26, జులై 2013, శుక్రవారం

కొంచెం ... రాత్రి :)

బట్టల షాప్ కి వెళ్లి నచ్చిన డ్రెస్  కొనుక్కొని  వెంటనే  వేసుకునే అదృష్టం నాకేలాగో లేదు .. ఆ మాటకు  వస్తే ముందు నాకు ఎలాగో ఏవి తొందరగా నచ్చవు ఒక వేళ నచ్చినా నాకు "కరెక్ట్ " గా fit  అయ్యే వి దొరకటం almost అసంభవం టైపు :( కొన్న దానిని మళ్లీ ఆల్టర్ చేయించాలి అన్న సగం బద్ధకం వల్ల సగం కొనడం మానేసాను :D 


అలా అని Plus సైజు category కాదు కాని .. అప్పట్లో అంటే పోయిన సంవత్సరం డాన్సు ,gym ,మట్టి మసానమ్ (ఆంటే బాస్కెట్బాల్, రన్నింగ్ ,జాగింగ్ అలాంటివి ) :D  చేసినప్పుడు నా  డ్రెస్ సైజు  S కి కొంచెం ఎక్కువ M కి తక్కువా ఉండేది . 

ఇవన్ని మానేసినా 8 నెలలకు  అసలేం ఏం జరిగింది అంటే ... 


వెళ్ళక వెళ్లక చాలా రోజులకి షాపింగ్ వెళ్ళిన శుభ సమయం ... 

టైం : After 8 Pm 

ఒకానొక ప్రముఖ బట్టల దుకాణం .. అది ఎక్కడ అంటే ఒకానొక ప్రముఖ కాఫీ షాప్ పక్కన , హిమాయత్ నగర్ . అసలు నేను ఉండే అడవి (ఒకానొక ప్రముఖ రాజకీయ వేత్త  భవన నిర్మాణం :D  )   నుండి అంత దూరం ఎందుకు వెళ్ళానో నాకు తెలీదు .. !!!


వెళ్లాను  పో  :(    టైం  ఏమి చెయ్యలేము ... :D 

ఎంట్రన్స్ లో "Fresh Stock " అన్న  బోర్డు చూసి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు .. అసలు ఈ season అంతా  ఓల్డ్ స్టాక్ డిస్కౌంట్ పెట్టే టైం ఏమో .. పోనిలే పుట్టిన రోజుకి మంచి డ్రెస్ కొనుకుందాం అన్న నా ఆశ కి catalyst లా అనిపించింది ఆ బోర్డు . 


అసలు ఈ అర్ధ రాత్రి  అదేలే   కొంచెం...  రాత్రి షాపింగ్ ఎందుకు బయల్దేరాను అంటే .. నా పుట్టిన రోజుకు నేను కొనుక్కోకుండా అందరూ నాకు వాళ్ళు కొని తెస్తుంటే .. చాలా నెలలు నుండి నాలో నిదర పోతున్న షాపింగ్ చంద్రసేన నిద్ర లేచి .. ఎలాగయినా నేను నా selection మాత్రమే ఆరోజు వేసుకోవాలి అని బాగా డిసైడ్ అవ్వడం వల్ల కలిగిన ఆవేశం .. 


అసలు ఇలా బయటకు వెళ్తాను అని అనుకున్న వెంటనే వర్షం మొదలు అయ్యింది .. అయితే నాకేంటి నేను చంద్రమ్మ అన్న  టైపు  లో ఏ మాత్రం ఎక్కడ తగ్గకుండా కారెక్కి నాతో పాటు ఇంకో ఇద్దరు తో  బయటకు వచ్చా . 


Elavator నాకు love note చూపించింది "OUT OF SERVICE" అని , అయినా సరే  20 ఫ్లోర్లు దిగేసి .. ఎనిమిదో ఫ్లోర్ లో elavator వర్క్ అవుతుండటం చూసి మళ్లీ అది  ఎక్కాను . 

 ఇన్ని కష్టాలు పడి ఆ షాప్ కి  వెళ్తే ............ 


వెళ్ళగానే వాడు M లో చూపించాలా  XL ఆ అన్నాడు .. ఆ రెండో మాట వినగానే ఒక్క నిమిషం  నేనేంటి నా సైజు ఏంటి వీడేంటి ఇలా అంటున్నాడు అనుకుని బాగా హర్ట్ అయిన ఇగో ని బుజ్జగించి , నాది western US సైజు 6 / 8. అనగానే వాడేదో అర్ధం అయ్యి నట్టు " అది కాదండి కొన్ని designer wear M లో ఉన్నాయి కొన్ని XL లో ఉన్నాయి ప్రస్తుతం వేరేవి అయిపోయాయి అన్నాడు . 

సరేలే ఈసారికి నిన్ను వదిలేసా అన్న  టైప్ లో ఒక నవ్వు వాడికి పాడేసి .. వాడు చూపిస్తున్న FRESH STOCK  చూడటం మొదలు పెట్టా .. 


పెద్ద గా నచ్చినవి ఏమి లేకపోయినా ఇంత దూరం ఇంత రాత్రి అదేలే కొంచెం ...  రాత్రి  :) వచ్చాను కాబట్టి ఎలాగయినా ఒక డ్రెస్ తీసుకోవాలి అని .. 

trail రూం కి ఒక డ్రెస్ (M ) తీసుకు వెళ్ళా ... 


