13, సెప్టెంబర్ 2014, శనివారం

చిన్నప్పటి చిన్ని భయాలు :)

పోస్ట్  రాస్దాము  అని  బ్లాగర్  ఓపెన్  చెయ్యగానే  మా  అక్క  కాల్  చెయ్యడం  తో  ఇది  పక్కన  పెట్టి ,దాని  కూతురు  జానవి  తో  మాట్లాడేసరికి  గొంతు  ఆరిపోయి  :P  నీళ్ళు  తాగుదాము  అనుకునే  సరికి  పొలమారింది  ... ఎవరో  బాగా  నన్ను  తిట్టుకుంటున్నారు / తలుచుకుంటున్నారు  అనుకుని  మళ్లీ  బ్లాగర్  ఓపెన్  చేసాను ...

ఈ   నీళ్ళు  తలుచుకుకోవటం /తిట్టుకోవడం  కాన్సెప్ట్  అలోచించి  నప్పుడు  కొంచెం  nostalgic  గా  అనిపించింది  ..  మన లో  చాలా  మంది   ఇళ్లల్లో    ఇలాంటివి  బోల్డు  నమ్మ కాలు  ఉండేవి/ఉంటాయి   కదా .. !!! కొన్ని  కాలం  తో  పాటు  మర్చిపోతాము , మరి కొన్ని  ఇలా  జీవితం  అంతా  గుర్తుంచుకు ఉంటాము ... 

కొన్ని  కొన్ని  మనం  మర్చిపోయినా  ఏదో  ఒక  సినిమాలో  చూపించినప్పుడు  నవ్వు  కొని  ఊరుకుంటా ము  (బొమ్మరిల్లు  లో  తల  తగిలితే  కొమ్ము  లోస్తాయి  అంటుంది  చూడండి  అలాంటివి  :) )

ఇప్పుడు  నాకు  గుర్తున్న  ఇంకొన్ని  ఇక్కడ  రాస్దాము  అనుకుంటున్నా  :)

1. రాత్రుళ్ళు  గోళ్ళు  తీసుకో  కూడదు , ఇంటికి  దెయ్యాలు  వచ్చేస్తాయి  తెలుసా  :D 

2. పొద్దున్నే  లేచి  చీపిరి  కట్ట  చూస్తే  ఆ  రోజంతా  మీకు  కష్టాలే  , అయినా  రాత్రి  తాగింది  ఎక్కు  వయ్యి  చీపిరి  ఉన్న  చోట  పడుకోవాలి కానీ  normal  గా  లేవగానే  చీపిరి  కట్ట  ఎలా కనిపిస్తుంది , నన్ను  అడిగితే  ఇక్కడ  తప్పు  పొద్దున్నే  నిద్ర  లేపి  మరీ  చీపిరి  కట్ట  చూపించే  వాళ్ళది  :D 

3. ఈసారి  మీకు  ఆవలింత  వస్తే  పెద్దగా  నోరు  తెరిచి  ఆవలించ కండి , ఈగలు  వెళ్తాయి  అని  కాదు , దెయ్యాలు  వెళ్తాయి :P 

4. ఎవరయినా  ఇద్దరు  ఒకేసారి  ఒకే  మాట  మాట్లాడితే  ఇంటికి  చుట్టాలు  వస్తారు  , కాకి  అరిచినా  ఇలానే  అంటారు కదా  

5. ఎవరి  కయినా  డబ్బులు  కానీ / తాళం  చెవులు  కానీ   ఎడమ  చేతితో  ఇస్తే  అవి  ఇంక పోయినట్టే  :p  ఈ  లెక్కన  నా  లాంటి  ఎడమ  చేతి  వాటం  వాళ్ళ  పరిస్థితి  ఏంటంటారు  :D 

6 జంట  అరటి  పళ్ళు  తింటే కవలలు  పుడతారు  , ట్విన్స్  కోసం  ట్రై చేసే  వాళ్లకు  సూపర్  షార్ట్  కట్  :P 

7. మీకు  ఈల  వెయ్యటం  వచ్చా  ?? సరే   ఒక  వేళ  ఇప్పుడు  మీకు  రాత్రి  అయితే  వెయ్యకండి , ఎందుకంటే  పాములు  వచ్చేస్తాయి  మీ  ఇంటికి , ఈలకి  పాముకి  ఏం  సంబంధం  ఓ  ఇప్పటికీ  అర్ధం  అవ్వట్లేదు  నాకు ,ఈల  కూడా  నాధ  స్వరం  లా  వేసేంత  talent  మనకు  ఉందంటారా  :P 

8 ముగ్గురు కలిసి  ఎక్కడికి వెళ్ళకూడదు ,  అందుకని  ఒక  రాయి  పట్టు  కుని  వెళ్ళాలి  :)

9. ఒక  రోజు  లేచి  అద్దం  లో  మీ  జుట్టు  లో  పొరపాటున  ఒక  తెల్ల  వెంట్రుక  కనిపిస్తే , వెళ్లి  గోద్రెజ్  కలర్  కొనుక్కోండి  అంతే  కానీ  ఒకటే  కదా  అని  పీకకండి , ఎందుకంటే  అలా  చేస్తే  తెల్లారే  సరికి  మీ  తల  కూడా  తెల్ల  గా  అయిపోతుంది  :P 

10 ఎక్కిళ్ళు   వస్తే  మిమ్మలిని  ఎవరో  తలుచుకుంటున్నారు 

11. నీలి  కళ్ళు  ఉన్న  వాళ్లకి  దెయ్యాలు  కనిపిస్తాయి  అంట  :P  పాపం  ఐశ్వర్య  రాయి  కి  ఇప్పటికి ఎన్ని  ఆత్మలు కనిపించి  ఉంటాయో  :P 

12. వర్షం  , ఎండా  వస్తే  ఇంద్ర  ధనుస్సు  వస్తది  ఏమో  తెలీదు  కాని ,ఎక్కడో  కుక్కకి  నక్కకి  పెళ్ళి  మాత్రం  ఎక్కడో పెళ్ళి  అవుతూ  ఉంటుంది  అని  తెలుసు  కోండి  :P 

13.  ఎవరికయినా  రెండు  సుడులు   ఉంటే  వాళ్లకి  ఇద్దరు  భార్యలు  ఉంటారు , అదృష్ట  వంతుడా / దురదృష్ట  వంతుడు  అంటాడా  :P 

