13, జూన్ 2014, శుక్రవారం

చూసారా .... డబ్బు పెంచుకోవటం ఎంత ఈజీ నో :)

ఏంటో  పని చేసినా..   చెయ్యకపోయినా  , ఫ్రైడే వచ్చిందంటే  ఇంక వచ్చే  రెండు  రోజులు  బిందాస్  గా  ఉండచ్చు  అనిపిస్తుంది  :D  కొంచెం  ఆలోచిస్తే ఆ  అయిదు  రోజులు  సంపాదించిన   డబ్బులు  తగలేయ్యటానికే  దేవుడు కాదు..  కాదు  కార్పొరేట్  కంపెనీ లు  సెలవు  ఇచ్చి  ఉంటాయేమో  అనిపిస్తుంది :D లేకపోతే  ఎక్కడ ఎంప్లాయిస్ జీతం అంతా దాచేసుకుని కొత్త  కంపెనీ  స్టార్ట్  చేసేస్తారు  అన్న  భయం  ఏమో  :P

మా  అమ్మ   ఎప్పుడూ  డబ్బులు  భలే  మేనేజ్  చేసేది , ఏమి  చెయ్యకుండానే  బోల్డు  సేవింగ్  చేసేది :) చివరికి  నాకు  మా నాన్నకే  ఇచ్చేది అది వేరే సంగతి అనుకోండి  :D నేను  కూడా  బానే  సేవ్  చేస్తాను ,  డబ్బులు  దాచీ ...   దాచి...   ఒకానొక మంచి రోజున  ఏ  బట్టలు షాప్  వాడి కో చెప్పులు  షాప్  వాడికో  సమర్పించుకునే దానిని ... !!!

  నాకు బాగా   అర్ధం అయిన  సంగతి ఏంటంటే   మనిషికి  financial  literacy  తిండి  ఎంత  అవసరమో  దానికి మించి  అవసరం అని  (డబ్బులు లేకపోతే  తిండి  మాత్రం ఏం దొరుకుతుంది ) ...  50 రూపాయిలు సంపాదించి  5000 చెయ్యగలిగిన  చదువు లేని  వ్యక్తి  , 5000 సంపాదించి  ప్రతీ రూపాయి  బట్టలు  మీద , పిజ్జా chocolates  మీద  తగలేసే ph. d  స్టూడెంట్  మీద  చాలా  బెటర్  కాదంటారా ?



నేను  ఒక  5 ఏళ్ళ  కిందట  మా  బావ  ఇంట్లో  ఒక బుక్ 20 పేజీ లు  చదివి  ఆపేసాను  , బుక్  పేరు  "రిచ్ డాడ్ పూర్ డాడ్ " , మళ్లీ  అదే  పుస్తకం  వారం  కిందట  చదివాను , మొదటి  సారి  చదివినప్పుడు  ఏది  అర్ధం  కాలేదు  ఎందుకంటే  అప్పటికి నాకు  టాక్స్  అంటే  ఏంటో  తెలీదు ,మామూలు చదువు  ఏ  ఎక్కువ  అనుకునే  టైం  కాబట్టి  పెద్దగా  ఏమి  ఎక్కలేదు  ,కానీ మొన్న  చదివి  నప్పుడు  అనిపించింది  ప్రతీ  ఒక్కరూ  ఒకసారి  అయినా  చదవాల్సిన  బుక్ అని, atleast  డబ్బు  సంపాదించే  వాళ్ళు  ఇంకా  ఎక్కువ  సంపాదించాలి  అనుకునే  వాళ్ళు , బాగా  ఖర్చు  చేసే  వాళ్ళు  కూడా  :D  ఎందుకంటే చదివాకా..   ఒక  రెండు  మూడు  రోజులయినా  మీ  ఖర్చులు కంట్రోల్  చెయ్యాలి  , మీకంటూ  ఏదయినా  చేసుకోవాలి  అన్న  ఆలోచన  తప్ప కుండా  వస్తుంది కాబట్టి ... !!

