాదు నేను పరిగెత్తడం వల్ల ఆగిపోతుందంటే చెప్పు ,ఇప్పుడే  పరుగు  మొదలు పెడతాను అన్నదంట  :)

ఇదంతా  చూసిన విద్య సాగర్ , తన పరిస్థితిని దీనికి రిలేట్  చేసుకుని  ఒక్క అవార్డు తీసుకోవటానికి నేను ఎప్పుడూ ఉండే విధంగా కాకుండా ,ఇప్పటిదాకా నేను జీవించిన జీవితానికి విరుద్దంగా  ఖరీదయిన బట్టలు  వేసుకోవడం అవసరం లేదని ,మాములుగానే అవార్డు  తీసుకోవటానికి వెళ్ళారు అంట 

“Any fool can know. The point is to understand.”  అంటారు  ,అది  ఆయన బాగా అర్ధం  చేసుకున్నట్టున్నారు  :)


అది నేను విన్న కథ ,,  నిజంగా జరిగి కూడా ఉండచ్చేమో ,,  

కాలిపోవటం  అంటే గుర్తొచ్చింది , అసలు ఉన్నాయో లేదో  తెలీని దాని గురించి  చెప్తాను వినండి   అదేలే చదవండి , ఎప్పుడో  చా ..... లా  కాలం కిందట (చాలా అంటే చాలా  :P )  THOTH   అనే ఒకాయన ఏక్కడో వేరే గ్రహం నుండి వచ్చి ,ఆయన కున్న  తెలివిని " khemu " అన్న ఒక human  race   కి నేర్పించాడు అంట .. ఈ khemu వాళ్ళే egyptians అంటారు , పిరమిడ్ ఆఫ్ గిజా  కూడా thoth  ఏ  కట్టించాడు  అని అంటారు 

కొన్ని వేల ఏళ్ళ తర్వాత ఇంక ఈజిప్ట్ వదిలి వెళ్ళే టైం లో , తన teachings అన్నీ కొన్ని ఎమరాల్డ్ plates మీద రాసి ఉంచారని చెప్తారు .. ఆ emerald plates ,ఆసిడ్ లో కరగవు అంట ,గాలిలో కలవవు అంట ,నిప్పులో కాలవంటా ,ఇంకా చెప్పాలంటే law of ionisation ని  ఏ మాత్రం obey చెయ్యవు అంట .... ఇంతకు దాన్లో ఏం రాసాడు అంటారా , secrets of life ,universe ,wisdom  వగైరా వగైరా ...  atlantean లాంగ్వేజ్ లో  అంట . 
 
అమ్మయ్యో నిజంగా ఇలాంటివి ఉంటాయా  :O  



23, అక్టోబర్ 2013, బుధవారం

AmaZon Interview

నా ఫ్రెండ్ భరత్ నాకన్నా ముందు batch లో అదే experiment చేసాడు ... నా wire ఫోబియా  గురించి తెలిసిన వాడు అవ్వడం వల్ల  "నిక్కీ  నేను కనెక్ట్ చేసి ఉంచేస్తా  నువ్వు వాల్యూస్  తీసుకో డైరెక్ట్ గా అన్నాడు ... 

నేను ఇదేదో బావుంది అనుకున్నా .. కానీ  తను fuse కనెక్ట్ చెయ్యటం మర్చిపోయాడు .. సరే లే ఒకటే కదా పెడదాం అనుకుని  పెట్టగానే

 షార్ట్ circuit  అయ్యి  sparkles వచ్చాయి ...  negative thoughts ఫాస్ట్ గా manifest అవుతాయి కదా  :D

హాహా ఇన్నిరోజులు  టీవీ లో ఏదయినా బ్రేక్ తర్వాత మళ్లీ ఎందుకు ముందు మూడు నిమిషాలు జరిగినది  రిపీట్ చేస్తారో ఇప్పుడు అర్ధం అయ్యింది  :D 

ఆ విధంగా ఆ మంటలకు భయపడిన దానినై  నాలోని ఇంకో ఐంస్టీన్ ని పుట్టించటం ఇష్టం లేక  నీట్ గా  experiment  చెయ్యకుండా  స్టాండర్డ్ వాల్యూస్  ఇచ్చేయ్యడం జరిగినది ...  నేనేదో కష్ట పడి అంత exact వాల్యూస్ తెప్పించాను అని  నా ప్రొఫెసర్ భ్రమ పడి  ఫుల్ మార్క్స్ వెయ్యటం జరిగింది ...  పైగా బోనస్  గా పొగడ్తలు  :O  నాకయితే తిట్టి నట్టే అనిపించింది అది వేరే సంగతి అనుకోండి  :) మొత్తానికి  ఈ  eee ల్యాబ్ గొడవ వదిలిందని పిచ్చ ఆనందం వేసింది  :)

దెబ్బకు బుద్ధి కూడా వచ్చి  ప్రాక్టికల్ కి ఇంపార్టెన్స్  ఇవ్వటం మొదలు పెట్టాను ... !!!