14. ఎవరి  కాళ్ళు  అయినా  దాటి  వెళితే  వాళ్ళ  ఆయుష్షు  తగ్గి  పోతుంది  తెలుసా 

ఇప్పటికి  ఇవే  గుర్తొస్తున్నాయి  , మీకు  ఏమైనా  తెలిస్తే  గుర్తు  తెచ్చుకుని  నవ్వుకోండి  :)

అయ్యో  కుక్క  అరుస్తుంది  , దానికి  ఏమైనా  దెయ్యం  కనిపించి  ఉంటది  ఏమో  .. ఇప్పుడు  ఎలా  :P  

8, సెప్టెంబర్ 2014, సోమవారం

మేము ఆ నెక్స్ట్ రోజు ఎంత సేవింగ్ చేసాం అంటే

చాలా  రోజుల  తర్వాత హైదరాబాద్  వెళ్లి  నప్పుడు  ఎంత  ఆనందం  వేసిందో .. ఉన్న వారం  రోజులు  వర్షం  పడుతూనే ఉండటం  అంత  చిరాకు  వేసింది  :(

సింగపూర్  చేస్తాము  సింగరాయి  కొండ  చేస్తాము,అంటారు  కానీ  అదే  సింగపూర్  లో   రోజూ  పెద్ద  పెద్ద  వర్షాలు  పడినా  ఒక  చుక్క  నీళ్ళు  ఉండవ్ , మన  హైదరాబాద్  కూడా  అంతే  అనుకోండి .. చుక్క  నీళ్ళు  కాదు  కదా  ముందు  నెల  వేసిన  రోడ్లు  కూడా  ఉండవ్  :P

వారం  రోజుల్లో  ఒకరోజు  eat  స్ట్రీట్  వెళ్లాను , ఇక్కడ  వచ్చిన  ప్రతి సారీ  నాకు  చిన్నప్పటి  మెమోరీస్  బోల్డు  గుర్తు  కొస్తాయి .. మధ్యాహ్నం   మూడు  వేలు  వదిలించుకుని  చేసిన  లంచ్  కంటే  సాయంత్రం  ఇక్కడ  నలబయ్యి  రూపాయిల స్ప్రింగ్  పొటాటో , ఇరవయ్యి  రూపాయిల  మొక్క  జొన్న  కంకి  తో  నెక్లెస్  రోడ్  మీద  తిరగడం  సూపర్  అనిపించింది  :)  

మేము  ఆ  నెక్స్ట్  రోజు  ఎంత  సేవింగ్  చేసాం అంటే  ఆ  స్ప్రింగ్  పొటాటో  బాంబూ  స్టిక్  ని  పనీర్   కబాబ్స్  కి  use  చేసాం  :D  స్టిక్  ఉంది  కదా  అని  కబాబ్  కి డబ్బులు  తగలేసి  మళ్లీ  సేవింగ్  ఏంటి  అంటారా  :D  ఉష్ ..  !!!

రభస  మూవీ  కూడా  చూసా  అనుకోండి .. ఎన్టీఆర్  బావున్నాడు :D  .. సినిమా / సినిమాలు  watever  పిచ్చ  బోరింగ్ ..పాపమ్  ఆ  డైరెక్టర్ రెండో  సారి  ఆయనతో  ఎన్టీఆర్   ఇంకో సినిమా  చెయ్యడని   భావించి రాసుకున్న  అన్ని  సినిమాలు  కలిపి  పడేసాడు  మన  తల  మీద  :(

ఇంతకీ  ఈ  మధ్యలో   నేను  సాధించిన  అతి   గొప్ప  పని  గురించి  రాయ  దలుచుకున్నా  :D గత  అక్టోబర్  నుండి  ఇలా  తినడం ,తిరగడం  తప్ప  ఏం  పని  లేకపోవడం  వల్ల ,తింటూ  కూర్చుంటే  కొండలు  కరుగుతాయో  లేదో  కానీ  వెయిట్  మాత్రం  బాగా  పెరుగుతుంది ...  :(  మళ్లీ  వెయిట్  లాస్ అంటే అదో  మహా  ప్రస్థానం  నా  ఫిట్నెస్  instructor  బుజ్జీ  ను  ఇలా  ఒక్కసారే  అన్నీ  మానేసి  తిని  కూర్చుంటే  కష్టం  అని  నాలుగు  తిట్టి , workouts  తో  పాటు  లో  కార్బ్  డైట్   ఫాలో  అవ్వు  అని  చెప్పాడు ... అతను  లో  కార్బ్స్  తిను  అంటే  నేను  ఇంకా  extreme  కి  వెళ్లి  " atkins  డైట్ " ప్రిఫర్  చేసాను .. రోజుకి  20gm  కార్బ్స్ ,మిగతాది  అంతా  ప్రోటీన్  ,fat , ... ఇది  మొదటి  రెండు  వారాలు  చెయ్యలిసిన  డైట్ ,తర్వాత  వేరే  వేరే  phases  లో  వేరే  వేరే  ఫుడ్ ..

నేను  ఈ  విధంగా ,గుడ్లు,చికెన్ ,సలాడ్స్  మీద  బతకగలను  అన్న  సంగతి  ఇప్పటి  దాకా  తెలియలేదు  :(  whatever  లాస్ట్  కి  సూపర్  వెయిట్  లాస్  అండ్  మళ్లీ  వర్కౌట్స్  వల్ల maintain  చెయ్యగలుగు  తున్నా ... నన్ను  చూసీ  inspire  అయిన  ఇద్దరు  ట్రై  చేసి  మిగ్రేన్  తెచ్చు  కున్నారు  :( :(

లో  కార్బ్   diets   atkins ,south బీచ్ అందరికీ సరి  పోవు , చాలా  complications  కూడా  ఉంటాయి , బట్  పని  చేస్తే  మాత్రం  చాలా  బాగా  పని  చేస్తాయి, అమ్మాయిల్లో  pear /hour గ్లాస్  కి  బెస్ట్  ... !!!

