14, మార్చి 2015, శనివారం

ఇంకా బోర్ కొడితే ఇంట్లో వంట చెయ్యి :P

 గత  నెల  రోజులుగా  పగలు  రాత్రి  ఆఫీసు  లోనే  కనిపిస్తున్నాను ఏమో   నా  మేనేజర్  పాపం   నాకు  ఒక  వీక్  vacation  ఇచ్చారు  , వీకెండ్స్  అన్నీ  కలిపితే  9 days  :) :)


పైన ఫోటో  చూసి  నా  బాయ్  ఫ్రెండ్  తో  ఏమైనా  అడ్వెంచర్  ప్లాన్  చేస్తున్నానేమో  అనుకోకండి  ,నాకంత  అదృష్టం  లేదు  :P

ఒక  రెండు  రోజులు  సెలవ  దొరుకితేనే .. నా  మైండ్  మంకీ  డాన్స్  చెస్తుంది  :) ఇంక  9 రోజులు  అంటే  మీరు  ఊహించుకోవచ్చు .. !!!

నా  ప్లానింగ్  మధ్యాహ్నం  1 నుండి  స్టార్ట్  అయితే  7.  30 దాకా  ఎక్కడ  వెళ్ళాలి  అని  ఎండ్  లేని  తెలుగు  సీరియల్  లా  సాగుతూనే  ఉంది ,చూపించిన  షాట్  పది  సార్లు  చూపించినట్టు ,చూసిన  ప్లేస్  నే  పది  సార్లు  చూస్తూ  ఉన్నా  .. :D  కళ్ళ  ముందు  స్టీవ్  వోజ్నిక్ , వెర్నెర్  heisenberg , స్టీఫెన్  హాకింగ్ ,  కనిపించి  డేట్  కి  పిలిస్తే ఎవరిని  choose  చేసుకోవాలో తెలియక  confusion  లో  పడినట్టు  అనిపించింది  :P

మున్నార్  తో  మొదలుపెట్టా ..  అన్నపూర్ణ  సర్క్యూట్  కూడా  వెళ్ళాలని  పించింది  ,కానీ  కంపెనీ  లేరు  ;( ;(

నేను  లిస్టు  చేసిన  కొన్ని  ప్లేస్  లు  ఏంటంటే
1. మున్నార్ ,అల్లెప్పి
2. శ్రావణ  బెలగోల ,హంపి
3. ఊటీ
4. కులు
5 లడఖ్

ఇంక  సాయంత్రానికి  మా  ఫ్రెండ్స్  గోవా  అంటే  అక్కడికి  వెళ్దాం  అని  డిసైడ్  అయ్యా  , ఇంట్లో  ఏమో " 3 డేస్  అమ్మాయిలు ,అబ్బాయిలు  కలిసి  వెళ్ళాల్సిన  అవసరం  లేదు,అక్కడ  తాగి  పడితే   ఇంటికి  తీసుకొచ్చే  వాళ్ళు  కూడా  ఉండరు , :P  .. ఇంట్లో   బుద్ధిగా కూర్చో ,కావాలంటే  ఇక్కడ  ఫీనిక్స్  మాల్  లో  ఏ  రంగు  వెలిసిన  డ్రెస్  లు  sale  పెడితే ,ఒక  రెండు  మూడు  కొనుక్కో ,ఇంకా  బోర్  కొడితే  ఇంట్లో  వంట  చెయ్యి :P  అని  చెప్పారు  :D  :D  Actual  గా  ఇలా  చెప్పలేదు , గోవా cousins  తో  వెళ్ళు  , ఇప్పుడు  ఎందుకు ,మనం  family  ట్రిప్  ప్లాన్  చేస్దాం అని  అన్నారు  ..( దాని  వెనక  అర్ధం  నేను  అర్ధం  చేసుకుని  మీకు  చెప్పాను   :P )

సరే  ఏ  రాయి  అయితేనేమి  పళ్ళు  ఉడ  కొట్టుకోవటానికి  అని ,  ఇంట్లో  వాళ్ళతో  వెళ్తే  వాలెట్   రూపాయి  తియ్యకుండా  ఫైవ్  స్టార్  ట్రీట్మెంట్  అనుకుని , వెళ్ళటానికి  ప్లేస్  లు  చూసీ  చూసీ ,నీరసం  వచ్చి  రెండు  గ్లాసులు  బూస్ట్  తాగి ,laptop  చూస్తుంటే ,మా  అక్క  కాల్  చేసింది , మీ  పిన్ని  ఈ  వీకెండ్  బెంగుళూరు  అనుకుంటుంది నువ్వు  మున్నార్  అంటున్నావు  ఏంటి  అని ....!!

మా  పిన్ని  నాకన్నా  బిందాస్  :) తనను  కూడా  తీసుకుని  వెళ్ళిపోదాం  అని  కాల్ చేస్తే , నేను ఈసారి  ఇండియా  ట్రిప్  లో   ఉడిపి ,sringeri  చూడాలి  అనుకున్నా  నిక్కీ,బెంగళూర్  నుండి  దగ్గర  కదా  ...  ప్లాన్  చెయ్యి  ఈ  వీక్  రోడ్  ట్రిప్ వెళ్దాం  అనింది .. !!!

మనసులో  (మరి  నా  మున్నార్ ,అల్లెప్పి  హౌస్  బోటు  .mommyyyy  :( :( ) .. !!!

పర్వాలేదు ,ఉడిపి  చాలా  బావుంటుంది , నేమలులు , చెట్లు ,సౌపర్నిక  రివర్ , బీచ్  లు .. :D

 కొన్ని  సార్లు  దొరికిన  దానిలోనే  ఆనందం  వెతుక్కో  వాలి  :) :P


6 కామెంట్‌లు:

  1. :)
    సౌపర్నిక. నది పేరు బావుంది.మీరు లిస్టు చేసిన ప్రాంతాల్లో నేను ఊటీ తప్ప మరోటి చూడలేదు. ఎప్పుడు చూస్తానేంటో. గోవా చూసాలెండి.

    రిప్లయితొలగించండి
  2. @ padmarpitha : Ya... naa udipi trip cancelled.. Munnar & alleppy ki planning :)

    రిప్లయితొలగించండి
  3. Next time for a proper planning, you can join some club like GHAC or Hyderabad Adventure club in Hyderabad, Bangalore Mountaineering Club or Bangalore Adventure club in Bangalore.. If you are planning for Himalayas, go with Trek The Himalayas.. It is quite safe and adventurous..

    రిప్లయితొలగించండి