29, ఆగస్టు 2013, గురువారం

రూపీ రివ్యూ

ఈ మధ్య కాలంలో బాగా మాట్లాడుకుంటున్న విషయాలు ఏంటి అంటే

ఒకటి: తెలంగాణ ,ఆంధ్ర ,రాయలసీమ, హైదరాబాద్   :D   ఏమో వీళ్ళు నాలుగు రాష్ట్రాలు చేసేలా ఉన్నారు

రెండు :నిన్న మా అక్క కాల్ లో  " గోల్డ్  35K  అయిపోయిందంట ,లాస్ట్  month 26k  దగ్గర ఉన్నప్పుడు తీసుకోవాల్సింది అనవసరంగా ఆగాను "  :0  సో రెండోది  gold రేట్ అనమాట

మూడోది : ఉల్లిపాయి 100  ఇంకో హాట్ టాపిక్ ఏంటంటే US  డాలర్ 68  .. సో అక్కడ ఉన్న మన వాళ్ళు  ఎంత వీలయితే అంత   కరెన్సీ ఇక్కడ కు పంపేస్తున్నారు .. కుదిరితే అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ కాబట్టి లోన్  తీసుకుని మరీ  ( దీని గురించి మనం మళ్లీ మాట్లాడుకుందాం )

ఇవి కాక ఇంకా బోల్డు  విషయాలు మాట్లాడుకోవచ్చు ... బాడ్మింటన్   లీగ్ , మొన్న అయిన ఒక actor కూతురి పెళ్ళిలో పెళ్లి కూతురు అక్క పెట్టుకున్న డైమండ్ నెక్లెస్, పవన్ కళ్యాణ్ పక్కన దీపిక పదుకునే  ఇలాంటి వి  బోల్డు రాయచ్చు బట్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు  :D

మెయిన్ టాపిక్ ఏంటి అంటే

అసలు రూపీ ఎందుకు ఇలా మన ప్రైమ్ మినిస్టర్ ఏజ్ దాటి వెళ్ళిపోతుంది , "ఎందుకు .. ఎందుకు నాకు తెలియాలి " అనుకుని కొంచెం స్టడీ చేసి  పూర్తిగా ఏం  తెలుసుకోలేకపోయినా  , తెలుసుకున్న కొంచెం ఏంటంటే

 2009 లో 42 ఉండేది  against  USD  మరి నిన్నో 68 ..  కొన్ని రోజుల్లో  70-72 కూడా అవచ్చు ..పౌండ్ అయితే 100 ఎప్పుడో దాటింది , ఆస్ట్రేలియన్ డాలర్ 60, సింగపూర్ డాలర్  53 అయ్యింది .. {నాకు ఇంత foreign exchange  knowledge  ఉందా  amazing   :P  :) }

సరే ఈ numbers పక్కన పెట్టేస్దాము .. అసలు ఎందుకు ఇలా అయ్యింది ( మనం ఎప్పుడూ అయ్యాకే కదా ఏడ్చేది,సర్వే లు  , చేసేది :) )

ఫ్రతీ country కి imports ,exports ఉంటాయి .. మనం ఎక్కువగా (చాలా ఎక్కువగా ) ఇంపోర్ట్ చేసుకునేవి  రెండు  ఒకటేమో గోల్డ్ , మా అక్క లాంటి వాళ్ళు , అక్క అనే కాదు India లో ఆడవాళ్ళు  especially అమ్మమ్మలు ,నానమ్మలు
 " చీర కట్టుకుని వడ్డాణం పెట్టుకో , అర వంకీ పెట్టుకో ఇది వేసుకో అది వేసుకో  అనేవాళ్ళు ఉన్నంత కాలం ఈ గోల్డ్  కున్న డిమాండ్ తగ్గదు , మన డిమాండ్ కి సరిపడా మనం produce చేసుకోలేము