gym /jog   అలవాటు  చేసుకోవటం  మంచిదే  కానీ  ఇక్కడ  విషయం  ఏంటి  అంటే మీరు  వర్క్  అవుట్  అసలు  చెయ్యకపోయినా పర్వాలేదు  కానీ ,బాడీ  కి కష్ట  పడటం  అలవాటు  చేసి ,ఒకసారే  మానేస్తే ,మీరు  ఇంకా  వర్క్  అవుట్  చేస్తారేమో ,ఇంకా  ఎనర్జీ  కావాలని ఏమో  అని  బాడీ  calories  స్టోర్  చేస్తూ  ఉంటుంది , ఫలితం  జీన్స్  లో  ఐష్  నుండి  జాజ్బా  లో  ఐష్  అవుతారు  అన  మాట  :)

సరే   14 రోజులు "లో  కార్బ్"  ఫాలో  అవ్వాలి  అనుకునే  వాళ్లకి  sample  డైట్

మార్నింగ్  : ఎగ్స్ / ఒక  పెసరట్టు, కాఫీ ,టీ  షుగర్  లేకుండా ఎందుకంటే   1gm  షుగర్  = 5gm  కార్బ్
లంచ్  : చికెన్/ఫిష్ /మటన్  (ఎలాగయినా కానీ  వితౌట్  రైస్ /రోటి  ) , ఆలివ్  ఆయిల్  preferable , veg  అయితే  పనీర్ /tofu , or  ఏదయినా  కూర  (cabbage /బెండి /brinjal /బ్రోకోలి /కాలీఫ్లవర్ /టమాటో  అలాంటివి .. నో  carrot /beetroot )
డిన్నర్  : same  లంచ్  లా .. fruits  లో  షుగర్స్  ఉంటాయి  కాబట్టి  ప్రిఫర్  చెయ్యద్దు

పాలు  వద్దు ,cheese  ,yogurt  తినచ్చు ....

14 రోజుల  తర్వాత  రొజూ  రోటి /చిన్న  బౌల్  రైస్ / లో  షుగర్  fruits  ఆడ్  చెయ్యండి ,  ఫస్ట్  రెండు  రోజులు headache /fatigue  ఉంటాయి  కాబట్టి  వీకెండ్స్  సెలవు  ఉన్నప్పుడు  స్టార్ట్  చెయ్యండి ...  ఎక్కువ  అనిపిస్తే  వెంటనే  ఆపెయ్యండి  .. !!




21, జూన్ 2014, శనివారం

అసలు ఒక డెవలపర్ ఎన్ని లాంగ్వేజ్ లు నేర్చుకోవాలి ???

 అసలు  ఒక  డెవలపర్  ఎన్ని  లాంగ్వేజ్  లు  నేర్చుకోవాలి  ??? 

ఇప్పటికే  వందల్లో  ప్రోగ్రామింగ్  లాంగ్వేజ్  లు  ఉన్నాయి , ఇంకా  ... సంవత్సరానికో  కొత్తది  కనిపెడుతున్నారు 

ఈ  మధ్య  ఒక Developers conference లో  ఆపిల్  ఇంకో   programming  language  ని  పరిచయం  చేసింది . "స్విఫ్ట్ " దాని  పేరు . 
                     
ప్రతీ పెద్ద  కంపెనీ  దాని  కోసం  ఒక  కొత్త  లాంగ్వేజ్  కనిపెట్టేసుకుంటుంది , Face book  ఏమో  hack దాని  back end  development కోసం కల్పించుకుంటే గూగుల్  ఏమో  జావా స్క్రిప్ట్  కి రీప్లేస్మెంట్ గా  "డార్ట్"  అలానే  ఇంకో  ప్రోగ్రామింగ్  లాంగ్వేజ్  "గో" వాడుకుంటుంది 

అసలు  ఉన్నవి   వాడుకోకుండా  ఇవి  ఎందుకు  కొత్తవి  కనిపెడుతున్నారు ??

ఎందుకూ అంటే  వాటికి  ఆ  capability  ఉంది  కాబట్టి ,  ఉందని  కొత్తవి  కనిపెడుతున్నాయి  సరే  ఎందుకంటే designing  complex   కాకపోవచ్చు  ఎందుకంటే  మంచి  resources  ఉన్నారు  కాబట్టి   కానీ  దాని  కన్నా  పెద్ద  తల  నొప్పి  ఏంటి  అంటే  వాటికి  సపోర్ట్  ఇవ్వగలగడం , అసలు  కనిపెట్టిన  కొత్త  దానిని  developers  ఇష్ట  పడేలా  చెయ్యగలగడం , అసలు  ఎందుకు  వాడలో  convince  చెయ్యగలిగితే  సగం  సక్సెస్  అయినట్టే 

ఒకటి  మాత్రం  నిజం  పాత  లాంగ్వేజ్  లు  ఇప్పటి  కాంప్లెక్స్  ఫ్రేమ్  వర్క్  ని  సపోర్ట్  చెయ్య  లేకపోవచ్చు , ఇప్పుడు  ఫేస్బుక్  నే  తీసుకుంటే   

Face book's main goal with Hack —was to improve code reliability, in this case by enforcing data-type checking before a program is executed. Such checks ensure that a program won't, say, try to interpret an integer as a string of characters, an error that could yield unpredictable results if not caught. In Hack, those checks take place in advance so that programmers can identify such errors long before their code goes live. -  ఇది  ఒక  ఫేస్బుక్  డెవలపర్  చెప్పిన  మాట 

 అసలు  పేస్  బుక్  php  కి  రీప్లేస్మెంట్ గా  ఇప్పుడు  ఉన్న  వేరే  కొన్ని  లాంగ్వేజ్  లు  చూసింది  , మీరు  అందరూ  ఈ  మధ్య  బాగా  విన్న   అలాంటి ఒక  లాంగ్వేజ్  స్కాలా  (జావా  మీద  స్కాలా  నాకు  నచ్చుతది , తక్కువ  లైన్  కోడ్  రాసేయచ్చు  :P  ), కానీ కోడ్  మొత్తం  php  నుండి  స్కాలా   కు  మార్చడం  కష్టం  ఎందుకంటే  ఇవి  రెండు  టామ్  & జెర్రీ  లాంటివి   compatible  కావు  :) సో  php  కి  దగ్గర  గా  ఉండే  ఇంకో  సూపర్  సెట్  లాంగ్వేజ్  ని  అది  తయ్యారు  చేసుకుంది  అదే  HAck .  చాలా  మటుకు  సైట్  php  నుండి  hack  కు   మైగ్రేట్  అయ్యిపోయింది .  fb  చేసిన  ఇంకో  పని  ఏంటంటే  hack  ని  ఓపెన్  సోర్స్  చేసింది సో  మీకు  పనికి  వస్తుంది  అనుకుంటే  మీరు  కూడా  నేర్చుకుని  వాడుకోవచ్చు  ... !!!

