18, జనవరి 2015, ఆదివారం

మీ ఫోన్ పాతది అయిపోయిందా :)

మీ  ఫోన్  పాతది  అయిపోతే  ఇప్పుడు  నేను మీకు  కొనివ్వలేను  కానీ  . :)  అసలు ఎందుకు  అలా  అడిగానంటే , ఇప్పుడు  ఒక  ఆండ్రాయిడ్  app  గురించి  రాద్దాం  అనుకుంటున్నా ...  S.M.T.H (send me to heaven)
ఇంతకీ  ఈ  ఆప్  ఏంటంటే  మీరు  మీ  ఫోన్  ని  పైకి  ఎగరేయ్యాలి   :D  :D  అప్పుడు  ఇది  మీరు  ఎంత  height  కి  ఎగరేసారో   చెప్తుంది   అనమాట  :D  :D  పొరపాటున  నిజంగా   కింద  పడేస్తే  మీ  ఫోన్  కి  స్వర్గ  ప్రాప్తి  అనేమో  అంత సింబాలిక్  గా  పేరు  పెట్టారు  :O :O



ఏంటో  జనాలకి  క్రియేటివిటీ  బోల్డు  పెరిగిపోతుంది  :)

ఈ  ఆప్  వాడాలంటే  either  మీ  ఫోన్  దాని  చివరి  దశలో  ఉండి  ఉండాలి ,or   మీరు మంచి  క్రికెట్  experience  ఉండి  ఉండాలి  (మంచి  catcher గా  :)  )

సరే .   ఇది  పక్కన  పెట్టేస్తే  ఈరోజు  ఒక  సినిమా  చూసా .. ఇంటి  పక్కన  షాపింగ్  మాల్ ఉంటే  డబ్బులు  సూపర్  ప్రాఫిట్స్   , అదేలే  ఆ  మాల్  లో  ఉన్నవాడికి  :D   ఇంతకీ  వెళ్లి  వచ్చింది  "Alone "  కి  బిపాషా  బసు ,ఇంకెవరో  కొత్త  హీరో.. సంగతేంటి  అంటే  ఇది  ఒక  హారర్  సినిమా  అక్కడ  అక్కడా    ఎక్కడ    జనాలు  వెళ్ళిపోతారు  అని  కొన్ని  A  రేటెడ్  scenes .. సౌండ్  ఎఫెక్ట్స్  తప్ప  అంత  ఏమి  లేదు .. !!    కరెక్ట్  గా  టికెట్  డబ్బులిని  10 తో  డివైడ్  చేస్తే  వచ్చే దానికన్నా  గొప్ప  రేటింగ్  కూడా  ఇవ్వటం  వేస్ట్  2. 5/5. 0

మీరు  ఎప్పుడైనా  Thought  Experiment  గురించి  విన్నారా  ??  interesting  గా  అనిపించింది   మీరు  కూడా  ఒకసారి  ఈ  వీడియో  చూడండి   ...

  

 అలాంటి  సోది  సినిమాలు  చూడటం  కన్నా  ఇలాంటి  వీడియోస్  చూస్తూ  టైం  పాస్  బెటర్  కదా ...  .. :)

3 కామెంట్‌లు:


  1. ఫోన్ కుర్రదే నండీ ! మేమే పాత బడి పోయాం ! ఎగిరి చూడాలేమో మరి !

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. ఏమో నండి జిలేబీగారూ, ఈ వయస్సుల్లో మనం మాత్రం ఏమంత ఎత్తుకి ఎగరగలం లెండి.

    రిప్లయితొలగించండి
  3. egirithe oka padhellu vayasu tagge app vasthe bagundu kadandi :)

    రిప్లయితొలగించండి