ఇంకోటి crude ఆయిల్ ,,, దీని గురించి కూడా చెప్పక్కర్లేదు  ;( ;(   exports లో వచ్చిన  సగం పైగా డబ్బు ఇది ఇంపోర్ట్ చేసుకోవడానికే సరిపోవట్లేదు

ఈ రెండూ అంటే మనకు అంత resources లేవు కాబట్టి పక్క దేశం నుండి తెచ్చుకున్నా అర్ధం ఉంది .. కానీ last  two years నుండి fertilizers  imports  30% పెరిగాయి  , coal imports కూడా అదే పరిస్థితి ,  గత కొన్నేళ్లుగా  వందల కోట్లు fertilizer  production కి  మన వాళ్ళు తగలేస్తున్నారు (నిజంగానే ) .. అయినా ఇంకా imports పెంచుకుంటున్నాం అంటే .. మన ప్లానింగ్ అంత అధ్బుతం :( :(  coal కూడా  మనకు చాలా మైన్స్ ఉన్నా   మనం ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితే...  అన్నిటికీ  ఒకటే reason  " lack of proper planning"


ఇవన్నీ కూడా రూపీ వేల్యూ తగ్గటానికి కొంచెం వరకు reason అనుకోవచ్చు  ..

In May, the steep slide of rupee in spite of the net surplus of 240 Cr Dollar raises serious concerns over the issue.  This speaks clearly that there is fundamental weakness in the management of foreign currency.  

ఈ foreign currency  management లో మన కున్న  రెండు flaws ఏంటి  అంటే

ఒకటి  ఇండియా foreign direct investments (FDI) కన్నా  foreign institutionalized investors (FII) మీద ఎక్కువ dependent అది అంత మంచిది కాదు ఒక విధంగా .

FII  అంటే
  • Mutual Funds
  • Hedge Funds
  • Pension Funds
  • Insurance Companies
ఇలాంటివి అనమాట

FDI  అంటే
"mergers and acquisitions, building new facilities, reinvesting profits earned from overseas operations and intra company loans"

In a narrow sense, foreign direct investment refers just to building new facilities.

ఇంకా చెప్పాలి అంటే ,వాళ్ళ దేశం లో ఉన్నట్టు మన దగ్గర కూడా వాళ్ళ business స్టార్ట్ చేసుకోవటం అనమాట

 FDI investments మనం economic productive activities కి use చేసుకోవచ్చు meanwhile FII investments share markets , credit notes కు   వాడుకోవచ్చు .. కానీ ఇక్కడ సంగతి ఏంటి అంటే  FII investments ఏ  టైం లో అయినా వాళ్ళు withdraw చేసేసుకోవచ్చు

అందుకే మనకు nearly  30,000 CR dollar vault లో ఉన్నా  ధైర్యంగా మనం వాటిని use చేసుకోలేము  ఎందుకంటే  profits ఉన్నాయి అనిపిస్తే ఆ investments  FII వాళ్ళు వెనక్కి  తీసుకోవచ్చు

FIIs are frequently putting forward this need and which leads to declining the value of Rupee without any worthy reasons.  


ఇంక రెండో   విషయానికి వస్తున్నా ...

Uncontrolled money borrowing from abroad

 ముందు అనుకునట్టు  abroad లో ఇంట్రెస్ట్ రేట్స్ 1-2 % ఉంటే ఇండియా లో 14-15% దాకా  ఉంటుంది .. సో Industrialists కి అక్కడ నుండి లోన్ profitable .. అందులో సెంట్రల్ GOVT  ఈ మధ్య కాలం లో 70 Cr Dollars  (under certain criteria) దాకా  లోన్ తీసుకోవటానికి  permission ఇచ్చింది  అది మన వాళ్ళు బాగా utilise చేసుకున్నారు (ఇది చెప్పకర్లేదు ) , మళ్లీ super industrialists కి ఓ రేంజ్ లో subsidies (ఇది uncontrollable అనుకోండి )

కానీ ఈ repayment మాత్రం foreign currency లో ఉండాలి అది మళ్లీ వీళ్ళు   Indian మనీ markets నుండే  తెచ్చుకోవాలి దీని వల్ల Dollar డిమాండ్ ఇంకా పెరిగి రూపీ వేల్యూ తగ్గుతుంది ..