ఇప్పుడు  ఆపిల్  ఏం  చేస్తదో తెలీదు  కానీ  iphone  4 కి  మాత్రం  సపోర్ట్ ఇంక  మీద   చెయ్యదు ... ప్రపంచం  లో  రుబిక్  క్యూబ్  తర్వాత  ఎక్కువ  అమ్ముడు  బోయింది  ఐ ఫోన్ -4 నే అంట, నిజానికి  iphone  నిజమైన  innovation నాకు  అదొక్కటే  అనిపిస్తుంది  (దాని  ఫోన్స్  లో )


Amazon కూడా  కొత్త  ఫోన్  రిలీజ్  అయ్యింది  

రివ్యూ  ఇక్కడ చదువు  కోండి 

http://tech.firstpost.com/news-analysis/specs-review-is-amazons-new-fire-phone-worth-the-price-tag-226081.html

అంతా  బానే ఉంది  కానీ  kindle  లా  cheap  గా  మీకు  దొరకదు  ఎందుకంటే  అది  AT&T  తో  టై  అయ్యి  ఫోన్  ని  రిలీజ్  చేస్తుంది  కాబట్టి   jeff  చేసిన biggest  mistake  ... !!

సో ... రెండేళ్ళు  కాంట్రాక్టు  బాధ  తప్పదు , అది  తప్పించుకోవాలి  అంటే  ఇంచు  మించు  699 $  తో విడిగా కొనుక్కోవాలి    :O 

మరి గూగుల్  చెయ్యాలి  అనుకుంటున్న  innovation  humanoids  (human service  robots ) , ఆండ్రాయిడ్  ఫౌండర్  ఆండీ రూబిన్  ప్రాజెక్ట్  ని  లీడ్  చేస్తున్నారు  అంట . గూగుల్  కి ఈ ప్రాజెక్ట్ moonshot  లాంటిది      .. !!

ఆండ్రాయిడ్   versions పేర్లు   ice -cream , eclairs , kit-kat   లాంటివి పెట్టారు , humanoid  version పేర్లు జేన్నిఫెర్ లారెన్స్ , ర్యాన్  గోస్లింగ్  పెడతారేమో  :D  

 Saturday  Sunday   అన్న  జాలి కూడా   లేకుండా ఈ  పిల్ల ప్రాజెక్ట్ ,టెక్నాలజీ  అని  తినేస్తుంది  అని  అనుకుంటున్నారు  కదా .. :)  సరే  ఇంక  ఆపేస్తున్నా  ...  ;D 


హ్యాపీ  వీకెండ్  .. !!!










13, జూన్ 2014, శుక్రవారం

చూసారా .... డబ్బు పెంచుకోవటం ఎంత ఈజీ నో :)

ఏంటో  పని చేసినా..   చెయ్యకపోయినా  , ఫ్రైడే వచ్చిందంటే  ఇంక వచ్చే  రెండు  రోజులు  బిందాస్  గా  ఉండచ్చు  అనిపిస్తుంది  :D  కొంచెం  ఆలోచిస్తే ఆ  అయిదు  రోజులు  సంపాదించిన   డబ్బులు  తగలేయ్యటానికే  దేవుడు కాదు..  కాదు  కార్పొరేట్  కంపెనీ లు  సెలవు  ఇచ్చి  ఉంటాయేమో  అనిపిస్తుంది :D లేకపోతే  ఎక్కడ ఎంప్లాయిస్ జీతం అంతా దాచేసుకుని కొత్త  కంపెనీ  స్టార్ట్  చేసేస్తారు  అన్న  భయం  ఏమో  :P

మా  అమ్మ   ఎప్పుడూ  డబ్బులు  భలే  మేనేజ్  చేసేది , ఏమి  చెయ్యకుండానే  బోల్డు  సేవింగ్  చేసేది :) చివరికి  నాకు  మా నాన్నకే  ఇచ్చేది అది వేరే సంగతి అనుకోండి  :D నేను  కూడా  బానే  సేవ్  చేస్తాను ,  డబ్బులు  దాచీ ...   దాచి...   ఒకానొక మంచి రోజున  ఏ  బట్టలు షాప్  వాడి కో చెప్పులు  షాప్  వాడికో  సమర్పించుకునే దానిని ... !!!

  నాకు బాగా   అర్ధం అయిన  సంగతి ఏంటంటే   మనిషికి  financial  literacy  తిండి  ఎంత  అవసరమో  దానికి మించి  అవసరం అని  (డబ్బులు లేకపోతే  తిండి  మాత్రం ఏం దొరుకుతుంది ) ...  50 రూపాయిలు సంపాదించి  5000 చెయ్యగలిగిన  చదువు లేని  వ్యక్తి  , 5000 సంపాదించి  ప్రతీ రూపాయి  బట్టలు  మీద , పిజ్జా chocolates  మీద  తగలేసే ph. d  స్టూడెంట్  మీద  చాలా  బెటర్  కాదంటారా ?



నేను  ఒక  5 ఏళ్ళ  కిందట  మా  బావ  ఇంట్లో  ఒక బుక్ 20 పేజీ లు  చదివి  ఆపేసాను  , బుక్  పేరు  "రిచ్ డాడ్ పూర్ డాడ్ " , మళ్లీ  అదే  పుస్తకం  వారం  కిందట  చదివాను , మొదటి  సారి  చదివినప్పుడు  ఏది  అర్ధం  కాలేదు  ఎందుకంటే  అప్పటికి నాకు  టాక్స్  అంటే  ఏంటో  తెలీదు ,మామూలు చదువు  ఏ  ఎక్కువ  అనుకునే  టైం  కాబట్టి  పెద్దగా  ఏమి  ఎక్కలేదు  ,కానీ మొన్న  చదివి  నప్పుడు  అనిపించింది  ప్రతీ  ఒక్కరూ  ఒకసారి  అయినా  చదవాల్సిన  బుక్ అని, atleast  డబ్బు  సంపాదించే  వాళ్ళు  ఇంకా  ఎక్కువ  సంపాదించాలి  అనుకునే  వాళ్ళు , బాగా  ఖర్చు  చేసే  వాళ్ళు  కూడా  :D  ఎందుకంటే చదివాకా..   ఒక  రెండు  మూడు  రోజులయినా  మీ  ఖర్చులు కంట్రోల్  చెయ్యాలి  , మీకంటూ  ఏదయినా  చేసుకోవాలి  అన్న  ఆలోచన  తప్ప కుండా  వస్తుంది కాబట్టి ... !!