అబ్బో మా batch లో చాలా మంది వందల లైన్ల DS  కోడ్ కూడా exam కి గుర్తుంచుకునే వాళ్ళు ,, నేను మాత్రం eee దెబ్బకు కంప్యూటర్స్ కి కూడా రిస్క్ చెయ్యటం భయం వేసి బుద్ధిగా hands on  చేసుకునే దానిని   సో  క్యూట్ కదా  :P కొంచెం పొగడచ్చు కదా :)

ఇలా బట్టి మంత్రం మానేసిన చాలా  రోజులకి కరెక్ట్ గా హెల్త్ బాగోని టైం లో  AMAZON నుండి SDE  position కి interview కాల్ వచ్చింది ,, thursday కాల్ చేసి saturday టెస్ట్ అన్నారు ,,, వాళ్ళ requirement datastructures  and Algorithm designing ... ఎప్పుడో కాలేజీ లో చదవడం తప్ప  graphs ,trees ,linked lists  వైపు చూసిందే లేదు ... కానీ Amazon /MS/Google   interview క్లియర్ చెయ్యాలి అంటే వీటిల్లో చాలా స్ట్రాంగ్ ఉండాలి ... 

నాకు అంత ప్రతీ టాపిక్ బ్రష్ చేసుకునే టైం కూడా లేదు .... 

అప్పుడెప్పుడో నాకు  తెలిసిన ఒక ఫ్రెండ్ ఇంటర్వూస్  కి ఒక రెండు బుక్స్ రెఫెర్ చేసినట్టు గుర్తొచ్చి ... ఆ బుక్స్ pdf కూడా నా దగ్గర ఉందని గుర్తొచ్చి అదృష్టం కొద్దీ కనిపించటం కూడా జరిగింది ... ఆ రెండు బుక్స్ ఏంటంటే 

1 Programming Interviews Exposed (PIE ) http://it-ebooks.info/book/1293/
2. Cracking Code Interview (CCI ) ( ఈ బుక్  carrer Cup  వాళ్ళది )  http://www.valleytalk.org/wp-content/uploads/2012/10/CrackCode.pdf

సరే ఇప్పుడు రెండు బుక్స్ చదివే టైం నాకైతే కనిపియ్యక పోవటం  తో  CCI  ఒకటే చదువుదాం అని డిసైడ్ అయ్యాను ...   కొంచెం చూసాక అదే చదివాక చీ మళ్లీ మొదటికొచ్చింది నా బుద్ధి :D  , ఇలా కాన్సెప్ట్ లేకుండా problems చేస్తే మళ్లీ అక్కడ eee ల్యాబ్ లా అవుతది అని  బేసిక్స్ చదవటం బెస్ట్ అని డిసైడ్ అయ్యా 

1. Linked Lists 


ఈ టాపిక్స్ standford ప్రొఫెసర్  nick parlante  సూపర్ గా explain చేస్తారు పైగా అన్నీ possible problems ఆ టాపిక్స్ మీద అయన with solutions బాగా చెప్తారు  ...  ఈ టాపిక్స్ చదవాలి అనుకునే వాళ్ళు  అయన నోట్స్ download చేసుకోండి ... చాలా useful..  

Stacks  ,queues  ,hashtable  implementations , backtrack algorithm  problems  ,  DFS ,BFS,sorting , complexities ,string poblems (esp anagrams, unique characters extractions)

ఇవన్నీ బ్రష్ చేసుకున్నాక Code Crack  చదవడం బెస్ట్ .... !!!

written డైరెక్ట్  గా  కోడ్ క్రాక్ నుండి ఇచ్చాడు మూడు questions .. హ్మ్...  ఈవెన్  టెక్నికల్ ఇంటర్వూస్ కూడా పైన చెప్పిన వాటి నుండి maximum అడిగారు ... !!!

నాకైతే written రాసినప్పుడు  Classwork   చదివి  assignment  రాసిన  ఫీలింగ్ వచ్చింది  :D 

కానీ  ఆ బుక్స్ ప్రాక్టీసు చేస్తే written  for sure get on  అవచ్చు కానీ తర్వాత టెక్నికల్ కి కాన్సెప్ట్ ఉండాలి .. సో  పైన చెప్పిన టాపిక్స్ మీద స్ట్రాంగ్ knowledge పెంచుకోండి  :) ఓపిక  ఉంటే  Introduction to algorithms aka CLRS book  http://tberg.dk/books/Introduction_to_algorithms_3rd_edition.pdf 
చదువు కోండి datastructure algorithm designing కి క్లాసిక్ బుక్ అది .... :) 

 ఇంక  ఏం లాంగ్వేజ్  అంటారా c/c++/java మీ ఇష్తం కానీ ఒకటి పర్ఫెక్ట్  గా ఉండండి .... నాకు nick parlante pointers మీద pdf 
http://cslibrary.stanford.edu/102/PointersAndMemory.pdf  చదివాక అవంటే చాలా ఇష్టం ఏర్పడింది  :)  

job కోసం కాకుండా అర్ధం చేసుకుంటే బెటర్ ... ఎందుకు అంటే  ఆ కోడ్ క్రాక్ బుక్ చదివినా నేను  అక్కడ వెళ్ళాక ఏం గుర్తు రాలేదు .. మళ్లీ  నా పాత hands on  ఏ నాకు హెల్ప్ చేసింది ....  happy learning :) 

అదీ సంగతీ సమాచారం  :)