ఖెవ్వ్.. డ్రెస్ పట్టలేదు :( 

ఎలాగయినా పట్టించాలి ఎందుకు సెట్ అవ్వట్లేదు అని పట్టించేసాను . ఏ మాటకు కా మాట  డ్రెస్ నాకోసమే కుట్టి నట్టు కరెక్ట్ గా పావు అంగుళం కూడా గాలికి చోటు ఇవ్వనట్టుగా ఉంది . ఎరుపు ,గోల్డ్ కలర్ ఏమో నాకు బాగా నప్పింది . నేను వేసుకుని బయటకు రాగానే అలాంటి డ్రెస్ ఇంకో ఇద్దరు ఉంటే చూపించమన్నారు . 


అంతా బానే ఉంది . కట్ చేస్తే 


"మళ్లీ స్టొరీ trail రూం వెళ్ళింది ... వేసుకోవడం వేసేస్కున్నా కానీ తీసే టప్పుడు ఉంది చూడు ..................... ఇంక  ఆ డ్రెస్ లోనే  ఉండి పోవాలా అన్న భయం , M సైజు దాటి పోయిందా నా body అన్న బాధ అన్నీ కలిపి ఏడవలేక గట్టిగా బయట ఉన్న నా ఫ్రెండ్ ని help కి పిలిచి డ్రెస్ వదిలించుకున్నా :D 


గొప్పగా size 6 అని చెప్పిన వాడికి ఎలా మొహం చూపించాలో తెలియక .. ఇది పైన కొంచెం టైట్ అనగానే వాడు . ఏదో sherlock holmes లాగా  డ్రెస్ ని పరిశీలించి "అరెరేయ్ మీరు సైడ్ ఉన్న జిప్ తియ్యలేదనుకుంటా అండి "

 (ఇంకో కెవ్వ్ అలా ఎలా మరిచిపోయి అంత కష్ట పడ్డా (ఆ డ్రెస్ తీసేటప్పుడు పడ్డ బాధ బాబోయ్ :D)  అనుకుని .. నా అజ్ఞానానికి తిట్టుకొని ) మళ్లీ వాడికి ఇంకో నవ్వు పాడేసి  (ఈసారి ఇష్టంగా )


ఇంకో M  డ్రెస్ లోపలకి తెసుకు వెళ్ళా . ఎందుకు అయినా మంచిది door దగ్గర ఉండు అని నా  ఫ్రెండ్ కి చెప్పి  :D :D 


ఆశ్చర్యం ,ఆనందం  ఈసారి డ్రెస్ సూపర్ గా సహకరించింది .. :D 


గెంతుకుంటూ బయటకు వెళ్లి .. ముందు రోజు మా వాళ్ళు నాకు ఆల్రెడీ రెడ్ కలర్ సారీ లాంటి ఘాగ్ర తేవడం వల్ల అదే మోడల్ లో copper sulphate  బ్లూ తీసుకున్నా ...  కానీ  ఎక్కడో ఏదో  తేడా కొడుతూనే ఉంది 


9 వేలు వాడికి వదిలించుకుని .. కార్ ఎక్కి  ఇంటికి  వచ్చా .. 


నా 6th  సెన్స్ మీద నమ్మకం పెరిగి  నా వార్డ్ robe లో వందలాది western మధ్య  ఉన్న  ఒక మూడు ,నాలుగు  చుడీదార్ లు  చూసి .. ....... 


మళ్లీ  కేవ్వ్వ్వ్  :( :( ;(


అచ్చం అలాంటి డ్రెస్ అదే కలర్ లో  లాస్ట్  feb  అంటే 2011 లో అనుకుంటా అదే సదురు షాప్  వాడి జూబ్లి హిల్స్  స్టోర్ లో కొని వేసుకోకుండా అక్కడ ఉంచాను ..... Mommmmyyyyyyyyyyyyy  !!!


ఒకటి ఏమి తెలిసిందంటే నా టేస్ట్ ఎన్ని ఏళ్ళు అయినా అస్సలు మారదనీ ... నా జ్ఞాపక శక్తి ఆ అతడు మూవీ లో MS నారాయణ అన్నట్టు కనిపించి కనిపించనట్టు ,వినిపించి వినిపించనట్టు , గుర్తొచ్చి గుర్తు రాని stage లో ఉన్నట్టు అర్ధం అయ్యింది 

FResh Stock అన్న బోర్డు  గుర్తొచ్చి ఈసారి వచ్చిన తిక్క నాకు ఇంతా అంతా కాదు  :D


నిన్న 12 రూపాయలకి భోజనం ముంబై లో రాజ్ బబ్బర్ అన్న మాట  గుర్తొచ్చి ..12 రూపాయల డ్రెస్  దొరికితే బావుండు అనుకుని (ఈ రెండూ అసాధ్యం లే కానీ  :) ) మళ్లీ చలో హిమాయత్ నగర్ అనుకున్నా .... !!


అది అనమాట  సంగతి


7 కామెంట్‌లు:

  1. హహహ.. ఈ సారి shopping మీ wardrobeలో చెయ్యండి.. మళ్ళి ఇంకో dress బయటపడొచ్చు :)

    రిప్లయితొలగించండి
  2. Nijame.. :) after this experience fresh stock ardham telsindhi :)

    రిప్లయితొలగించండి
  3. bagundi amma chandramma....:)

    aina ammayilaki nu correct example nikitha, meeku em unnayi, enni unnayi anedi teliyadu, when it comes to clothes and ornaments....:P

    Papam appatiki aa lift nee weight large nunchi medium chesi untundi..think it is very loyal to uuuuuu.....:P...

    naaku oka doubt mee frend ki kuda kanapadaleda zip papam.....:P, may be nuvvu kuda anand movie lo heroine life ambition pettukunnattu 12rs ki dress target petukunte ekkado dorukutundi le....

    Dont forget to post your pics on ur b'day in that blue dress, with ur unforgettable expression...at time u found duplicate////

    Best narration heard in the near past....




    రిప్లయితొలగించండి