నెలకు  లక్ష  సంపాదిస్తే  30% టాక్స్  కింద  గవర్నమెంట్  కి  pay  చేస్తున్నాం , పోనీ  ఇంకా  మంచి  జాబు తెచ్చుకుని  ఎక్కువ  డబ్బులు  వెనకేసుకుందాం  అన్న  ఆలోచన వినటానికే   చాలా  బాగా అనిపిస్తుంది  గానీ , జీతం  పెరిగే  కొద్దీ  మనం  కట్టే  టాక్స్  కూడా పెరుగుతుంది  ..  !!!  సంపాదిస్తే  income  టాక్స్ , ఖర్చు పెడితే  సర్వీస్ టాక్స్ ,మంచి hotel లో  రెండు  రోజులు ఉంటే luxury   టాక్స్ ,ప్రతీ  దానికీ  వేల్యూ  అడేడ్  టాక్స్ ...  దేవు ... డా  అసలు  డబ్బు  వచ్చే  మార్గం  ఒకటయితే  పోయే  వేంటి  వంద  కనిపిస్తున్నాయి, ఇవి  మనకు ఖర్చులు కానీ  వేరే  వాళ్లకి  income  ఏ  కదా , సో  మనకు  కూడా  సంపాదించటానికి  ఇంకో   99 మార్గాలు ఉన్నాయి కానీ  మనం గుర్తించం ,రిస్క్  తీసుకోము !!!

ఇంతకీ   ఆ  పుస్తకం   లో  మెయిన్  పాయింట్  ఏంటంటే  , మీ  బాలన్స్  .. అదే  బ్యాంకు  బాలన్స్  అప్పు  బాలన్స్  కాదు  :D  పెరగాలంటే  asserts  మీద  మీ  డబ్బులు  పెట్టండి , liabilities  మీద  కాదు

1.Asset  - వీటి  వల్ల  మీరు  డబ్బులు  మీ  జేబు లోకి  వస్తాయి  eg : రియల్  ఎస్టేట్ , investments , మీరు  ఇంట్రెస్ట్  కి  ఎవరికయినా  మీ  డబ్బు  ఇచ్చి  ఉంటే  అవి, ఏదయినా  సరే మీరు  ఒకసారి  పెట్టుబడి  పెడితే  తర్వాత  తర్వాత  వాటి  నుండి  మీరు  ఏమి  చెయ్యకుండా  డబ్బులు  రావాలి, దీనినే  డబ్బు  మీకోసం  పని  చెయ్యటం అంటారు  !!

2. Liability  : మీరు  ఎవరికయినా  ఇవ్వాలిసిన  డబ్బు  లేకపోతే  ఏదయినా  కొన్న  తర్వాత  దానికి  మీరు  ఇంకా ఇంకా  ఇన్వెస్ట్  చేస్తున్నా  అది  liability  .. సో  అలాంటి  వాటి  మీద  మీ  డబ్బు  ఎంత  తక్కువ  పెడితే  అంత  మంచిది.

చూసారా  .... డబ్బు  పెంచుకోవటం  theory ప్రకారం  ఎంత  ఈజీ  నో :) ఇంక    ప్రాక్టికల్ గా  మీ   తిప్పలు మీరు  పడండి , వర్కౌట్  అయితే  నాకు  కొంచెం  చెప్పండి  :P అన్నిటికీ  మించి  పైన  చెప్పిన  పుస్తకం  చదవండి  :D


















11, మే 2014, ఆదివారం

పేరు గొప్ప ఊరు దిబ్బ అనేది మా అమ్మమ్మ

ఈ హైదరాబాద్ లో ఎన్ని రెస్టారెంటులు ఉన్నా ఎక్కడ  చూసినా  వందల  కొద్దీ జనాలు ,గంటలు  కొద్దీ  వెయిటింగ్  లు .

ఒక్కోసారి  (అంటే  చాలా  సార్లు  అనుకోండి  ఈ  జాబు  చేసుకోవటం కన్నా  ఒక డబ్బా వాలా  పెడితే కొద్ది రోజుల్లో డబ్బున్న వాలా  అయిపోవచ్చని )

మొన్న  ఎవరో  లక్షలు పెట్టి ఇంజనీరింగ్ లు చదివి  సాఫ్ట్వేర్ జాబు  చేస్తున్న వాళ్ళ కన్నా, రెండో క్లాసు  పాస్  అయ్యి రెండు ఆవులు ,రెండు గేదెలు కొనుకున్న  వాళ్ళు   నెలకు  లక్ష  పైగా  సంపాదిస్తున్నారు అని  బావురు  మంటే  ఏంటో  అనుకున్నా  కానీ , సంపాదించినదంతా పాలోడు ,నీళ్లోడు  ,ఇంటోడు , ఇలా  restaurant వాడు (మర్చిపోయా  ఇక్కడ hitech సిటీ లో ఆటో వాడు  నెలకు  40k  వస్తుంది  అన్నాడు  ) ,   ఇలా  సర్వీస్  టాక్స్, income టాక్స్ , vat అని  దోచేస్తుంటే ఎలా  పాపం  సో కాల్డ్ రెండు పదుల వయుసులో అయిందంకల జీత గాళ్ళు  మూడంకెల మించి  సేవ్ చెయ్యగలరు , పేరు  గొప్ప ఊరు  దిబ్బ  అనేది  మా అమ్మమ్మ  , సరిగ్గా సరిపోతది   :)



ఏదో  రాస్దాము  అని  మొదలు  పెట్టి  ఎటో  వెళ్లాను , ఇంతకి  ఏంటంటే  నిన్న  సాయంత్రం  ఎక్కడికయినా  వెళ్దాము  అనుకుని  డిన్నర్  కి , AB  (absolute barbeque ) అని  మాదాపూర్  లో  ఒక  ప్లేస్  కి  వెళ్ళాము , ఈ మధ్య  హైదరాబాద్  లో ఇదే  బఫెట్  కి టాప్ .. 7. 20 కి వెళ్తే  గంట  waiting  అన్నాడు , అన్నిటి  కన్నా  ఇక్కడ  hightlight ఏంటి  అంటే  table  కావాలంటే  రెండు  రోజులు  ముందు  కాల్  చేసి  చెప్తే  ప్రాబ్లం  ఉండదు  అన్నాడు .... !!!