అంటే ఒక విధంగా  అక్కడ నుండి లోన్స్ తెచ్చుకోవడం Industrialists కి లాభమే కానీ ఆ burden మాత్రం common people మీద ఇండియన్ ఎకానమీ మీద అనమాట .. Infact  ఈ  నాలుగేళ్ళుగా Rupee వేల్యూ తగ్గడానికి most అఫ్ the reason ఈ Foreign లోన్స్ . :(

లోన్ repayments కి డాలర్ కొనటం ఇప్పటి పరిస్థితుల్లో Industrialists కి కూడా loss యే కదా ...సో ఈ repayments కోసం ఇంకా కొత్త లోన్స్ తీసుకోవటం ( అప్పు తీర్చుకోవడం కోసం కొత్త అప్పు  లాగా )  దీని వల్ల రూపీ వేల్యూ ఇంకా crisis లోకి వెళ్లిపోవచ్చు ... !!!

డాలర్ అన్ని వరల్డ్ currencies కన్నా స్ట్రాంగ్ అవుతుంది , ఆ కంట్రీ లో Global recession shadows  పోతున్నాయి , employment కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇలాంటివి  ఎన్నో డాలర్ strength వెనకున్న సీక్రెట్స్ ..

 జపాన్ ,Europe లో  ఇంకా issues అలానే ఉండటం వల్ల Dollar మోస్ట్ secured investment అయ్యింది , Global markets లో ఇది వరకు యూరో or  వేరే కరెన్సీ లో ఉన్న investments అన్నీ US Dollar కి మార్చేసుకుంటున్నారు ... దీని వల్ల డాలర్ పెరిగింది , వేరే currencies తగ్గాయి (including INR ).

మన ఇండియా కి Europeon Union (EU ) foreign trade లో major partner ,ఇండియా వేరే ఏ country తో compare చేసినా అన్నిటి కన్నా ఎక్కువ EU  మీద investments కోసం dependent ,  quiet natural  గా  అక్కడ  recession and crisis effect ఇండియా మీద చాలా adverse గా ఉంటుంది . Exports ఉండవు ,imports రోజు రోజుకీ పెరుగుతాయి  altogether foreign trade deficit .... !!!

మన కరెన్సీ  మనకు కావలిసినంత ప్రింట్ చేసుకుంటే బావుంటది కదా  :P hold on that thought   అది చేసే...  అప్పుడు Zimbabwe hyper -inflation లోకి వెళ్ళిపోయి లాస్ట్ కి US Dollar కే స్విచ్ అయ్యింది ... :)

డాలర్ రేట్ సరే ఉల్లిపాయ 100 ఎలా రీచ్ అయ్యింది  దీనికి కూడా foreign ట్రేడ్ ఉందా , మనం తినేది పండిచ లేక ఇంపోర్ట్ చేసుకుంటున్నారా ఏంటి  :P

ఈ అమెరికన్ డాలర్ గురించి రాస్తుంటే నేను చదివిన ఒక లైన్  గుర్తొస్తుంది

If American men are obsessed with money, American women are obsessed with weight. The men talk of gain, the women talk of loss, and I do not know which talk is the more boring.
-Marya Mannes

:D :D



9 కామెంట్‌లు:

  1. మీరు ఇంతకుముందు తరచూ రాసేవారు. నేను మీ పోస్ట్ లను ఫాలో అవుతుండేవాడిని. ఈ మధ్య కొంతకాలం అస్సలు కనిపించలేదు. ఏదేమైనా, మళ్ళీ కనిపించారు. సంతోషం.keep writing.

    తాజా పోస్ట్ కూడా బాగుంది.

    రిప్లయితొలగించండి