నెలకు  లక్ష  సంపాదిస్తే  30% టాక్స్  కింద  గవర్నమెంట్  కి  pay  చేస్తున్నాం , పోనీ  ఇంకా  మంచి  జాబు తెచ్చుకుని  ఎక్కువ  డబ్బులు  వెనకేసుకుందాం  అన్న  ఆలోచన వినటానికే   చాలా  బాగా అనిపిస్తుంది  గానీ , జీతం  పెరిగే  కొద్దీ  మనం  కట్టే  టాక్స్  కూడా పెరుగుతుంది  ..  !!!  సంపాదిస్తే  income  టాక్స్ , ఖర్చు పెడితే  సర్వీస్ టాక్స్ ,మంచి hotel లో  రెండు  రోజులు ఉంటే luxury   టాక్స్ ,ప్రతీ  దానికీ  వేల్యూ  అడేడ్  టాక్స్ ...  దేవు ... డా  అసలు  డబ్బు  వచ్చే  మార్గం  ఒకటయితే  పోయే  వేంటి  వంద  కనిపిస్తున్నాయి, ఇవి  మనకు ఖర్చులు కానీ  వేరే  వాళ్లకి  income  ఏ  కదా , సో  మనకు  కూడా  సంపాదించటానికి  ఇంకో   99 మార్గాలు ఉన్నాయి కానీ  మనం గుర్తించం ,రిస్క్  తీసుకోము !!!

ఇంతకీ   ఆ  పుస్తకం   లో  మెయిన్  పాయింట్  ఏంటంటే  , మీ  బాలన్స్  .. అదే  బ్యాంకు  బాలన్స్  అప్పు  బాలన్స్  కాదు  :D  పెరగాలంటే  asserts  మీద  మీ  డబ్బులు  పెట్టండి , liabilities  మీద  కాదు

1.Asset  - వీటి  వల్ల  మీరు  డబ్బులు  మీ  జేబు లోకి  వస్తాయి  eg : రియల్  ఎస్టేట్ , investments , మీరు  ఇంట్రెస్ట్  కి  ఎవరికయినా  మీ  డబ్బు  ఇచ్చి  ఉంటే  అవి, ఏదయినా  సరే మీరు  ఒకసారి  పెట్టుబడి  పెడితే  తర్వాత  తర్వాత  వాటి  నుండి  మీరు  ఏమి  చెయ్యకుండా  డబ్బులు  రావాలి, దీనినే  డబ్బు  మీకోసం  పని  చెయ్యటం అంటారు  !!

2. Liability  : మీరు  ఎవరికయినా  ఇవ్వాలిసిన  డబ్బు  లేకపోతే  ఏదయినా  కొన్న  తర్వాత  దానికి  మీరు  ఇంకా ఇంకా  ఇన్వెస్ట్  చేస్తున్నా  అది  liability  .. సో  అలాంటి  వాటి  మీద  మీ  డబ్బు  ఎంత  తక్కువ  పెడితే  అంత  మంచిది.

చూసారా  .... డబ్బు  పెంచుకోవటం  theory ప్రకారం  ఎంత  ఈజీ  నో :) ఇంక    ప్రాక్టికల్ గా  మీ   తిప్పలు మీరు  పడండి , వర్కౌట్  అయితే  నాకు  కొంచెం  చెప్పండి  :P అన్నిటికీ  మించి  పైన  చెప్పిన  పుస్తకం  చదవండి  :D


















1 కామెంట్‌:

  1. చెప్పడం ఈజీగానే చెప్పారు. చెయ్యడం ఎంత కష్టమో తెలుసా? :) ప్రతి సంవరత్సరం టాక్స్ డిక్లరేషన్ లో హోమ్ లోన్ పెట్టడం... ఫెబ్, మార్చ్, ఎప్రిల్ నెలల్లో టాక్స్ క్షవరం చేయించుకోవడం అలవాటుగా మారింది :)
    Heard about 'Rich Dad, Poor Dad' but didn't read that. Now, got a reason to read it. Thanks for the suggestion!

    రిప్లయితొలగించండి