మేము  బయట  ఉంటే , మీరు  బార్  లౌంజ్  లో  ఉండండి   ఇంకా  గంట ఉంది   కదా బయట  వేడిగా ఉంది  అని లోపలకి పంపాడు ,  గంటకి  ఖాళి  అయ్యి వాడు  రమ్మని  పిలిస్తే , గూగుల్  కి  మొదటి  ఇండియన్  CEO గా  నన్ను ప్రకటించి  నంత  ఆనందం  కలిగింది  :)

  మేడలో  ఒక  బాక్స్  తగిలించుకుని  tequila  270 rs  ఆర్డర్  చేస్తారా  అని  వాడు  అందర్నీ  అడుగుతుంటే  నాకైతే రైల్వే స్టేషన్  లో  టీ -కాఫీ  అమ్మే  వాడు  గుర్తొచ్చాడు  ...  ఇంచు మించు  వెయ్యికి  దగ్గరలో  ఉన్న  బఫెట్  ఒక్క  tequila  షాట్  తో వెయ్యి  చెయ్యాలన్న  తాపత్రయం నచ్చినా ,  తాగి  తిన్నది  బయటికి  తెచ్చుకుని  మూడు  నాలుగు  వేల  బట్టలు  నాశనం చేసుకోవటం  అనవసరం అనిపించింది  :P

అక్కడ  ఒక  family  వస్తే  డిన్నర్  కి  ఈజీ గా  విత్ టాక్స్  5గురు కి  5k ,  పాలోడు ఇలాంటి  చోట పాలు అమ్మి    లక్ష  వెనక  వేసు కుంటున్నాడు , పాపం  సాఫ్ట్వేర్  వాడు కార్పొరేట్  కల్చర్ అనుకుని  కప్పు  కాఫీ  కి  150 తగలేస్తున్నాడు  :(

కానీ ఏ  మాటకు  ఆ  మాట   ఇక్కడ  బఫెట్  మాత్రం  చాలా  tasty  గా  చేస్తాడు, హైదరాబాద్  సి  ఫుడ్  లవర్స్  సూపర్  గా ఎంజాయ్  చెయ్యచ్చు   , కోడి ,మేక , పీత  మాత్రమే  కాదు  పాపం  ఆక్టోపస్ ,స్క్విడ్ ,కుందేలు  దేనినీ  వదల లేదు  వాడు

చూసారా....   కోడి  అంటే  మనం  తినడానికే  అన్నట్టు  బాధ  అనిపించట్లేదు  కాని , కుందేలు  ఇవీ  అవీ  చూస్తే  పాపం  అనిపిస్తుంది , మనం  మనుషులం  అన్నిటినీ  సమానంగా   చూడలేము , లక్ష  సంపాదించినా  పాలోడు  పాలోడే , ఏమి  చెయ్యకుండా బెంచ్  మీద  project లేకుండా  20k  వచ్చినా  ఇంజనీర్  ఇంజనీర్  యే   :)






9, ఏప్రిల్ 2014, బుధవారం

దేవుడికి పేరు గుర్తు తెచ్చుకునే పని తగ్గించటానికి ఏమో :D

శ్రీ రామ నవమి  రోజు ఎలాగైన  వర్షం పడుతుంది  అని  మా అమ్మమ్మ  అనేది , పొద్దున్న  11 గంటలకి  (అంటే మరీ పొద్దున్న కాదు లే   :D ) హైదరాబాద్  గూగుల్  ఆఫీసు  opposite లో  ఒక సీత రామ  ఆంజనేయ స్వామి  గుడి ఉంటుంది , నేను పొద్దున్న  వెళ్తే జనాలు ఉంటారని 11 గంటలకి వెళ్లాను, కానీ అక్కడ కళ్యాణం  12 ఇంటికి మొదలవుతుంది  అంట .. నేను  వెళ్ళే టైం  కి  కొత్తగూడ  నుండి  hitech city  దాకా  ఉంది లైన్ ... మొత్తం హైదరాబాద్ లో ఉన్న  సాఫ్ట్వేర్ వాళ్ళందరూ తమ  తామ id  కార్డ్స్  వేసుకుని  (దేవుడికి పేరు గుర్తు తెచ్చుకునే  పని తగ్గించటానికి ఏమో  :D )   దర్శనం కోసం  ఉన్నారు

ఇలా  ఇంక  దర్శనం కోసమే ఉంటే నా  పనులు అవ్వవని దూరం నుండి దణ్ణం పెట్టుకుని వచ్చేసాను ... కానీ దేవుడికి నేను  అంత  దూరం  నుండి  వెళ్ళిపోవడం  నచ్చలేదనుకుంటా :D  సరిగ్గా  ఒంటి  గంటకు లంచ్ చేస్దామని అని కిందకు  రాగానే ,నా  ఫ్రెండ్ వచ్చి  రా  ఎదురుగానే  గుడి ఉంది  కదా ,ఒకసారి  వెళ్దాం  అని , నేను  ఏమి చెప్పకు పోయినా  తీసుకుని పోయారు



ఈసారి కొంచెం రష్ తగ్గింది ... బయటకు రాగానే మా అమ్మమ్మ  మాటలు  గుర్తొచ్చాయి "శ్రీ రామ నవమి  రోజు ఎలాగయినా   వర్షం పడుతుంది  "  ఇంచు మించు  40 డిగ్రీ  ఉంది  బయట  నాకైతే  ఆ  ఎండ  తగల గానే  అప్పుడే  తల నొప్పి వచ్చినట్టు  అనిపించింది , మొత్తానికి దర్శనం  అయ్యింది , చాలా మంది కేవలం  అక్కడ ఈ రోజున  పానకం ,వడ పప్పు  తిందాం అని  గుడి కి  వచ్చిన  వాళ్ళే , నా నార్త్ ఇండియన్ ఫ్రెండ్ కి  పానకం అంటే ఏంటో అర్ధం అయ్యేలా చెప్పే సరికి నా గొంతు  ఆరిపోయి నాకు కూడా పానకం తాగాలనిపించింది  :) (నేను బెల్లం తినను ,మిరియాలు అస్సలు పడవు  అందుకనే  టేస్ట్ కి తప్ప  పానకం  అంటే అంత ఇష్టం  ఏమి లేదు )

ఆ  పానకం గుడికి  కిలో మీటర్ దూరం  లో పెట్టాడు , అది  తప్ప దొరికిందే ఛాన్స్ మళ్లీ వీళ్లెప్పుడు గుడికి వచ్చి ప్రసాదం  కొనుకుంటారు  అనుకున్నారేమో ,అన్నిటికీ ఒక  price పెట్టి అమ్మేస్తున్నారు  :)

ఆ  హడావిడి నుండి  బయటికి వచ్చి ,పని  చేసుకుని సాయంత్రం 5 కి  కింద ఉన్న  బరిస్టా  కి  వెళ్దాం అని  దిగగానే , ఒక్కసారిగా  ఆకాశమంతా  మబ్బుగా  అనిపించింది ,చల్లగా  గాలి  తగులుతుంటే  మధ్యాహ్నం అంత  ఎండ  తర్వాత భలే  అనిపించింది ... రాత్రి చినుకులు కూడా  పడినట్టున్నాయి  :) ఇప్పటికే  climate  అలానే ఉంది .. !!!

చాలా  రోజుల  కిందటి వరకు  రాముడు సీతను  అంత కష్ట పెట్టాడు  ,అడవులలో  వదిలేసాడు  ,మరి  అలాంటిది రాముడు లాంటి భర్త ఎందుకు రావాలి అంటారు  అనుకునే  దానిని , కానీ  ఆలోచిస్తే  రాముడు  సీత  దగ్గర  లేకపోయినా  అన్ని  సంవత్సరాలు సీత  ను  తప్ప ఇంకో అమ్మాయి గురించి ఆలోచించలేదు , అలా ఎంత మంది అబ్బాయిలు  ఉంటారు , ఉన్నన్ని రోజులు చాలా  ఇష్టం అని చెప్పి , తర్వాత గొడవలు వస్తే  వేరే పెళ్ళిళ్ళు చేసుకుని జరిగింది మర్చిపోయి ,అసలు అలాంటి వాళ్ళే  తెలియనట్టు ఉంటున్నారు , మనకే పెళ్ళిళ్ళు  చేసుకోమని మన  అమ్మ  నాన్నలు ఇంత  pressure  పెడితే ,రాజు  అయిన రాముడికి  ఎంత  ఉండేదంటారు , అయినా కూడా  బంగారు సీత పెట్టుకున్నదే కానీ.. ఇంకో  పెళ్లి  చేసుకోలేదు  :)  ఏ  అమ్మయికయినా ఇంత  ఇష్ట  పడే  అబ్బాయి  కన్నా ఏం  కావాలి  :)

అదీ  సంగతి సమాచారం  :) 

17, ఫిబ్రవరి 2014, సోమవారం

డబ్బుకి real & symbolic meaning రెండూ ఉన్నాయి కాబట్టి ...

నాకు తెలిసిన  వాళ్ళలో ఒక అమ్మాయికి ఒక  అలవాటు  ఉంది , అదేమిటంటే  తనకు  ఒక వేళ  పక్క  వాళ్ళ  దగ్గరున్న వస్తువు  కానీ , వేసుకున్న   బట్టలు  కానీ  నచ్చితే , తను  అడిగే  మొదటి ప్రశ్న   "ఇది ఎంతకు  కొన్నావు  ? ", అది ఇప్పుడే  కొత్తగా పరిచయం అయిన  వాళ్ళు అయినా , ఎన్నో  ఏళ్ళ నుండి తెలిసిన  వాళ్ళు  అయినా , తనకు ఏదైనా  నచ్చిందంటే  " చాలా  బావుంది , ఎంత కు  కొన్నావు  ? " ,  అది .. తన  నోటి నుండి మొదట  వచ్చే question ...

పక్క  వాళ్ళు  ఒకోసారి ఇబ్బంది  పడతారు అలా అడిగితే  అని ఎవరయినా  అన్నారనుకోండి , "దీనిలో అంత ఇబ్బంది పడేదేముంది , అంత impolite  question ఏమి కాదు కదా , ఎక్కడ  కొన్నారో  చెప్పటానికి ఇబ్బంది  లేనప్పుడు ,ఎంతకు కొన్నారో  చెప్పటానికి  ఏంటి ??  రెండు  ఒకలాంటివే  కదా  అని  దీని  అభిప్రాయం  :)

David  Kruger  అన్న  ఒకాయన  ఈ  విషయం  గురించి  ఇలా  రాసాడు

"Most of us have learned to talk more easily about sex, yet remain seclusive, embarrassed, or conflicted about discussing money. Money may be the last emotional taboo in our society”


నిజమే  కదా  .. !!

సరే మరి మనం ఎందుకు పక్క  వాళ్ళ  దగ్గర ఉన్న  వస్తువుల ఎంతకు కొన్నారో అని  అడగటం  తప్పని  అనుకుంటాము  ??

ఎందుకంటే  డబ్బుకి real  & symbolic  meaning  రెండూ  ఉన్నాయి  కాబట్టి  ... 

In  Reality , డబ్బు  కేవలం  మనకు  కావలిసిన , లేకపోతే  బతకలేని minimum  needs  అయిన  తిండి , బట్ట , ఇల్లు  లాంటివి అందించే ఒక  tool  లాంటిది ..

 Symbolically money represents more than self-care

Freud అనే వేరొక రచయిత 

Freud linked money to self-control and independence.  More recently, psychoanalysts recognize cultural, social, class, and gender meanings, as well as the practicalities of down to earth, concrete financial issues.  Money has come to represent things like comfort, safety, respect, worthiness, value, power, and even sexiness, love and happiness. 

నిజానికి  మనలో  ఒక్కొకరికి  డబ్బు  అంటే  ఒకో  అభిప్రాయం  ఉంటుంది , మన  దగ్గరున్న  లక్ష  రూపాయలు  మనకు  సేవింగ్స్ / ఒక  నెల  జీతం  మాత్రమే  అవచ్చు  , కానీ  ప్రపంచం లో  ఏదో  మూల  ఇంకొకరికి  అదే లక్ష  లైఫ్  అండ్  డెత్  క్వశ్చన్ అవచ్చు 

సరే  ... మరి  మీ  దగ్గరున్న  డబ్బు  మీ  గురించి  ఏమి  చెప్తుంది  ????

దీనికి  సమాధానం అంకెల ద్వారా  మనం  తెలుసుకోలేము , కానీ  మీ  దగ్గర  ఉన్న  డబ్బుతో  మీరు ఏమి  చేస్తారు , మీ  డబ్బుతో  మీ  relationship  ఎలాంటిదో  దాని  బట్టి  తెలుస్తుంది

కొంత  మంది  వాళ్ళ  దగ్గరున్న డబ్బు  బ్రాండెడ్  items  మీద  ఇన్వెస్ట్  చేస్తారు , అలాంటివి  ఎంపిక చేసుకోవటం  మనం స్మార్ట్  అని  prove  చేస్తుంది  అనుకుంటారు .

ఒక రెండు  ఏళ్ళ  క్రితం  నా ఫ్లాట్  కి  LED  TV  కొన్నాను , అది  LG  ది , చాలా  మంది  LG  ఎందుకు  Samsung  కానీ  SONY  కానీ  తీసుకుని  ఉండచ్చు  కదా  అని  చాలా  మంది  నేను  తప్పు  బ్రాండ్  కొని  డబ్బులు వేస్ట్ చేసేసాను అన్న  ఫీలింగ్  కలిపించారు , నిజానికి  అక్కడ  samsung  కన్నా  LG  specifications  ఏ  నాకు  నచ్చాయి , బెటర్ గా  అనిపించాయి , రెండిటికీ   కాస్ట్  మధ్య   కూడా  పెద్ద  తేడా  లేదు , కానీ  మిగతా  రెండిటికి  ఉన్న   బ్రాండ్  craze  వాళ్ళ , మనం  వేరేవి  ఏమి  కొన్నా   జనాలు  మనకు స్మార్ట్ సెలక్షన్  లేదనుకుంటారు  :)

అంతెందుకు  Apple  ఫోన్స్  లో  ఉన్న గొప్పదనం  ఏంటి అన్నాం   అనుకోండి , మన  taste  లో  క్లాస్   లేదు  అనుకునే  వాళ్ళు  కూడా  ఉన్నారు  :)

మనకు ఇలాంటి  వాళ్ళు  కూడా కనిపిస్తారు ...

 ఒక  ఆరు  వేలు  షర్టు  వేసుకుని , స్లీవ్  కింద  లక్ష  పెట్టి  కొన్న  వాచ్  బ్రాండ్  కనిపించే  లాగా  వేసుకునే  వాళ్ళు , పాపం  వాళ్ళ  ఎదురుగా  ఉన్న  వాళ్లకి , ఆ  రెండు  బ్రాండ్స్  తెలియక  recognize  చెయ్యలేదు  అనుకోండి , ఈ లక్ష  వాచ్  పెట్టుకున్న  వాడు , అసలు  ఎదురుగా  ఉన్నవాడు  కి తనంత  knowledge  లేదు  , తనలా  అన్ని  రీసెర్చ్ చేసి కొనే  critical  consumer  కాదు  అన్న  conclusion  కి  వచ్చేసి , వీడే  Intelligent ,smart  అనుకుంటాడు  అనమాట

ఈ విధంగా  డబ్బు  వాడికి ఒక  రకమయినా సెక్యూరిటీ , తెలివయిన  వాడిని  అన్న  భావన  ఇవ్వటానికి  సహాయ  పడింది

ఇంక  మనలో  చాలా  మంది  చెప్పే  లైన్

" నేను  డబ్బుకు  అంత  importance  ఇవ్వను , కానీ  నాకు  కావలిసిన  వాటిని  నేను  కొనుకున్నేంత  ఉంటే  చాలు " అనుకుంటాము  ( నేను  అలాంటి  దాన్నే అనుకోండి  )

ఇది వినటానికి  చాలా  rational  గా  అనిపిస్తుంది  ;) కానీ  అసలు  కథ  అక్కడితో  ఎండ్  అవ్వదు

ఒక అమ్మాయికి  travelling  అంటే  చాలా  ఇష్టం , తను  సంపాదించే  డబ్బు  దాని  కోసం  మాత్రమే  సేవ్ చేసి , కావలిసిన  డబ్బు  వచ్చాకా  , వేరే  చోటికి  vacation  వెళ్ళేది , డబ్బు  అంతా  అయిపోయాక , మళ్లీ  job  చెయ్యటం  స్టార్ట్ చేసేది , తన  వరకు  డబ్బు  అంటే  "vacation " కి  మాత్రమే

కానీ  తర్వాత  పెళ్లి  అయితే  ??? తన  హస్బెండ్  కోసం  స్పెండ్  చెయ్యటానికి  కావాలి , తర్వాత  తన  పిల్లల  కోసం  కావాలి ...  ఇవన్నీ  అసలు  ఎందుకు  చెయ్యాలి  ?? ఎందుకు అంటే .. తను లైఫ్  లో  రైట్  decisions  తీసుకున్నాను  అని  prove  చెయ్యటానికి  :)


నా  ఫ్రెండ్  కి  పక్క  వాళ్ళు  చెప్పే వస్తువు  ధర  కేవలం  piece  of  information  మాత్రమే , దానితో  అది  వాళ్ళ  status  ని  అంచనా  వెయ్యదు ( ఉంటారు అనుకోండి  కొంత  మంది అలా  ),  probably , పక్క  వాళ్ళు  చెప్పే  దానితో  అది  ఆ  వస్తువు  కొనుక్కొగలదా లేదా  అని  ఆలోచించవచ్చు

మరి  దాని  question  ని  ఎందుకు  మనలో  చాలా  మంది  misunderstand చేసుకుంటాము  ??

Money is a real and concrete concern, but it is often the symbolic, relational and self-esteem related meanings that get us into trouble. Figure those out, take them away from the money connection, and work on them. And then you can deal with money issues concretely and practically – and in a way that works for you and your loved ones.